బాలీవుడ్ లో భారీ ధర పలికిన అల్లుఅర్జున్ చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2020 2:36 PM GMT
బాలీవుడ్ లో భారీ ధర పలికిన అల్లుఅర్జున్ చిత్రం

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన చిత్రం 'అల వైకుంఠ‌పురంలో'. సంకాంత్రి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం థియేట‌ర్ల‌లో క‌న‌క వ‌ర్షం కురిపించింది. ఈ చిత్రం అటు నిర్మాత‌ల‌తో పాటు ఇటు డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

తెలుగు చిత్రాల‌ను స‌క్సెస్ సాధించిన చిత్రాల‌ను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తుండ‌డం ఇటీవ‌ల కాలంలో బాగా పెరిగింది. బ‌న్ని-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హ్యాటిక్ కొట్టిన ఈ చిత్రానికి బాలీవుడ్‌లో మంచి గిరాకి ఉంది. అశ్విన్ వర్దె అనే బాలీవడ్ నిర్మాత రూ.8కోట్ల‌కు ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఈయ‌న గతంలో తెలుగు లో సంచలనం సృష్టించిన “అర్జున్ రెడ్డి”ని కూడా సొంతం చేసుకున్నాడు. అతడికి “అల వైకుంఠపురంలో” సినిమా పిచ్చ పిచ్చగా నచ్చడంతో ఈ సినిమాపై భారీగా ఖర్చుల పెట్టినట్లు తెలుస్తుంది.

బాలీవుడ్‌లో తెర‌కెక్క‌కున్న ఈ చిత్రంలో అక్ష‌య్ కుమార్ హీరోగా న‌టించ‌నున్న‌ట్లు బాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించి అధికార వివ‌రాలు ప్ర‌క‌టించ‌నున్నారు. కాగా.. అశ్విన్ వర్దెతో కలిసి అల్లు అరవింద్ కూడా ఈ రీమేక్ ని సంయుక్తంగా నిర్మించాలని అనుకుంటున్నారట. చూడాలి మరి ఈ రీమేక్ గురించి ఏం కబుర్లు అందనున్నాయో.

తెలుగు నిర్మాత‌ల‌కు ఇలా మ‌రొక ఎనిమిది కోట్ల రూపాయ‌లు జేబులో ప‌డ్డాయ‌న్న‌మాట‌.

Next Story
Share it