మద్యం మానేశారా.. మీ బాడీలో వచ్చే మార్పులు ఇవే.!
By అంజి Published on 1 April 2020 9:52 AM GMTహైదరాబాద్: మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆయుష్షు తగ్గిపోతుంది. మందు తాగడం మంచిది కాదు. మద్యం తాగితే త్వరలోనే ప్రాణం పోతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది ఇలాంటివి తరుచూ మందుబాబుల చెవుళ్లో నానుతుంటాయి. అయితే మందు తాగడం మంచిదేనని.. అది కూడా మితంగా మాత్రమే తాగాలని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో చాలా మంది రోజంతా కష్టపడి.. సాయంత్రం కాగాగే మద్యం బాటిల్ ఎత్తేస్తారు. ఆ రోజు సంపాదించిన కొద్ది మొత్తాన్ని తాగడానికే ఖర్చు పెడతారు. ఇలా రోజు తాగుతూ తాత్కాలిక ఆనందాన్ని పొందుతూ.. జీవితకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బార్‌లు, వైన్‌షాపులు మూసివేశారు. దీంతో గత కొన్ని రోజులుగా మందుబాబులు మద్యానికి దూరమయ్యి.. ఇంటికి పరిమితమయ్యారు.
మద్యం తాగడం మానేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలిసింది. ఇటీవల జరిపిన పరిశోధనల్లో మద్యం తాగడం మానేయడం వల్ల అద్భుత ఫలితాలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ఎంతో మందికి మద్యం మానేయడం వల్ల కలిగి ప్రయోజనాలు తెలియక.. ఇష్టానుసారంగా మద్యం తాగేస్తుంటారు. అయితే ఒక నెల పాటు మద్యం మానేసినా.. గుండె, లివర్, బాడీ ఆరోగ్యవంతంగా మారుతాయి. మళ్లీ తాగడం మొదలుపెడితే.. శరీరంలోని అవయవాలు మళ్లీ చెడిపోతాయి. ఒక నెల పాటు మద్యం మానేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.. అవేంటో చూద్దాం..
మన శరీరంలో లివర్ అత్యంత ముఖ్యమైన అవయం. అది పాడైతే.. శరీరంలోని చాలా భాగాలు సరిగా పని చేయవు. మనం మద్యం తాగతే.. ఖచ్చితంగా లివర్ పాడవుతుంది. అదే ఒక నెల పాటు మద్యం మానేసిన.. మన లివర్ తిరిగి మెరుగువుతుంది. శరీరం లోపల ఎన్నో పనులు చేసే లివర్ బాగుండాలంటే.. మద్యం తాగడం పూర్తిగా మానేయాలి. మద్యం తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండెకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. బ్లడ్ సర్క్యలేషన్ ఆగిపోయి.. గుండె పోటు వంటి ప్రమాదం తలెత్తుంది.. అదే మద్యం మానేస్తే.. కొవ్వులు పూర్తిగా కరిగిపోతాయి. గుండెకు రక్త సరఫరా సరైన పద్దతితో సాగుతుంది. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారు గుండెను కాపాడుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
అలాగే విపరీతంగా మద్యం తాగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనల్లో తేలింది. లివర్, బ్రెస్ట్, కొలొరెక్టర్ క్యాన్సర్లు సోకే ప్రమాదం ఉంది. అయితే మద్యం తాగడం మానేస్తే.. దీని నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది. మద్యం తాగేటప్పుడు కొవ్వు పదార్థాలు ఉండే స్నాక్స్‌ను ఎక్కువ మంది తింటుంటారు. దీంతో శరీరంలో కొవ్వు బాగా పెరిగి.. చాలా మంది బరువు పెరుగుతారు. అయితే ఓ నెల పాటు మద్యాన్ని మానేస్తే.. ఖచ్చితంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. మద్యం మానేయడం వల్ల బ్రెయిన్ కూడా చాలా షార్ప్‌గా పని చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.