వార ఫలాలు :- ఆగస్టు 30వ తేదీ ఆదివారం నుండి సెప్టెంబర్ 5 శనివారం వరకు

By జ్యోత్స్న  Published on  30 Aug 2020 2:26 AM GMT
వార ఫలాలు :- ఆగస్టు 30వ తేదీ ఆదివారం నుండి సెప్టెంబర్ 5 శనివారం వరకు

విశేష పర్వదినములు

30-9-2020 సోమవారం కల్కి ద్వాదశి

1-9-2020 మంగళవారం అనంత పద్మనాభ చతుర్దశి

2-9-2020 బుధవారం మహళయ పక్ష ప్రారంభం. 4-9-2020 శుక్రవారం బృహత్యుమా వ్రతం, ఉండ్రాళ్ళతద్ది

5-9-2020 శనివారం సంకష్టహర చతుర్థి

మేష రాశి :- ఈ రాశి వారికి స్త్రీ సౌఖ్యము, ధనలాభము, శుభ ఆదాయము ఆనందాన్ని ఇస్తాయి. అందువల్ల మీరు కొంత వరకు కుటుంబం తోను స్నేహితులతోను ఆనందాన్ని పంచుకో గలుగుతారు. పంచమం లో ఉన్న రవి బుధులు వ్యతిరేక భావంతో పని చేస్తున్నారు కాబట్టి కొంత రవి బుధులు 5 ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక ఒత్తిళ్లను కలుగజేస్తారు. తొమ్మిదవ ఇంట్లో గురుడు, నాలుగవ ఇంట్లో శుక్రుడు ఇద్దరు కూడా అనుకూల మైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి వీరికి ఈ వారం అనుకున్న పనులన్నీ సగం పైగా నెరవేరుతాయి. పదవ ఇంట్లో శని చంద్రుడి తో కలిసి ఉండడం మాత్రం రాజకీయ ఒత్తిళ్లకు గురి చేసి మానసిక ఇబ్బంది తప్పదు. తొమ్మిది ఇంట్లో కేతువు తన నోటి మాట చేతనే శత్రువు భావాన్ని ఇతరులకు కలుగజేస్తూ ఉంటాడు. లగ్నాధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉండటం వల్ల అనుకూల ప్రతికూలతల మధ్య నిలదొక్కుకునేలా ఉంటుంది ఈవారం వీరికి 50 శాతం మాత్రమే శుభఫలితాలు ఉన్నాయి. అశ్విని నక్షత్ర జాతకులకు విపత్తార అయింది ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది మంచి ఫలితాలు లభిస్తాయి. కృత్తిక 1వ పాదం వారికి జన్మతార అయింది సమస్యలు పెద్దవిగా కనబడతాయి.

పరిహారం :- బుధవారంనాడు మహాలయ పక్షం ప్రారంభము. ఆరోజు ఎవరికైనా భోజనం పెట్టండి. మంగళవారం నాడు శ్రీ మహావిష్ణువును దర్శించండి విష్ణు సహస్రనామ పారాయణ మంచి ఫలితాన్ని చేయండి.

వృషభ రాశి :- ఈ రాశివారికి కుటుంబసౌఖ్యం ధనలాభము కొంత ఆనందాన్ని కలిగిస్తునప్పటికీ మరోవైపు ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అడుగడుగునా అగౌరవం. పెద్ద వారితో ఏ మాట అనకుండానే అవమానాల పాలు అవుతుండడం ఇవి ఈ వారంలో వీరిని చాలా ఇబ్బందికి గురి చేస్తాయి. మంచి చేద్దాం అనుకున్న అది చెడుగా పరిణమించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చంద్రుడు వారం ప్రారంభంలో ఇబ్బంది కలిగించినా రెండు రోజుల తరువాత నుండి శనివారం వరకు శుభ ఫలితాలను ఎక్కువగా ఇస్తాడు. బుధ శుక్రులు అనుకూలతతో గతంలో మీరు పొందాలనుకున్నా వస్తువులని పొందుతారు. శత్రువులపై కొంత విజయాన్ని కూడా సాధిస్తారు. సాధ్యమైనంత వరకూ మీరు నోటిని అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది. ఏదైనా విలువైన వస్తువు పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది జాగ్రత్త వహించండి. శని భాగ్య స్థానంలో ఉన్నప్పటికీ మీకు అనారోగ్యాన్ని సూచిస్తున్నాడు. గ్రహాల అనుకూలతలు తక్కువ . మీకు ఈ వారంలో 42 శాతం మాత్రమే శుభఫలితాలు ఉన్నాయి. కృత్తిక 2 3 4 పాదాలు వారికి జన్మతార అయింది కాబట్టి ప్రతి సమస్య పెద్దగా కనిపించే ఇబ్బంది పడతారు. రోహిణి నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది కాబట్టి మంచి ఫలితాలే ఊహించవచ్చు. మృగశిర 1 2 పాదాలు వారికి మిత్రతార అయింది శుభఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : శనికి జపం చేయించండి నల్ల నువ్వులు నల్ల వస్త్రములు దానం చేయండి. గురువారం నాడు దత్తాత్రేయ చరిత్ర లేదా గురు ప్రార్థన చేయండి. నానబెట్టిన శెనగలు బెల్లము ఆవుకి తినిపించండి.

మిధున రాశి :- ఈ రాశి వారికి సంపద సౌఖ్యము భూషణాలతో ఆనందాన్ని పొందుతారు. రాహు కేతువు ల ప్రభావం చేత శత్రువుల బాధ ఎక్కువగా ఉంది. అష్టమ శని ప్రభావం చేత కుటుంబ పరంగా ఆత్మీయ మిత్రుడు ని దగ్గర పొందాలని మరింత దూరం చేసుకునే శాశ్వతంగా దూరం చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. లగ్నంలో ఉన్న శుక్రుడు సప్తమంలో ఉన్న గురుడు వీళ్ళకి సౌకర్యాన్ని ఆనందాన్ని ఎక్కువగా కలిగిస్తారు. శుక్రుడు ద్వితీయంలో కి వెళ్ళిన తర్వాత మాత్రము ఆకస్మికంగా ధన లాభం పొందగలుగుతారు. మూడవ ఇంట్లో ఉన్న రవి సంపదను కలగ చేస్తుంటే అదే స్థానంలో ఉన్న బుధుడు శత్రువు పీడ కలగజేసి వ్యాకులతకు గురి చేస్తున్నాడు. ఈవారం కొంచెం వీరికే అనుకున్నదానికంటే భిన్నంగా సాగుతుంది. మీ ఆరోగ్యం మీద మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఉత్సాహంతో జీవించడానికి ప్రయత్నించండి. వీరికి ఈ వారంలో 50 శాతం సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. మృగశిర 3 4 పాదాలు వారికి మిత్ర తార అయినందువల్ల శుభప్రదమైన ఫలితాలున్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు నైధన తార అవడంవల్ల వ్యతిరేక ఫలితాలు పూర్తిగా ఉన్నాయి. పునర్వసు 1 2 3 పాదాలు వారి సాధన అయింది కాబట్టి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి.

పరిహారం :- మంగళవారం శనివారం గణపతికి సుబ్రమణ్యేశ్వర స్వామికి పూజలు జరిపించండి. సోమవారం నాడు కల్కి ద్వాదశి దానధర్మాలు చేయండి.

కర్కాటక రాశి :- ఈ రాశివారు ఈ వారంలో విశేష ధనాన్ని శరీర ఆరోగ్యాన్ని పొందుతూ సుఖ జీవనం గడుపుతారు. వీరికి పదవ ఇంట్లో కుజుడు అనుకున్న పనులకు అవకాశాలు కల్పించి నెరవేరుస్తాడు. బుధుడు మీరు గతంలో చేసిన పని యొక్క ఫలితాలను ఇప్పుడు ఇస్తాడు. అది వీరి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఎంత చేసిన వీరికి గురువు అనుకూల తక్కువగా ఉండటం చేత నిరంతరము ఆలోచనతోనే సాగిపోతారు. సప్తమం లో ఉన్న శని దృష్టి వీరికి ఎల్లవేళలా విచారాన్ని కలిగిస్తూనే ఉంటుంది. ఆదాయం కుంటుపడుతుంది. వ్యయం పెరుగుతుంది దీని వల్ల కొంచెం ఒత్తిడి తప్పనిసరి అవుతుంది. మిత్రులు బంధువులు సహకారం సకాలంలో అందక, విరక్తిని పొందే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ నిగ్రహ అవసరం ఎంతైనా ఉంది. శుక్ర ప్రభావం చేత మాత్రమే కళలతో జీవిస్తున్న వారికి ఆనందం కలుగుతుంది. అంతేకాదు ఈ వారంలో వీరి 50శాతం శుభఫలితాలను పొందగలుగుతారు. పునర్వసు 4వ పాదం వారికి సాధన తార అయింది కాబట్టి ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అవడం వల్ల ఎక్కువగా చెడు ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఆశ్లేష నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది కాబట్టి శుభ ఫలితాలు కలిసొస్తాయి.

పరిహారం :- రెండవ తేదీ బుధవారం పితృదేవతల అనుకూలం కోసం పేదవారికి అన్నదానాలు చేయండి. గురువారం నాడు గురు స్తోత్ర పఠనం అన్నివిధాలా మీకు లాభిస్తుంది.

సింహరాశి :- ఈ రాశి వారికి నికర ఆదాయం ఈ వారంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆ వచ్చింది అంతా కూడా అనారోగ్యంతోనే అనాలోచితంగా పోగొట్టుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. భాగ్య కుజుడు వీళ్ళకి మూలధనాన్ని కొంత ఖర్చు పెట్టిస్తాడు. లగ్నంలో ఉన్న బుధుని చేత కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. సింహరాశి లోనే ఉన్న రవి వల్ల సంపదలు కలిగి లాభం ఎక్కువగా ఉంటుంది. పంచమం లో ఉన్న గురుడు సంపత్ లాభాన్ని కలిగిస్తున్నాడు. అలాగే లాభ వ్యయాల్లో సంచరించే శుక్రుడు కూడా వీరికి కావలసిన ధనసంపాదన ఇస్తూ సుఖసౌఖ్యాలతో కలుగజేస్తాడు. దీనికి తోడుగా శని వల్ల విశేష ధన ప్రాప్తి లేదా ఆదాయాలు మిత్రుల వల్ల మూలధన నిధులు ఇవన్నీ సంప్రదించే అవకాశం ఉంది. స్థిరాస్తి అమ్మ కాదు లేవన్న ఉన్నట్లయితే నెరవేరుతాయి. పుష్కలంగా ధనం చేతినిండా ఉంటుంది. కొన్ని చిక్కులు ఉన్నా అవి గురుని ప్రభావం చేత తగ్గుతాయి. ఈ వారంలో మీరు 58 శాతం శుభఫలితాలను పొందే అవకాశం ఉంది. మఖా నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టి ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయి. పుబ్బ నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది కాబట్టి ఫలితాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఉత్తర 1వ పాదం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు మానసికంగా భయపెడతాయి.

పరిహారం :- నానబెట్టిన పెసలు బెల్లం కలిపి బుధవారం నాడు ఉదయం తెల్లవారేసరికి ఆవుకి తినిపించండి. ఉలవలు మినుములు దానం చేయండి.

కన్యారాశి :- ఈ రాశి వారికి విశేష ధనలాభము ఒకరికి ఆనందం కలిగిస్తూ ఉన్నప్పటికీ కార్య హాని ఎక్కువగా ఉంది. దీనివల్ల వీరు మానసికంగా ఎక్కువ ఇబ్బంది పొందుతారు. బుధుడు కూడా దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఈ ప్రభావం చేత వీళ్ళకి మానసిక శారీరక రుగ్మతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. శుక్ర ప్రభావం చేత వీరికి సంతోషము ధనలాభం కనిపిస్తున్నప్పటికీ గురు గ్రహ ప్రభావం తగ్గడం వల్ల వీళ్ళు అనుకోని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంట్లో ఉన్న పిల్లల పెద్దల ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఏర్పడుతుంది. ఇంట్లో కళ్యాణ కారక శుభ ఫలితాలు ప్రయత్నం చేయండి. మీ ద్వారా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వారం మధ్యలో అనగా బుధ గురువారాల్లో మీరు మంచి మాటలను కుటుంబసౌఖ్యం పొందే అవకాశం ఉంది. గోచార వశాత్తు మీకు 34 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. ఉత్తర 2 3 4 పాదాలు వారికి జన్మతార అయింది కాబట్టి మానసిక ఇబ్బందులు బాధిస్తాయి. హస్త నక్షత్ర జాతకులకు మాత్రం పరమ మిత్రతార అయింది కాబట్టి శుభాశుభ ఫలితాలు మధ్యస్తంగా ఉంటాయి. చిత్త 1 2 పాదాలు వారికి మిత్ర తార అయింది కాబట్టి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పరిహారం :- నానబెట్టిన పెసలు బుధవారం నాడు ఉదయం బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. మంగళవారం నాడు విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. శుక్రవారం నాడు అమ్మవారి పూజ గణపతి పూజ మంచి ఫలితాలు ఇస్తాయి.

తులా రాశి :- ఈ రాశి వారికి ఆనందము స్థిరాస్తి వృద్ధి ధనలాభము ఫలితాలు ఎక్కువగానే ఉన్నాయి. శత్రువుల వల్ల ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మీకు రాహుకేతువుల ప్రభావం చేత సర్వ సంపదలు సమకూరుతాయి. గురు బలం తగ్గినా శుక్ర బలం చేత మీరు కొన్ని పనులను నెరవేర్చుకో గలుగుతారు. లాభంలో ఉన్న రవి బుధులు కావలసినంత ధనాన్ని ఆనందాన్ని కుటుంబంతో కలిసిమెలిసి పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మీకు పారంపర్యంగా వచ్చే వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే అవి ఇబ్బందులు కలగజేస్తాయి. ఉదర రోగం ఒకటి కనిపిస్తోంది ముందుగానే జాగ్రత్తపడండి. ఈ వారంలో మీరు కుటుంబంతోనూ మిత్రులతోనూ శత్రువులతో కూడా శారీరక మానసిక ఆనందాన్ని పొందగలిగే అవకాశం ఉంది. చంద్ర ప్రభావం చేత కొన్ని పనులకు మాత్రము విఘ్నాలు తప్పవు. మంచి పనులన్నీ వాయిదా పడతాయి. ఈ వారంలో మీరు 50 శాతం శుభ ఫలితాలను పొందగలరు. చిత్త 3 4 పాదాలు వారికి మిత్రతార అయింది శుభఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు నైధన తార కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. విశాఖ 1 2 3 పాదాలు వారికి సాధన తార అయింది కాబట్టి శుభ ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- చంద్రునికి బియ్యము తెల్లని వస్త్రములు దానం చేయించండి. పెరుగు వెండి చంద్రుని దానం చేసిన చాలా మంచిదే. శుక్రవారం నాడు అమ్మవారి పూజ గణపతి పూజ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి కార్యము ధనలాభము శిరస్సు వృద్ధి ఇవన్నీ కూడా వరుసగా కలిసొస్తాయి. గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని మిత్రులు బంధువులతోనూ కుటుంబ సభ్యులతో పొందగలుగుతున్నారు. ఆకస్మికంగా మీ ధనలాభం పొందగలుగుతారు అంతేకాదు మీకు ఉన్నటువంటి అప్పులు ఆస్తులను కూడా బేరీజు వేయబడి ఆస్తి మాత్రమే మిగులుతుంది. స్థిరాస్తులు కొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. గత వారంలో ఫలితాలు కి అనుకూలంగా ఈ వారం కూడా మంచిగా ఉంటుంది. మీ మానసిక ఆందోళన కొన్ని పనులకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది ఒక విలువైన వస్తువులు ఎక్కడ మర్చిపోవడం గానీ జరుగుతుంది ఆ కారణంగా మీరు ఇతరుల చేత మాట కూడా అవకాశం కూడా లేకపోలేదు కొంచెం మాట అదుపులో పెట్టుకోండి. ఈ వారంలో మీకు 58 శాతం మాత్రమే అనుకూలత ఉంది. విశాఖ ఒకటో పాదం వారికి సాధన తార అయింది కాబట్టి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అనురాధ నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది కొద్దిగా వాయిదా వేయడం మంచిది జ్యేష్ట నక్షత్ర జాతకులకు మాత్రమే ఫేమస్ అయింది శుభఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సాధిస్తారు కూడా.

పరిహారం :- రాహు కేతువులకు పూజ జరిపించండి మినుగులు ఉలవలు దానం చేయండి. మంగళ శుక్రవారాల్లో విష్ణు సహస్రనామ పారాయణ దుర్గా సూక్తం పారాయణ ఆరాధన మీకు రాహు కేతు ప్రభావాన్ని తగ్గిస్తుంది.

ధను రాశి :- ఈ రాశి వారికి కొద్దిపాటి ధనలాభము భూసంపద ఆనందాన్ని కలిగించినా కూడా ఈ వారంలో వ్యతిరేక ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పక తప్పదు. ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు ఆరోగ్యం విషయంలో ని ఆర్థిక విషయాల్లో ని శ్రద్ధ కనబరచడం మంచిది. మీ శ్రేయస్సు కోరే వారిని సంప్రదించి మీ తాలూకా ఆరోగ్యము స్థిరాస్తి ఇలాంటివన్నీ కూడా దగ్గరికి చేర్చుకోండి. నిరంతరము ఎవరో ఒకరు దగ్గర గా ఉంచుకోవడం వారితో సన్నిహితంగా మెలగటం చాలా అవసరంగా కనిపిస్తోంది. అన్ని గ్రహాలు హెచ్చరికలను, భయాన్ని సూచిస్తున్నాయి. గ్రహముల ప్రతికూలత మీ జాతకానికి ఈవారంలో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీ అంతట మీరు గా ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోండి లేదా గురువు ను సంప్రదించండి. ఇతరుల పైనే ఎక్కువగా ఆధారపడకండి. ఆత్మబుద్ధి సుఖం ఛైవ అనే నిర్ణయానికి రండి. శత్రువులు మరియు స్త్రీ మూలకంగా కూడా మీరు నిందలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఈ వారంలో 18 శాతం మాత్రమే మంచి ఫలితాలను పొందుతారు. మూలా నక్షత్ర జాతకులకు విపత్తార అయింది ప్రతికూలత ఎక్కువగా ఉంది పూర్వాషాడ నక్షత్ర జాతకులకు సంపత్తార ఏమైంది కొన్ని విషయాల్లో బావుంది ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి మాత్రము జన్మతార అయింది కాబట్టి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది

పరిహారం :- నవగ్రహ ప్రదక్షణలు చేయండి. నవగ్రహాలకి మండపాలు వేసి దానధర్మాలు ఎక్కువగా చేయండి. ఏకాగ్రత కోసం యోగ సాధన చేయండి

మకర రాశి : ఈ రాశి వారికి బంధుమిత్రులతో కలిసి సుఖ జీవనాన్ని విడుదలయిన పొందే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా సరదాగా ఈవారం గడుపుతారు. మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది కలుగజేస్తుంది శత్రువుల పీడ ఎక్కువగా ఉండటం చేత ఈ ప్రభావం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. అష్టమంలో ఉన్న రవి అనారోగ్యాన్ని సూచిస్తుంటే అక్కడే ఉన్న బుద్ధుడు మాత్రమే మీ కోరిక నెరవేర్చడానికి ప్రయత్నిస్తాడు అయితే వారి పైన ఇతర గ్రహాల ప్రభావం ఉండటం చేత కూడా నష్టం వాటిల్లే అవకాశం అపకీర్తిని విపత్తులు సంభవించే అవకాశం లేకపోలేదు. ధనాదాయం మాత్రమే బాగుంటుంది శత్రువుల బాధ రోగభయం 2 మిమ్మల్ని వెన్నంటి ఉంటాయి. 42 శాతం మాత్రమే మీరు ఈ వారంలో శుభ ఫలితాలు. పొందగలుగుతున్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు జన్మతార అయింది. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంది. శ్రవణ నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది శుభ ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ధనిష్ట 1 2 పాదాలు వారికి అయింది చాలా మంచి ఫలితాలని ఆశించవచ్చు.

పరిహారం :- జన్మ శనికి జపం చేయించండి రవికి ప్రీతిగా గోధుమలు కుజగ్రహానికి ప్రీతిగా కందులు దానం చేయండి. శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేయండి శనివారం నాడు గణేష్ పూజ చేయండి.

కుంభ రాశి :- ఈ రాశి వారికి ధనాదాయం ధనలాభము బంధుదర్శనము ఇవి మిమ్మల్ని ఆనందింప చేస్తాయి. ఈ వారంలో మీరు అనుకున్నవన్నీ నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాకచక్యంగా మీరు వెళ్ళినట్లయితే పూర్వపు స్థితిగతులను కూడా పొందగలిగే అవకాశం ఎక్కువగా ఉంది కానీ తొందరపడితే మాత్రం ఇబ్బందులపాలు అవుతారు అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది శుక్రుని యొక్క ప్రభావంచేత ఏర్పడుతోంది గనుక దేంట్లో కూడా మీరు ముందుకు ప్రవేశించి సలహాలు సంప్రదింపులు చేయకండి. మీకు ఎంత నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా అది ప్రదర్శించే అవకాశం ఈ వారంలో మీకు లేదు. మీరు ఎంత మానసికంగా శారీరకంగా ప్రశాంతంగా ఉంటే మాటలు తగ్గించుకుంటే అంత ప్రయోజనం ఉంటుంది. రాహుకేతువులు ధనవ్యయం అని సూచిస్తున్నారు కాబట్టి జాగ్రత్త వహించండి. పాత కుటుంబాన్ని పాత మిత్రులను కలుసుకుని హాయిగా ఆనందంగా ఉండగలుగుతారు. ఈ వారంలో 50% శుభ ఫలితాన్ని పొందగలుగుతున్నారు. ధనిష్ట 3 4 పాదాలు వారికి మిత్రతార అయింది శుభఫలితాలు ఎక్కువగా ఉన్నాయి శతభిషా నక్షత్ర జాతకులకు నైధన అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్వాభాద్ర 1 2 3 పాదాలు వారికి సాధన తార అయింది శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : శనివారం నాడు శనికి జపం చేయించండి నువ్వులు నల్ల వస్త్రాలు దానం చేయండి. రాహు కేతువుల పూజ మంచి ఫలితాలను ఇస్తుంది మినుములు ఉలవలు దానము మంచిది. అమ్మవారి పూజ అవసరం.

మీన రాశి :- ఈ రాశి వారికి లాభము కుటుంబ స్థానము స్త్రీ సౌఖ్యము బంధుమిత్రుల దర్శనము ఎక్కువ ఆనందాన్ని కలగజేస్తాయి. ఆరవ ఇంట్లో ఉన్న రవి బధులు మీకు శత్రు నాశనాన్ని అలంకార ప్రాప్తిని సూచిస్తున్నారు. కష్టానికి తగిన ఫలితం మీకు ఈ వారంలో లభించకపోవచ్చు దీనికి ప్రభావము గురుడు అంటే మీ ఆలోచనా విధానంలో తేడా రావడం సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేకపోవడం వీటికి కారణములు. ఇతరుల ప్రభావం మీ పైనే ఎక్కువగా పని చేయబోతున్నది. దానిని నివారించండి. సొంత ఆలోచనలతో ఉన్నట్లయితే శుక్ర ప్రభావం చేత మీకు స్త్రీ సౌఖ్యము స్థిరాస్తి వృద్ధి బంధుమిత్రులు దర్శనం లభిస్తాయి. వీటిని వినియోగించుకున్నట్లు అయితే మీరు ఈ వారంలో మంచి ఫలితాలను బాగా పొందగలుగుతారు. రాహు కేతువు ల ప్రభావం మాత్రం మీ పైన ఎక్కువగా ఉంది. వారి వల్ల శత్రు వృద్ధి గౌరవ సంప్రదాయ భంగము కానున్నాయి . ఈ వారంలో ఈ రాశి వారికి 50 శాతం శుభ ఫలితాలు సంప్రాప్తి అవుతున్నాయి. పూర్వాభాద్ర 4వ పాదం వారికి సాధన తార అయింది మంచి ఫలితాలు ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ప్రత్యక్తార వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది కాబట్టి మంచి ఫలితాలు పొందగలుగుతున్నారు.

పరిహారం :- సద్గురు దర్శనం వారిని ఆరాధించండి. గురువార నియమాలు పాటించండి. శనగలు దానం చేయండి. శుక్రవారం దుర్గాదేవి పూజ చేయండి మంచి ఫలితాన్ని పొందగలుగుతున్నారు

Next Story