వారఫలాలు తేది 11-09-2022 నుంచి 17-09-2002 వరకు

Weekly horoscope from September 11 to 17.సంఘంలో పెద్దలతో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి.

By జ్యోత్స్న  Published on  10 Sep 2022 11:30 PM GMT
వారఫలాలు తేది 11-09-2022 నుంచి 17-09-2002 వరకు

మేష రాశి :సంఘంలో పెద్దలతో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. దూరప్రాంత బంధువుల నుండి అందిన ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ పరంగా అనుకూల ఫలితాలు పొందుతారు. వారం ప్రారంభమున స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి.

పరిహారం : నవగ్రహారాధన చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వృషభ రాశి :వాహన సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆత్మీయులతో మాట పట్టింపులు ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సంబంధిత సమస్యలు బాధిస్తాయి. వారాంతమున ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.

పరిహారం : వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మిథున రాశి : ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయాలు లాభిస్తాయి. సోదరులతో భూ సంబంధిత వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ప్రారంభమునకు ఆటంకాలు తొలగుతాయి. సంతాన విద్యా విషయాలలో దృష్టి సారిస్తారు. వారం మధ్యలో బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.

పరిహారం : హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి : గృహ నిర్మాణ ప్రారంభమునకు ధనసహాయం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల సహాయంతో నూతన అవకాశాలు లభిస్తాయి. ఇంటా బయట ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది.సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో పెద్దల నుండి ఆసక్తికర విషయాలు సేకరిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వారం మధ్యలో ప్రయాణమున మార్గ అవరోధాలు కలుగుతాయి. వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు పొందుతారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూరప్రాంత బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.

పరిహారం : విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

సింహ రాశి : విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పాత మిత్రులతో చిన్ననాటి విషయాల గురించి చర్చిస్తారు. గృహమునకు ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన లాభాలు అందుతాయి. వారాంతమున సోదరులతో అనుకోని విభేదాలు తలెత్తుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. నూతన వ్యాపార ప్రారంభమునకు పెట్టుబడులు అందుతాయి.

పరిహారం : శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కన్య రాశి : సోదరులతో భూ సంబంధిత వివాదాలు పరిష్కరించుకుంటారు. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. తెలివితేటలతో దీర్ఘకాలిక సమస్యలు రాజీ చేసుకుంటారు. ప్రయాణాలలో కుటుంబ సభ్యులతో మీ మాటతో విభేదిస్తారు. గృహ నిర్మాణానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారపరంగా నూతన ప్రణాళికలను అమలు చేసి పుంజుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వారం చివరన ధనవ్యయ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగి ఆర్ధిక లాభాలు పొందుతారు.

పరిహారం : దేవి ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

తుల రాశి : నిరుద్యోగులకు అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు. దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో పెద్దల సలహా తీసుకుని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో లోటుపాట్లు సరిద్దిదుకుంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిసారిస్తారు. అవసరానికి చేతిలో ధనం నిల్వ లేక ఇబ్బంది పడతారు. సోదరులతో కొన్ని వ్యవహారాలలో వివాదాలకు దిగడం మంచిది కాదు. చిన్నతరహా పరిశ్రమలకు స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. వారాంతమున ఆర్ధిక ఇబ్బందులుంటాయి.

పరిహారం : హయగ్రీవ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి : కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు సంతాన విద్యా ఫలితాలు ఆనందం కలిగిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారాంతమున కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలి. వాహన వ్యాపారస్తుల ఆశించిన లాభాలు అందుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆప్తుల నుండి అవసరానికి ధనసహాయం అందుతుంది.

పరిహారం : నరసింహ స్వామి స్తోత్రం పారాయణం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి : చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి మీ సమర్థతను చాటుకుంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో పెద్దల సహాయం అందుతుంది. వ్యాపార పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు లాభాలు కలిగిస్తాయి. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. బంధువర్గంతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. ఆదాయ మార్గాలు గతం కంటే మెరుగవుతాయి.

పరిహారం : లక్ష్మీదేవి ఆరాధన చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి : ఆర్థిక వ్యవహారాలలో మెరుగైన వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యల నుండి తెలివిగా బయటపడతారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులలో ఒత్తిడిని అధిగమించి నిదానంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేసి అధికారుల మన్ననలు పొందుతారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. రియల్ఎస్టేట్ వ్యాపారులకు నూతన లాభాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధన పరంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.

పరిహారం : శివాలయంలో అభిషేకం చేయించటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి : మిత్రులతో వ్యాపార పరమైన విషయాల గురించి చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు దాయాదులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వారం మధ్యన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. విద్యార్థుల విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున అనుకూల స్థాన చలన సూచనలు ఉన్నవి.

పరిహారం : గణేశాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మీన రాశి : వ్యాపారపరంగా నూతన పద్ధతులను అవలంబించి సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో స్థిరాస్తి వ్యవహారాలను సజావుగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో అనుకూలత కలుగుతుంది సోదరులతో సఖ్యత గా వ్యవహరిస్తారు. ఉద్యోగులకు పని భారం నుండి కొంత ఉపశమనం పొందుతారు. సమాజంలో పరిచయాలు మరింత విస్తృతమౌతాయి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వారాంతంలో వ్యయ ప్రయాసలు పెరుగుతాయి. ధన వ్యయ సూచనలు ఉన్నవి. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

పరిహారం : సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలు పొందుతారు.

Next Story