వారఫలాలు తేది 9-10-22 నుంచి 15-10-22 వరకు

Weekly horoscope from October 9th to 15th.సోదరులతో స్థిరాస్తి వివాదాలలో నెలకొన్న సందిగ్ధత తొలగుతుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Oct 2022 1:48 AM GMT
వారఫలాలు తేది 9-10-22 నుంచి 15-10-22 వరకు

మేష రాశి : సోదరులతో స్థిరాస్తి వివాదాలలో నెలకొన్న సందిగ్ధత తొలగుతుంది.కొన్ని రంగాల వారికి శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. కుటుంబంలో శుభకార్యాలపై పెద్దలతో చర్చలు చేస్తారు. గృహనిర్మాణ విషయంలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో విధులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. చిన్న తరహా పరిశ్రమలు క్రమక్రమంగా లాభాల బాట పడుతాయి. నిరుద్యోగులు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఆర్థికంగా కాస్త మెరుగైన పరిస్థితులుంటాయి.

పరిహారం: షణ్ముఖ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభ రాశి : కొన్ని రంగాల వారికి పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల ప్రోత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు పరీక్ష ఫలితాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి తెలివిగా బయట పడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప ధనవ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

పరిహారం: అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

మిథున రాశి : ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వారం మధ్యలో ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వారం చివరిలో మిత్రులతో చిన్నపాటి విభేదాలు కలుగుతాయి. కొన్ని రంగాల వారికి ఆశలు అంతగా ఫలించవు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించిన నూతన అవకాశాలు అనుకుంటారు.

పరిహారం: నవగ్రహ పీడహార స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి : ఆర్థికంగా మరింత లాభాలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు.సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలు చేపడతారు. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆత్మీయులతో కీలక విషయాలు గూర్చి చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలు క్రమంగా లాభాల బాట నడుస్తాయి.వారం మధ్యలో ఒక వివాదాన్ని అత్యంత ఓర్పుతో పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో ఊహించని స్థాన చలనాలు తప్పవు. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు. నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలకు వ్యవహారాలలో విజయం.

పరిహారం: దక్షిణమూర్తి పంచరత్న స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

సింహ రాశి : వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు. దైవకార్యాలలో పాల్గొంటారు. అనారోగ్యం సమస్యలు భాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులు పరీక్ష ఫలితాలు కొంత ఊరట ఇస్తాయి. ఆప్తుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అంది అవసరాలు తీరుతాయి. గృహమున మీ నిర్ణయాలు అందరికి నచ్చుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహారిస్తారు వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుండి బయట పడతారు. కొన్ని రంగాల వారికి ఒత్తిడుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శత్రువులను కూడా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు.

పరిహారం: ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కన్య రాశి : నిరుద్యోగుల ఊహలు నిజం అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయాలు అందుకుంటారు. దాయదులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. వారం ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ఉన్నపటికీ అధిగమించి ముందుకు సాగుతారు. విద్యార్థులకు అప్రయత్నంగా నూతన అవకాశములు దక్కించుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వారం ప్రారంభంలో దూరప్రయాణ సూచనలున్నవి. కొన్ని రంగాల వారికి మార్పులు తప్పవు. ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికి రాదు.

పరిహారం:విష్ణు పంజర స్తోత్రం పారాయణ చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

తుల రాశి : నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహమున శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ఉంటుంది.సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నూతన గృహప్రవేశం నిర్మాణం ప్రయత్నాలు ప్రారంభిస్తారు వ్యాపారాలలో గతం కంటే మంచి లాభాలు అందుతాయి. సంఘంలో మర్యాదలకు లోటు ఉండదు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. అన్ని రంగాల వారికీ నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ఉంటుంది.

పరిహారం: కాలభైరవాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి : ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. చిన్నతరహా పరిశ్రమలకు శ్రమధిక్యత తప్పదు. నూతన రుణయత్నాలు సాగిస్తారు. చేపట్టిన పనులులో జాప్యం కలుగుతుంది గృహ నిర్మాణ యత్నాలు మందగిస్తాయి.వారం మధ్యలో చిన్న నాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన సమయానికి నిద్రహారాలు ఉండవు. బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. భూ సభంధిత క్రయ విక్రయలు కలసిరావు.

పరిహారం:కనకధార స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి : సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. వ్యాపారాలలో సమస్యలు అదిగమించి లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.గృహ నిర్మాణయత్నాలు సానుకూలమౌతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. పాత విషయాలు కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. మీ నిర్ణయాలను ఇంటా బయట అందరు గౌరవిస్తారు.

పరిహారం: దేవి ఖడ్గ మాల స్తోత్రాలు పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి : చిన్న నాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. విద్యార్థులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. నూతన వ్యక్తులు పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆస్తుల క్రయవిక్రయాలలో సమస్యలు తొలగుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. బంధువులతో అకారణ వివాదాలు తప్పవు. చిన్న తరహా పరిశ్రమలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగాలలో ఆశించిన లక్ష్యాలు సాధిస్తారు. గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు.

పరిహారం: ఇంద్రకృత లక్ష్మి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కుంభ రాశి : వ్యాపారాలు క్రమంగా లాభాల బాట పడతాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలకు లోటు ఉండదు.విద్యార్థులలో ఆశలు ఫలిస్తాయి. సన్నిహితుల సాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం పెరుగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఒత్తిడులు తొలగుతాయి. తెలివితో కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు.ధన పరంగా ఇబ్బందులు తప్పవు. వారం చివరిలో వృధా ప్రయాణాలు ఉంటాయి.

పరిహారం: హయగ్రీవస్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మీన రాశి : సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో పరిష్కరించుకుంటారు. కుటుంబసభ్యులు మరిన్ని బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.వారం మధ్యలో దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది చిన్నతరహా పరిశ్రమల శ్రమ ఫలిస్తుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పరిహారం: పంచముఖ హనుమత్ కవచం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

Next Story