వారఫలాలు తేది 02-10-22 నుంచి 08-10-22 వరకు

Weekly horoscope from October 2nd to 8th.కీలక సమయంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు

By జ్యోత్స్న  Published on  1 Oct 2022 11:30 PM GMT
వారఫలాలు తేది 02-10-22 నుంచి 08-10-22 వరకు

మేష రాశి : కీలక సమయంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికారులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. అన్నిరంగాల వారికి అనుకూల సమయం. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వారం చివరిలో చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందుతాయి.

పరిహారం : ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి : ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వారం ప్రారంభంలో రుణఒత్తిడులు అధికామౌతాయి. బంధువర్గంతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటాబయటా మీదే పైచేయి అవుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలలో అవాంతరాలు తొలగుతాయి. చాలా కాలంగా వేచి చూస్తున్న ఆశయాలు నెరవేరతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం సంతోషానిస్తుంది. విద్యార్థుల ఆశించిన అవకాశములు అందుతాయి. బంధువులతో విభేదాలు తప్పవు. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో మరింత లాభసాటిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

పరిహారం : హనుమాన్ ఆరాధన చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మిథున రాశి : బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. నూతన వాహన యోగం ఉన్నది. ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. గృహ నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. చిన్నతరహా పరిశ్రమలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. ప్రముఖుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వారం చివరిలో శుభవార్తలు అందుతాయి.

పరిహారం :లక్ష్మీ నృసింహ కరావలంభ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి : ఆర్థిక వ్యవహారాలు మందకోడీగా సాగుతాయి. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. గృహ నిర్మాణయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సోదరులను కలుసుకుని వివాహ విషయాలు చర్చిస్తారు. ఇంటాబయట సమస్యలు అధిగమవుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు. వారం ప్రారంభంలో ఆకస్మిక ధనాప్రాప్తి. వ్యాపార విస్తరణలో అవాంతరాలు తప్పవు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. కొన్ని రంగాల వారికి చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి.

పరిహారం :హనుమాన్ ఛాలీసా పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

సింహ రాశి : విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. వారం మధ్యలో ధనవ్యయ సూచనలు ఉన్నవి. అనుకున్న వ్యవహారాలలో ఆశించిన ఫలితాలుంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు కొంతమేర తొలగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాదిస్తాయి.

పరిహారం :సుబ్రమణ్య అష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కన్య రాశి : ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.బంధువులతో సఖ్యత పెరుగుతుంది. దూరప్రాంతాల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పవు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుని ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

పరిహారం : విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణ చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

తుల రాశి : వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. స్థిరస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మిత్రులతో వివాదాలు మానసికంగా బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో కొద్దిగా ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. వ్యాపారమున తీసుకునే నిర్ణయాలలో మరింత నిదానంగా వ్యవహారించాలి. బంధువుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి శ్రమ మరింత పెరుగుతుంది. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. నూతన వాహనయోగం ఉన్నది. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

పరిహారం :దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి :గృహ నిర్మాణయత్నాలు సానుకూల మవుతాయి. నూతన పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి రుణబాధల నుంచి విముక్తి కలుగుతుంది. వారం మధ్యలో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. అన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు.

పరిహారం : మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి : వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూరపు బంధువుల నుండి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. మానసిక చికాకులు తప్పవు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వారం చివరిలో అనుకోని ధనవ్యయ సూచనలున్నవి.సన్నిహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబంలో గందరగోళ పరిస్థితులుంటాయి.

పరిహారం : శ్రీరాజరాజేశ్వరి అష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి : ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగమున్నది. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు భాధిస్తాయి. ఉద్యోగమున జీతభత్యముల విషయంలో శుభవార్తలు అందుతాయి. నూతన గృహ వాహన యోగం ఉన్నది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు.

పరిహారం : మధురాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కుంభ రాశి : వ్యాపారాలలో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబంలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారాలలో మరిన్ని ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్నతరహా పరిశ్రమలకు ఊహించని వివాదాలు నెలకొంటాయి. కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు. పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వారం చివరిలో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కలుగుతాయి. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి.

పరిహారం : రామ రక్షా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మీన రాశి : ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. ఏ పని చేపట్టినా ముందు నిరాశ పెరుగుతుంది.వ్యాపారాలలో అనుకోని మార్పులు ఉంటాయి. వారం ప్రారంభంలో బంధువుల ద్వారా శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరస్తి సంబంధించిన ఒప్పందాలు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు విఫలమౌతాయి. మిత్రులతో అకారణ వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు సకాలంలో అందవు.

పరిహారం : గణపతి ఆరాధన చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

Next Story