వార ఫలాలు 31-07-2022 నుంచి 06-08-2022 వరకు

Weekly horoscope from July 31st to August 6th.వార ఫలాలు 31-07-2022 నుంచి 06-08-2022 వరకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 July 2022 2:23 AM GMT
వార ఫలాలు 31-07-2022 నుంచి 06-08-2022 వరకు

మేష రాశి : సోదరులతో స్థిరాస్తి వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. గృహ నిర్మాణయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వారం మధ్యలో దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. కొన్ని రంగాల వారి అంచనాలు ఫలించవు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.

పరిహారం : ఆంజనేయ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి : విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో ఆప్తుల సలహాలు, తీసుకుని ముందుకు సాగడం మంచిది. స్థిరస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్థాయి. ఇంటా బయట విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు పరీక్ష ఫలితాలు కొంత ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలలో మరింత లాభసాటిగా సాగుతాయి. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. రుణ ఒత్తిడులు నుండి బయట పడతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఒడిదుడుకుల నుంచి బయట పడతారు.

పరిహారం : విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మిథున రాశి : సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. ఆర్థికంగా మరింత మెరుగుపడుతుంది. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉత్సాహాన్నిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వ్యాపారాలు క్రమక్రమంగా లాభాల బాట పడుతాయి. ఆత్మీయులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. వృధాఖర్చులుంటాయి.

పరిహారం : నవగ్రహ ధ్యాన శ్లోకాలు పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి : వారం ప్రారంభంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికి నిదానంగా ముందుకు సాగుతారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికంగా ఇబ్బందుల నుండి బయట పడగలుగుతారు. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. చిన్న తరహా పరిశ్రమలవారు తీసుకున్న నిర్ణయాలు కలిసివస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు తప్పవు. సంతాన విద్యా విషయములలో కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.

పరిహారం : దేవీఖడ్గమాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

సింహ రాశి : కుటుంబ సభ్యులకు మీ నిర్ణయాలు నచ్చుతాయి. చాలా కాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తిచేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. వారం మధ్యలో బంధు మిత్రులతో విరోధాలు కలుగుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. స్థిరస్తి కొనుగోలు చేస్తారు.పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు నూతన అవకాశములు అందుతాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు.

పరిహారం : హనుమాన్ ఛాలీసా పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కన్య రాశి : విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. బంధువుల నుంచి విలువైన విషయాలు సేకరిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలలో భాగస్వాములవుతారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుకుంటారు. నిరుద్యోగ యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో మీ సేవకు తగిన గుర్తింపు పొందుతారు. అన్ని రంగాల వారికి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్య పరంగా చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. వారం చివరిలో ప్రయాణాలు వాయిదా పడుతాయి. మిత్రులతో వివాదాలు కలుగుతాయి.

పరిహారం :ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం వలన శుభ ఫలితాలు పొందుతారు.

తుల రాశి : వ్యతిరేకులు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. ఆత్మీయులతో వివాదాలు తీరి సఖ్యతగా వ్యవహారిస్తారు. సోదరులతో కలహా సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తికరంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉంటాయి. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో అనుకోని ఖర్చులుంటాయి. మొండి బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. వ్యాపార పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు.

పరిహారం : రాజరాజేశ్వరి దేవి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి : కొన్ని ఆహ్వనాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సన్నిహితులతో విభేదాలు పరిష్కారమౌతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీరుస్తారు. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితుల నుంచి ఆశించిన సాయం అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. భూ సంభంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అవాంతరాలు అధిగమిస్తారు. వృధా ఖర్చులు తప్పవు.

పరిహారం : కనకదార స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి : సన్నిహితులతో గృహమున సందడిగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. సోదరుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో అధికారుల సహాయంతో ఉన్నత పదవులు పొందగలరు. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. బంధు వర్గం వారితో విరోధాలు తప్పవు.

పరిహారం : గణేశాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి : వారం ప్రారంభంలో చిన్నపాటి ఇబ్బందులున్న అధిగమించి ముందుకు సాగుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. నిరుద్యోగుల ఊహలు నిజం కాగలవు. సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు. బంధువులతో శుభకార్య విషయాలపై చర్చలు చేస్తారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం అందుతుంది. వ్యాపారాలలో లాభాల బాట పడుతాయి. రాజకీయ వర్గాలకు అరుదైన అవకాశాలు అందుతాయి. కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది. వారం ప్రారంభంలో సోదరులతో స్వల్ప విభేదాలు తప్పవు. ఉద్యోగాలలో చికాకులు అధిగమించి ముందుకు సాగుతారు.

పరిహారం : మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కుంభ రాశి : సమాజంలో ప్రత్యేక గౌరవ మర్యాదలు పొందుతారు. ఆత్మీయులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు బాధిస్తాయి. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తినిస్తుంది. విద్యార్థులకు నూతన అవకాశాలు అందుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలున్నప్పటికి సమర్థవంతంగా పూర్తి చేస్తారు.

పరిహారం : దుర్గాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మీన రాశి : ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ నిర్ణయాలతో అందరిలోనూ గుర్తింపు పొందుతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

పరిహారం : శివాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

Next Story
Share it