వార ఫలాలు 17-07-2022 నుండి 23-07-2022 వ‌ర‌కు

Weekly Horoscope From July 17th to 23rd.చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. నూతన గృహ నిర్మాణయత్నాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 July 2022 2:10 AM GMT
వార ఫలాలు 17-07-2022 నుండి 23-07-2022 వ‌ర‌కు

మేష రాశి :చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. నూతన గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. అన్ని రంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. చాలాకాలంగా పూర్తి కాని పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇతరులకు మీ ఆలోచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. దీర్ఘకాలిక రుణబాధల నుండి క్రమక్రమంగా బయట పడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. వారం మధ్యలో సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగవుతాయి. ప్రభుత్వ అధికారులతో పరిచయాలు విస్తృతమవుతాయి.

పరిహారం :ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభ రాశి : బంధుమిత్రులతో వివాహాది వేడుకలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుని బాధపడతారు. ముఖ్యమైన వ్యవహారాలను ప్రణాళికలను రూపొందించుకుని విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. కొన్ని విషయాలలో ఓర్పుతో వ్యవహరించటం మంచిది. దీర్ఘకాలిక ఆరోగ్యసమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్యం సూచనలు ఉన్నవి. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమవుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది

పరిహారం :హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిథున రాశి : వారం ప్రారంభంలో ధనవ్యయ సూచనలు ఉన్నవిగృహమున సొంత ఆలోచనలు అమలు చేయడంలో ముందడుగు వేస్తారు.వ్యాపారాలలో కొన్ని సమస్యల పరిష్కారంలో ముందడుగు వేస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. వారం మధ్యలో ఒక సంఘటన మిమ్మల్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి ధన సహాయం లభిస్తుంది. అనారోగ్య విషయాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

పరిహారం : దేవీఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి : అన్ని రంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. సోదరులతో అకారణంగా స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలలో భాగస్వాములతో ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. వారం చివరిలో దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు కలిసొస్తాయి. గృహ నిర్మాణయత్నాలలో అవాంతరాలు కలుగుతాయి.

పరిహారం :శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహ రాశి : చుట్టుపక్కల వారితో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. వారం ప్రారంభంలో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కొన్ని రంగాల వారికి చికాకులు తప్పవు. వ్యాపారులకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. భూ సంబంధిత క్రయవిక్రయాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారస్తులు నూతన లాభాలను అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడుతాయి.

పరిహారం :విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి : అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. విద్యార్థులకు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. పాత మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది. నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు.నూతన గృహ నిర్మాణానికి సకాలంలో ధనం అందుతుంది.

పరిహారం : సుబ్రహ్మణ్యస్వామి అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు

తుల రాశి : ఇంటాబయటా కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్థిరాస్తి విషయంలో సమస్యలు అధిగమిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. తెలివితేటలతో దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొంతవరకు పనిఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. శ్రమ తో కాని పనులు పూర్తి కావు.

పరిహారం : మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి : వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పరిస్థితులు అంతగా అనుకూలించవు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయలేక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధు మిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి వివాదాలకు కొంత దూరంగా ఉండటం మంచిది. వారం ప్రారంభంలో శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు ఆర్థికంగా వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి : కొన్ని వ్యవహారాలలో అంచనాలు అందుకోవడం విఫలమవుతారు. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు అధికమవుతాయి. అన్ని రంగాల వారికి కొత్త సమస్యలు తప్పవు.ఆర్థికంగా అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు.ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కొన్ని పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు కొంత మానసికంగా చికాకు కలిగిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలలో అవాంతరాలు కలుగుతాయి. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది.

పరిహారం : గణేశాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి : స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా వేస్తారు. అనుకున్న పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. బంధువులతో వివాదాలు కొంతవరకు రాజి చేసుకుంటారు. ఇంటాబయటా పని ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు ఆశించిన అవకాశములు లభించవు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. వారం మధ్యలో ఆప్తుల నుండి శుభ వార్తలు అందుతాయి వాహన యోగం ఉన్నది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్థాన చలన సూచనలున్నవి. ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు.

పరిహారం : దత్త పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి : దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దలు సలహాలు తీసుకోవడం మంచిది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమున సందడిగా గడుపుతారు. వారం మధ్యలో ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు విస్తరణలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చ గలుగుతారు.

పరిహారం : శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మీన రాశి : గృహమును ఒక విషయంలో ఓర్పుగా వ్యవహరించడం మంచిది. నూతన వాహన అనుకూలత కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో అనుకున్న విధంగా పూర్తి చేయలేరు చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనం చేసుకుంటారు. సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు అందుకుంటారు. రుణయత్నాలు వేగవంతం చేస్తారు. పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వ్యాపారాలలో సామాన్య లాభాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించక నిరాశ పెరుగుతుంది. సోదరుల నుంచి ధన సహాయం అందితుంది.

పరిహారం : నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story