రాశిఫలాలు 10-07-2022 నుంచి 16-07-2022 వరకు
Weekly horoscope from July 10 to 16.రాశిఫలాలు 10-07-2022 నుంచి 16-07-2022 వరకు
By జ్యోత్స్న Published on 10 July 2022 7:25 AM ISTమేష రాశి : భూవివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. అధికారుల నుండి అందిన కీలక సమాచారం నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది.ఇంటాబయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వారం మధ్యలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు మరింత అనుకూలమైన కాలం స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
పరిహారం :గణేశాష్టకం పారాయణం చేయటం వలన శుభఫలితాలను పొందుతారు.
వృషభ రాశి : సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. వారం చివరిలో సోదరులతో చిన్నపాటి విభేదాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాల గురించి చర్చలు చేస్తారు.
పరిహారం:నవగ్రహ కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
మిథున రాశి : బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహవంతమైన కాలం. సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూవివాదాలు సమసిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు నుండి బయటపడతారు. ఆలయ దర్శనాలు తీసుకుంటారు వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపార విషయమై ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరతాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.
పరిహారం :హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కర్కాటక రాశి : ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. వారం ప్రారంభంలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున శుభకార్యాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి కొంత నిరాశ తప్పదు. ఇంటాబయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకోడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ధన లాభసూచనలున్నవి.
పరిహారం :రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
సింహ రాశి : బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.అనారోగ్య సూచనలు ఉన్నవి. సోదరులతో ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.మిత్రుల నుండి ధనలాభ సూచనలు ఉన్నవి. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత వరకూ తగ్గుతాయి. చిన్నతరహా పరిశ్రమల పెట్టుబడి యత్నాలు సఫలామౌతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి.
పరిహారం :మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
కన్య రాశి : కీలక సమయంలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగటం మంచిది. సమాజంలో అందరిలోనూ గుర్తింపు పొందుతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగులకు మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి.
పరిహారం :దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
తుల రాశి : నిరుద్యోగులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యక్తులు పరిచయమవుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు నూతనోత్సాహంతో పని చేసి లాభాలు అందుకుంటారు. పాత మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు ఉంటాయి. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు.
పరిహారం : దత్త పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
వృశ్చిక రాశి :స్థిరస్తి విషయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. అన్ని రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సంతానానికి విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూరపు బంధువులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. వారం మధ్యలో ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో ఆశించిన పదోన్నతులు పొందుతారు. వారం మధ్యలో ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూత రుణాలు చేస్తారు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
పరిహారం :విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
ధనస్సు రాశి : బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది.చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు చిరకాల కోరిక నెరవేరి ఆశించిన అవకాశాలు పొందుతారు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగుల పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.
పరిహారం :మధురాష్టకం పారాయణం చేయటం వలన శుభఫలితాలు పొందుతారు.
మకర రాశి : అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా అవుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వారం మధ్యలో ధనవ్యయ సూచనలు ఉన్నవి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు కుటుంబం వాతావరణం చికాకుగా ఉంటుంది.
పరిహారం :శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కుంభ రాశి : ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు చేస్తారు. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. సోదరులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. ఒక వ్యవహారంలో ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. అన్ని రంగాల వారికి కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.
పరిహారం :హయాగ్రీవ స్వామి స్తోత్రం పారాయణ చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మీన రాశి :నిరుద్యోగులకు చాలాకాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వారం మధ్యలో మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. బంధువులతో కీలక విషయాల గురించి చర్చలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి.
పరిహారం :కనకధారా స్తోత్రం పారాయణ చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.