వార ఫలాలు 07-08-2022 నుంచి 13-08-2022 వరకు

Weekly horoscope from August 7th to13.వార ఫలాలు 07-08-2022 నుంచి 13-08-2022 వరకు

By జ్యోత్స్న  Published on  6 Aug 2022 11:30 PM GMT
వార ఫలాలు 07-08-2022 నుంచి 13-08-2022 వరకు

మేష రాశి : అధికారుల నుండి అందిన కీలక సమాచారం నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. వారం మధ్యలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు మరింత అనుకూలమైన కాలం అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. భూవివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

పరిహారం :కాలభైరవాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభ రాశి : నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాల గురించి చర్చలు చేస్తారు. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. వారం చివరిలో సోదరులతో చిన్నపాటి విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.

పరిహారం : నవగ్రహ పీడహార స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిథున రాశి : బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు నుండి బయటపడతారు. సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార విషయమై ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. భూవివాదాలు సమసిపోతాయి. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహవంతమైన కాలం.

పరిహారం : విష్ణు హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి : ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వారం ప్రారంభంలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. గృహమున శుభ కార్యాలు వాయిదా వేస్తారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకోడిగా సాగుతాయి. వ్యాపారాలలో స్వల్ప ఆలోచనలు కలసిరావు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. కొన్ని రంగాల వారికి కొంత నిరాశ తప్పదు.

పరిహారం : ఏకదంత స్తోత్రం పారాయణం చేయటం వలన శుభఫలితాలను పొందుతారు.

సింహ రాశి : మిత్రుల నుండి ధనలాభ సూచనలు ఉన్నవి.వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత వరకూ తగ్గుతాయి. చిన్నతరహా పరిశ్రమల పెట్టుబడి యత్నాలు సఫలామౌతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. సోదరులతో ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కలుగుతుంది. అనారోగ్య సూచనలు ఉన్నవి.

పరిహారం : లక్ష్మి కవచం పారాయణ చేయుటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి : దాయాదులతో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. కీలక సమయంలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగటం మంచిది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో అందరిలోనూ గుర్తింపు పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.

పరిహారం : పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

తుల రాశి : నిరుద్యోగులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యక్తులు పరిచయమవుతారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పాత మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు ఉంటాయి. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాలలో నూతనోత్సాహంతో పని చేసి లాభాలు అందుకుంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

పరిహారం : శ్రీ సరస్వతి కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి : అన్ని రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. స్థిరస్తి విషయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సంతానానికి విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు పూర్తి చేస్తారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వారం మధ్యలో ప్రయాణాలు చేయవలసి వస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.దూరపు బంధువులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాల్లో ఆశించిన పదోన్నతులు పొందుతారు. నూతన రుణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. తెలుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

పరిహారం :శ్రీ కామాక్షి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి : విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు.వ్యాపారాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులకు చిరకాల కోరిక నెరవేరి ఆశించిన అవకాశాలు పొందుతారు.రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి వారం మధ్యలో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగుల పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

పరిహారం : దామోదరాష్టకం పారాయణ చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి : దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయ సూచనలు ఉన్నవి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది

పరిహారం : రామచంద్రాష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను ఫలితాలు పొందుతారు.

కుంభ రాశి : నూతన వాహనం కొనుగోలు చేస్తారు. అన్ని రంగాల వారికి కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఒక వ్యవహారంలో ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగాలలో ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో వివాదాలు కలుగుతాయి.

పరిహారం: వేణుగోపాలాష్టకం పారాయణం చేయటం వలన శుభఫలితాలు పొందుతారు.

మీన రాశి : కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు చాలాకాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలు పొందుతారు.నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వారం మధ్యలో మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. బంధువులతో కీలక విషయాల గురించి చర్చలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : విశ్వనాధాష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

Next Story