వార ఫలాలు 28-08-2022 నుంచి 03-09-2022

Weekly horoscope from August 28 to Sep 03. మేష రాశి : బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.

By జ్యోత్స్న  Published on  28 Aug 2022 1:20 AM GMT
వార ఫలాలు 28-08-2022 నుంచి 03-09-2022

మేష రాశి : బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన రుణయత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు కొంత నత్తనడకన సాగుతాయి. ఆలయాలు సందర్శనలు చేసుకుంటారు. నిరుద్యోగులకు అవకాశములు లభించినట్లే దూరమవుతాయి. వారం మధ్యలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా బాధిస్తుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. చిన్నతరహా పరిశ్రమలకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. సోదరులతో స్థిరస్తి విషయంలో ఒప్పందాలు వాయిదా పడుతాయి.

పరిహారం :విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి :సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఊహించని విధంగా ధనలాభాలు అందుతాయి.ఆర్థిక లావాదేవీలు ఆశాజకనంగా ఉంటాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమౌతాయి. బంధు మిత్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఉన్నత పదవులు దక్కుతాయి. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. జీవిత భాగస్వామితో దేవాలయాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాదిస్తాయి.

పరిహారం :సుబ్రహ్మణ్యష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మిథున రాశి : కొన్ని వ్యవహారాలలో ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభన తొలగుతాయి సంఘంలో గౌరవ మర్యాదాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. చాలాకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.ఉద్యోగులకు ఆశించిన పదవులు పొందుతారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన లాభాలు అందుతాయి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

పరిహారం : దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి : ప్రముఖ వ్యక్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. అన్ని రంగాల వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, నిరుద్యోగులు ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో అనుకోని ఖర్చులుంటాయి. వ్యాపారాలలో నష్టాలను అదిగమించి లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు తప్పవు.

పరిహారం : సూర్య కవచం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

సింహ రాశి : సంఘంలో పరపతి పెరుగుతుంది. బంధు మిత్రుల వలన ఊహించని సమస్యలు చికాకు పరుస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. స్థిరస్తి వివాదాల పరిష్కారమౌతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో దీర్ఘాకాలిక సమస్యలు తొలగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు

పరిహారం : నవగ్రహ స్తోత్రం పారాయణం చెయ్యడం మంచిది.

కన్య రాశి : నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ వర్గాలకు అంచనాలు నిజం అవుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రాంత ప్రయాణాలు సాగిస్తారు. ప్రముఖుల నుంచి ఊహించని విధంగా సహాయ సహకారాలు అందుతాయి వ్యాపారాలు సజావుగా సాగి నూతన లాభలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆందోళన తొలగుతాయి. మిత్రులతో ఆకారణ కలహాలు కలుగుతాయి. సంతాన వివాహయత్నాలు అనుకూలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు.

పరిహారం : గణపతి ఆరాధన చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

తుల రాశి : ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగుపడతాయి.విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వారం ప్రారంభంలో పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యసమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది. కీలక వ్యవహారాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. మిత్రులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల విస్తరణకు చేసే ప్రయత్నాలు అనుకూలస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికి నిదానంగా ముందుకు సాగుతారు. చిన్నతరహా పరిశ్రమలకు అవకాశాలు పెరుగుతాయి. సోదరుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. దూర ప్రాంతాల నుంచి వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది.

పరిహారం : మేధో దక్షిణమూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి : ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.చిన్నతరహా పరిశ్రమలకు అన్ని విధాలా కలసివచ్చే కాలం.చేపట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. సంతాన విద్యా విషయంలో పురోగతి కనిపిస్తుంది. గృహములో శుభకార్యాల నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.వారం మధ్యలో కుటుంబంలో వివాదాలు మానసిక అశాంతి కలిగిస్తాయి. ఆప్తులు నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార వ్యవహారాలలో అవాంతరాలు తొలగి విశేషమైన లాభాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగతాయి. పాత సంఘటనలు కొన్ని జ్ఞప్తికి వచ్చి బాధిస్తాయి.

పరిహారం : ఇంద్రకృత లక్ష్మి స్తోత్రం పారాయణం చెయ్యడం మంచిది.

ధనస్సు రాశి : వారం ప్రారంభంలో స్వల్ప వివాదాలు కలుగుతాయి ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. సోదరులు, స్థిరస్తి వివాదాలు సర్దుబాటు అవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నం ఫలించి నూతన అవకాశములు అందుకుంటారు. నూతన గృహ, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.ఉద్యోగాలలో వివాదాలు తొలగుతాయి. వారం చివరిలో వృధా ఖర్చులు పెరుగుతాయి.విద్యార్థుల పరీక్షఫలితాలు సంతృప్తినిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలకు శుభవార్తలు అందుతాయి.

పరిహారం : శివాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి : ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన పనులు నిదానంగా సాగిన పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వారం ప్రారంభంలో ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు మెరుగైన అవకాశాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.

పరిహారం : లక్ష్మి నృసింహ కరావలంభ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కుంభ రాశి : ఇంటా బయట బాధ్యతలు కొంత తగ్గి ఊరట పొందుతారు. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి అవుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు కొంతవరకూ పరిష్కారమౌతాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వారం మధ్యలో మానసిక చికాకులు పెరుగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. అన్ని రంగాల వారి కృషి ఫలిస్తుంది. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి.ధనపరంగా ఇబ్బందులు తప్పవు.

పరిహారం : హనుమాన్ ఆరాధన చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మీన రాశి : స్నేహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. భూవివాదాలు తీరి పరిష్కారం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కీలక ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యమైన పనులలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. నిరుద్యోగులకు నూతన ఆశలు చిగురిస్తాయి. చాలకాలంగా వేధిస్తున్న సమస్యలు నుండి ఊరట పొందుతారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగుతాయి. వారం చివరిలో బంధు వర్గంతో వివాదాలు కలుగుతాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో విజయం సాధిస్తారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. సంతాన వివాహయత్నాలు సానుకూలమవుతాయి.

పరిహారం :వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

Next Story