వార ఫలాలు తేదీ 14-08-2022 నుంచి 20-08-2022 వరకు

Weekly Horoscope from August 14 to 20.వార ఫలాలు తేదీ 14-08-2022 నుంచి 20-08-2022 వరకు

By జ్యోత్స్న  Published on  13 Aug 2022 11:30 PM GMT
వార ఫలాలు తేదీ 14-08-2022 నుంచి 20-08-2022 వరకు

మేష రాశి : ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులు అనుకున్న పనులు సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటాబయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులు సాఫీగా పూర్తి చేస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. స్థిరాస్తి వివరాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

పరిహారం : శ్రీ అన్నపూర్ణ దేవి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభ రాశి : అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువర్గంతో వివాదాలు తీరి ఊరట పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఊహించని విధంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో రాజీ చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు లభిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. ఋణ భారం పెరుగుతుంది. కీలక వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

పరిహారం : గణేష హృదయ కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిథున రాశి : అవసరానికి ధనసహాయం లభిస్తుంది స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు దక్కుతాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలమవుతాయి. ఒక వ్యవహారంలో ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వారం చివరిలో మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి.

పరిహారం : శ్రీ కాలభైరవాష్టక స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి : నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. చాలా కాలంగా పూర్తి కాని పనులలో ఆటంకాలు తొలగి సజావుగా పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు బాధిస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలపై స్నేహితులతో చర్చలు చేస్తారు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అప్రయత్నంగా అవకాశములు దక్కుతాయి.

పరిహారం : కార్తికేయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహ రాశి : వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులకు గతం కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు. బంధు వర్గం నుండి ఒత్తిడులు పెరుగుతాయి. నూతన గృహ, వాహనాలు కొనుగోలు చేస్తారు. అన్ని రంగాల వారికి పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు ధన వ్యయం చేస్తారు. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి.

పరిహారం : లక్ష్మీ నరసింహ హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి : దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు మరింత ఉత్సాహంతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రాజకీయ వర్గం వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అనుకూల స్థాన చలనాల ఉంటాయి . వారం మధ్యలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార విస్తరణ యత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

పరిహారం : లక్ష్మష్టక స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

తుల రాశి : ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. కొన్ని పనులలో ఆటంకాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. వృత్తి ఉద్యోగాలలో ఎంత శ్రమించినా అనుకున్న ఫలితం కనిపించదు. గృహ నిర్మాణయత్నాలు మందకొడిగా సాగుతాయి. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభించక నిరాశ పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్నతరహా పరిశ్రమల అంచనాలు తప్పుతాయి. వారం మధ్యలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.

పరిహారం : పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి : కొన్ని రంగాల వారికి అవకాశాలు పెరుగుతాయి. శుభకార్యాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో మీ శ్రమ ఫలిస్తుంది. పనులు మరింత సాఫీగా సాగుతాయి. కుటుంభ సభ్యులకు సంబంధించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి . ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వారం చివరిలో ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

పరిహారం : రామచంద్రఅష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి : వారం ప్రారంభంలో చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అన్ని రంగాల వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకోవడంలో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమౌవుతాయి. సంతాన వివాహాది వేడుకలపై చర్చలు జరుపుతారు. వ్యాపారాలలో మరింత పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవకార్యాలలో పాల్గొంటారు. నూతన వ్యవహారాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.

పరిహారం : గుర్వాష్టక స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి : ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వారం చివరిలో అనారోగ్య సూచనలు ఉన్నవి. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తుంది. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణయత్నాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలలో పూర్వవైభవం కనిపిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాలలో ఉన్నత అధికారుల నుండి ఒత్తిడులు తొలగుతాయి.

పరిహారం : శ్రీకృష్ణ చంద్రష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

కుంభ రాశి : కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా చేస్తారు. వ్యాపార విషయంలో సొంత ఆలోచనలు కలసివస్తాయి. ఆర్థిక విషయాలలో అవరోధాలు తొలగుతాయి. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. దీర్ఘ కాలిక సమస్యల నుంచి బయటపడతారు. అన్ని రంగాల వారికి చిక్కులు తొలగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఉద్యోగమున తెలివితేటలతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. పనుల్లో శ్రమ తప్పదు.

పరిహారం : నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

మీన రాశి : విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకున్న వ్యవహారాలు మరింత విజయవంతంగా పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి సమస్యలు తొలగుతాయి. రుణబాధలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ప్రత్యర్థులను సైతం సహాయ సహకారాలు అందిస్తారు. వారం చివరలో ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.

పరిహారం : వెంకటేశ్వర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story