వారఫలాలు తేది 4-12-2022 నుంచి 10-12-2022 వరకు

Weekly Horoscope 4 December to 10 December 2022.గృహ నిర్మాణ ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు.

By జ్యోత్స్న  Published on  4 Dec 2022 1:35 AM GMT
వారఫలాలు తేది 4-12-2022 నుంచి 10-12-2022 వరకు

మేష రాశి : గృహ నిర్మాణ ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్థిరస్తి విషయంలో సోదరులతో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో భాగస్తులు సహాయంతో పెట్టుబడులు సమకూర్చుకుంటారు. మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరమైన సమయం.

పరిహారం : పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

వృషభ రాశి :కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సంతానం వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో దాయదులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిదికాదు. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలిగి పదోన్నతులు పెరుగుతాయి.

పరిహారం : గణనాయకాష్టకం పారాయణ చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

మిథున రాశి : బంధువర్గం తో విభేదాలు తప్పవు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయట పడతారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహవంతమైన సమయం. వారం మధ్యలో ధన పరమైన సమస్యలు కొంత చికాకు కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు నుండి కొంత ఉపశమనం పొందుతారు. కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలసి వస్తాయి.

పరిహారం : కనకధారాస్తోత్రాలు పారాయణం చేయడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు.

కర్కాటక రాశి : కొన్ని ఇబ్బందులు ఎదురైనా నేర్పుగా అధిగమిస్తారు. నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబ సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా మరింత అనుకూలత కలుగుతుంది. ఆస్తి వివాదాలలో చికాకులు తొలగుతాయి. ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారులకు విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహకరిస్తారు. వారం చివరన ప్రయాణాలు వాయిదా పడతాయి.

పరిహారం : విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం వలన శుభఫలితాలు పొందుతారు.

సింహ రాశి : గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమ ఫలించి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహనిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు సమసిపోతాయి. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. వారం చివరిలో కొన్ని పనులు సకాలంలో పూర్తి కాకా చికాకులు పెరుగుతాయి.

పరిహారం : శివాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి : పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమౌతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు చాలాకాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని రంగాల వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కుటుంబంలో వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు అనుకున్న విధంగా దక్కుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా నిదానంగా పూర్తి చేస్తారు.

పరిహారం : రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

తుల రాశి : వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. వారం ప్రారంభంలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగమున వివాదం నుండి తెలివిగా బయటపడతారు. దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత ఆశాజకనంగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. కొన్ని రంగాల వారికి పరిస్థితులు చక్కబడి ఉత్సాహంగా ముందుకు సాగుతారు.

పరిహారం : లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి : వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలున్నవి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధుమిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలవారు పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధనాదాయం బాగుంటుంది.

పరిహారం : గురు చరిత్ర పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి : ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. మిత్రుల సహాయంతో నూతన పెట్టుబడులు అందుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వారం చివరిలో బంధువులతో అకారణ వివాదాలు తప్పవు. ఇంటా బయట సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

పరిహారం : నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి : ఇంటా బయట విశేషమైన ఆదరణ పెరుగుతుంది గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. వారం ప్రారంభంలో మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి .వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. ముఖ్యమైన పనుల్లో ఆశించిన విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమల వారు నష్టాలునుండి బయటపడి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. దాయాదులతో ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

పరిహారం : లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి : చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని అవకాశాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. కుటుంబసభ్యులతో మరింత ఉత్సాహవంతంగా గడుపుతారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలలో కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో అధికారులతోనూ వివాదాల నుంచి బయటపడగలుగుతారు. వారం మధ్యలో బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

పరిహారం : ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మీన రాశి : గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. పాతమిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను పంచుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం. చిన్న తరహా పరిశ్రమల వారి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో సోదరులతో స్థిరస్తి వివాదాలు నెలకొంటాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

పరిహారం : కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలు పొందుతారు.

Next Story