వార ఫలాలు 26-03-2023 నుంచి 01-04-2023

పాత మిత్రులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. నూతన గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి.

By జ్యోత్స్న  Published on  26 March 2023 1:33 AM GMT
Weekly Horoscope, Rasi Phalalu

ప్ర‌తీకాత్మ‌క చిత్రం


మేష రాశి : పాత మిత్రులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. నూతన గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. అన్నిరంగాల వారికి ఉత్సహకర వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. రుణబాధల నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. కార్యటంకములు కలుగుతాయి.

పరిహారం :గణేశాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వృషభ రాశి : దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పాత సంఘటనలు గుర్తుకు చేసుకుని బాధపడతారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. అనుకున్న వ్యవహారాలు అంచనాలకు అనుగుణంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమౌతాయి. గృహమున కొన్ని విషయాలలో సహనం పాటించడం మంచిది. కుటుంబ సభ్యులతో వివాహాది వేడుకలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు మరింత అనుకూలమైన సమయం. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. ఉద్యోగాలలో సమర్థత నిరూపించుకుంటారు.

పరిహారం : ఆదిత్య హృదయం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మిథున రాశి : కొన్ని పనులలో ఆలోచనలు ఆచరణలో పెడతారు. వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగుపడతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యల పెద్దల సహాయంతో పరిష్కరించుకుంటారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయ సూచనలున్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. వ్యాపారస్తులకు నూతన లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులుంటాయి.

పరిహారం : దేవీఖడ్గమాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి : నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది. అన్నిరంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సోదరులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. వృత్తి ఉద్యోగాలలో చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. గృహ నిర్మాణయత్నాలలో అవాంతరాలు తప్పవు. వ్యాపారులకు సామాన్య లాభాలు అందుతాయి. వారం చివరిలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. స్ధిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

పరిహారం : శ్రీరామరక్ష స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

సింహ రాశి : ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్ధిరాస్తి ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో సామాన్య లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో స్థానచలనాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. గృహ నిర్మాణ యత్నాలు ముందుకు సాగక ఇబ్బంది కలుగుతాయి. నిరుద్యోగులకు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. కొన్ని రంగాల వారికి కాంట్రాక్టులు చేజారి నిరుత్సాహం తప్పదు. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార వ్యవహారాలలో ఆటంకాలు ఎదురు కావచ్చు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. స్ధిరాస్తి విషయంలో వివాదాలు నెలకొంటాయి.

పరిహారం : శివాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కన్య రాశి : నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీపరీక్షలలో శుభవార్తలు అందుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ విషయంలో ఆలోచనలు ఆచరణలో పెడతారు. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికీ నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

పరిహారం : రాజరాజేశ్వరి దేవి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

తుల రాశి : నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి అన్నిరంగాలవారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపార వ్యవహారంలో విజయం సాధిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడులు తగ్గే సూచనలు ఉన్నవి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వారం ప్రారంభంలో బంధు మిత్రులతో విభేదాలు కలుగుతాయి స్ధిరాస్తి విషయంలో సమస్యలు అధిగమిస్తారు. బంధు మిత్రులతో వివాదాల నుంచి బయటపడతారు. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు.

పరిహారం : హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు అందుతాయి.

వృశ్చిక రాశి : అన్నిరంగాల వారికీ అదనపు పని ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తప్పవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. బంధు, మిత్రులతో ఊహించని విభేదాలు నెలకొంటాయి. గృహమున ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఇంటా బయట వివాదాలకు కొంత దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. కొన్ని రంగాల వారి యత్నాలు ముందుకు సాగవు. వారం చివరన ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సోదరులతో స్ధిరాస్తి విషయంలో ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.

పరిహారం : విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణ చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి : గృహమున చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత మానసికంగా చికాకు పరుస్తాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుతాయి. వాహన అనుకూలత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు నూతన సమస్యలు కలుగుతాయి.

పరిహారం : నవగ్రహస్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి : ఆరోగ్యపరంగా కొంత చికాకులు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆస్తుల విషయంలో సోదరుతో చర్చలు ఫలిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలనాలు ఉంటాయి. కొన్ని రంగాలవారికి నిరుత్సాహం తప్పదు. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి.

పరిహారం : హయగ్రీవ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కుంభ రాశి : అనారోగ్య సమస్యలు నుండి బయట పడతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీరుస్తారు. పెద్దల సలహాలతో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు తొలగుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరణలో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉంటాయి. అన్నిరంగాల వారి అంచనాలు నిజం కాగలవు. వారం మధ్యలో స్వల్ప ధన వ్యయ సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి.

పరిహారం : సుబ్రమణ్య స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మీన రాశి : కొన్ని వ్యవహారాలలో నేర్పుతో వ్యవహరించడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు తప్పవు సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కొన్ని రంగాల వారికీ కొత్త సమస్యలు కలుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్ధిక పురోగతి పొందుతారు. సోదరుల నుంచి సహాయ సహకార అందుతాయి. నూతన రుణయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో సామాన్య లాభాలు అందుతాయి.

పరిహారం : ఇంద్రకృత లక్ష్మి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

Next Story