వార ఫలాలు: తేది 18-01-2026 నుంచి 24-01-2026 వరకు
దీర్ఘకాలిక ఇబ్బందులను నేర్పుతో పరిష్కరించుకుంటారు. అవసరానికి స్నేహితులు నుండి ఆర్ధిక సహాయం అందుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.
By - అంజి |
వార ఫలాలు: తేది 18-01-2026 నుంచి 24-01-2026 వరకు
మేషం :
దీర్ఘకాలిక ఇబ్బందులను నేర్పుతో పరిష్కరించుకుంటారు. అవసరానికి స్నేహితులు నుండి ఆర్ధిక సహాయం అందుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. గృహ నిర్మాణయత్నాలు మరింత పుంజుకుంటాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబసభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు సాధిస్తారు. అన్నిరంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో బంధు మిత్రులతో వివాదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుతాయి. గణపతి ఆరాధన చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
వృషభం :
ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆప్తుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా ఒడిదుడుకులు తొలగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. కొన్ని రంగాల వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. సంతానం విద్యా విషయాల అనుకూలంగా సాగుతాయి. వారం మధ్యలో ఊహించని ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మిథునం :
అన్ని వ్యవహారాలలోను విజయం సాధిస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. జీవిత భాగస్వామి నుండి స్థిరాస్తి లాభ సూచనలు ఉన్నవి. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాముల సహాయ సహకారాలతో మరింత లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు నూతన పదవులు పొందుతారు. అన్ని రంగాల వారికి విశేషమైన లాభాలు అందుతాయి. వారం ప్రారంభంలో చిన్న చికాకులు బాధిస్తాయి. బంధు మిత్రులతో వివాదాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
కర్కాటకం :
చేపట్టిన పనులలో కొంత జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి బంధు మిత్రులతో విబేధాలు తొలగుతాయి. సోదరులతో స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సంతానం విద్యా విషయాలపై శుభవార్తలు అందుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులు ఆశించిన స్థాన చలానాలు ఉంటాయి. కొన్ని రంగాలవారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. శారీరక మానసిక సమస్యలు తొలగుతాయి. నవగ్రహారాధన చేయటం వలన శుభ ఫలితాలు పొందుతారు.
సింహం :
ఆర్ధిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో గృహమున సంతోషకరంగా గడుపుతారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి మీ మాటకు విలువ పెంచుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు భవిష్యత్తు ఉపయోగపడే విధంగా ఉంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అంచనాలను అందుకోవటంలో సఫలమవుతారు. ఉద్యోగస్తులు మంచి పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
కన్య :
వివాదాలకు సంబంధించి బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొండి బకాయిలు వసూలవుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటాబయటా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. బందు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించిన లాభాల అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ లభిస్తుంది. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారాంతమున వ్యయ ప్రయాసలతోకానీ పనులు పూర్తి కావు. బంధుమిత్రులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వలన ఫలితాలు పొందుతారు.
తుల :
తెలివితేటలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. సంతాన విద్యా విషయాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధు మిత్రులతో ఆలయ సందర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. అన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వారం ప్రారంభంలో ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి. గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
వృశ్చికం :
చాలాకాలంగా పూర్తి కాని పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యులు సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో అంచనాలు అందుకుంటారు. స్ధిరాస్తి వివాదాలు పరిష్కారానికి నూతన మార్గాలను అన్వేషిస్తారు. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమౌతాయి. గృహమున శుభకార్యాలు గూర్చి ప్రస్తావన వస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో వివాదాలు తొలగుతాయి. ఉద్యోగ విషయంలో ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన లాభాలు అందుతాయి. వారం ప్రారంభంలో రుణ వత్తిడి పెరుగుతుంది. శిరో బాధలు కలుగుతాయి. మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
ధనస్సు :
దీర్ఘకాలిక సమస్యల నుండి సమయస్ఫూర్తితో బయటపడతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో సన్నిహితులు సలహాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని పెట్టుబడులు అందుతాయి. దూర ప్రయాణాలు కలసివస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వారం మధ్యలో బంధువులతో వివాదాలు ఉంటాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. గురు చరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
మకరం :
ముఖ్యమైన పనులలో అవరోధాలు చికాకు కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి ముందుకు సాగడం మంచిది. కుటుంబ సభ్యులతో మరింత సఖ్యత పెరుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. స్ధిరాస్తి వివాదాలకు సంబంధించిన ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయ సంబంధిత సభా సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యన దూరపు బంధువుల నుండి శుభకార్యం ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు లబిస్తాయి.
కుంభం :
అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన వాతావరణం ఉంటుంది. ఇంటాబయటా పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సాయపడతారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు అందుతాయి. కొన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. సంతాన విద్యా విషయాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ధన పరమైన ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దుర్గా ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మీనం :
ధన పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. బంధుమిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఇతరుల సమస్యలను తెలివితేటలతో పరిష్కరిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజ పెద్దలతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగుతాయి. చిన్న తరహాపరిశ్రమలకు నూతన అవకాశములు అందుతాయి. వారం ప్రారంభంలో ఖర్చులు అధికమవుతాయి. గృహమున ఒత్తిడి పెరుగుతుంది రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.