వార ఫలాలు: తేదీ 12-04-2026 నుంచి 18 -04-2026 వరకు
అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభించదు. కొన్ని వ్యవహారాలలో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
By - అంజి |
వార ఫలాలు: తేదీ 12-04-2026 నుంచి 18 -04-2026 వరకు
మేషం :
అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభించదు. కొన్ని వ్యవహారాలలో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. పాతమిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందక కొంత నష్టం తప్పదు. ఉద్యోగ విషయంలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారాంతమున కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. సంతానం విద్యా విషయాలలో దృష్టి సారిస్తారు. హనుమాన్ ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
వృషభం :
చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసి వస్తాయి. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. నవగ్రహ కవచం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
మిథునం :
మీ పని తీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అనుకొన్న సమయానికి ధనసహాయం అంది రుణాలు తీర్చగలుగుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలలో కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరన వృధా ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య విషయాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. దేవి ఖడ్గ మాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కర్కాటకం :
చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆలోచనలో స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. సంతానం ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలలో జాప్యం తప్పదు. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకోవడం విఫలమవుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది. సుబ్రహ్మణ్య కవచం పారాయణం చేయడం వలన ఫలితాలను పొందుతారు.
సింహం :
ముఖ్యమైన పనులలో అవరోధాలు చికాకు కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి ముందుకు సాగడం మంచిది. కుటుంబ సభ్యులతో మరింత సఖ్యత పెరుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. స్ధిరాస్తి వివాదాలకు సంబంధించిన ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయ సంబంధిత సభా సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యన దూరపు బంధువుల నుండి శుభకార్యం ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు లబిస్తాయి.
కన్య :
అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన వాతావరణం ఉంటుంది. ఇంటాబయటా పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సాయపడతారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు అందుతాయి. కొన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. సంతాన విద్యా విషయాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ధన పరమైన ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దుర్గా ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.
తుల :
ఇంట బయట ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో పెద్దల నుండి ఆసక్తికర విషయాలు సేకరిస్తారు. దూరప్రాంత బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ప్రారంభమునకు ధనసహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు అధికారుల సహాయంతో నూతన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో ప్రయాణమున మార్గ అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వలన శుభఫలితాలు పొందుతారు.
వృశ్చికం :
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో అనుకూలత కలుగుతుంది. సోదరులతో సఖ్యత గా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో స్థిరాస్తి వ్యవహారాలను సజావుగా పూర్తిచేస్తారు. సమాజంలో పరిచయాలు మరింత విస్తృతమౌతాయి. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారపరంగా నూతన పద్ధతులను అవలంబించి సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు పని భారం నుండి కొంత ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వారాంతంలో వ్యయ ప్రయాసలు పెరుగుతాయి. ధన వ్యయ సూచనలు ఉన్నవి. దుర్గా అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
ధనస్సు :
చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాలలో సందిగ్దంలో పడవేస్తాయి. ధన పరంగా కటకట ఏర్పడి నూతన రుణాలు చేయవలసి వస్తుంది. బంధువుల మాటలు మానసికంగా భాదిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసిరాక నిరాశ కలుగుతుంది. ముఖ్యమైన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. మిత్రులు కూడా శత్రులవలె ప్రవర్తిస్తారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి మరింత మెరుగుపడుతుంది. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుంది. ఆదిత్య హృదయం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
మకరం :
కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులు క్రమక్రమంగా తొలగుతాయి. ఆలోచనలు ఆచరణలో పెట్టి మంచి ఫలితాలు రాబడతారు. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం అందుతుంది. భూ సంభందిత క్రయ విక్రయాలులో అవరోధాలు తొలగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలలో ఊహించని విధంగా లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. అన్ని రంగాల వారి శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వారం ప్రారంభంలో ధనపరంగా ఇబ్బందులుంటాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. నవగ్రహ అష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
కుంభం :
ఇంటాబయటా సమస్యలను పరిష్కరించుకుంటారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నూతన కార్యక్రమాలను నిర్వహించి సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. నూతన వాహన యోగం ఉన్నది. చిన్న నాటి మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. ఆకస్మికంగా నిలిచిపోయిన గృహ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారాలలో ఆశించిన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక పురోగతి కలుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూలత పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వారంచివరి పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. గణపతి ఆరాధన చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మీనం :
నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఆనందంగా గడుపుతారు. భూవివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. ఇంటాబయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అధికారుల నుండి అందిన కీలక సమాచారం నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు మరింత అనుకూలమైన కాలం అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.