వార ఫలాలు: తేది 11-01-2026 నుంచి 17-01-2026 వరకు
ఆర్థికంగా కొంత ఉత్సాహం గా ఉన్నప్పటికీ ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. కొత్త ఋణ ప్రయత్నాలు చేయవలసి రావచ్చు. స్థిరాస్తి విషయాలలో ఏర్పడిన వివాదాలు పరిష్కారం నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
By - అంజి |
వార ఫలాలు: తేది 11-01-2026 నుంచి 17-01-2026 వరకు
మేషం :
ఆర్థికంగా కొంత ఉత్సాహం గా ఉన్నప్పటికీ ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. కొత్త ఋణ ప్రయత్నాలు చేయవలసి రావచ్చు. స్థిరాస్తి విషయాలలో ఏర్పడిన వివాదాలు పరిష్కారం నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. విద్యా విషయాలలో శ్రమాధిక్యత తప్పదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వాహన యోగం ఉన్నది వారాంతంలో శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యంలో శ్రద్ధ అవసరం శివాలయ దర్శనం చేసుకోవడం వలన అనుకూల ఫలితాలు కలుగుతాయి.
వృషభం :
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించి పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధన పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి విషయాలలో స్వల్ప వివాదాలు కలిగినప్పటికీ రాజీ చేసుకుంటారు. గృహ నిర్మాణవిషయమై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన విద్యా విషయాలలో అనుకున్న ఫలితాలు పొందుతారు. సంఘంలో ఉన్న ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఇంతకు ముందు కంటే మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగమున నూతనబాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారం మధ్యన అనారోగ్య సమస్యలు ఉంటాయి. మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దుర్గా దుర్గా ఆరాధన శుభ ఫలితాలను కలిగిస్తుంది.
మిథునం :
ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ విషయమై ఆలోచనలు ఆచరణలో పెడతారు. కుటుంబ సభ్యులు మీ మాటకు విలువ ఇస్తారు. విద్యాపరంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. వ్యాపారాలలో శుభవార్తలు అందుతాయి. శత్రువులు కూడా మిత్రుల వలె ప్రవర్తిస్తారు. ఉద్యోగాలలో ఊహించని పదవులు లభిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు అధికమైన పనులు పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
కర్కాటకం :
స్థిరాస్తి విషయాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి అధికారులు నుండి ప్రశంసలు పొందుతారు. సంఘంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. సన్నిహితులు మీ నిర్ణయాలను గౌరవిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. దూరప్రాంత బంధుమిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వివాహ ప్రయత్నాలు కలసివస్తాయి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వారం ప్రారంభంలో ఇతరులతో వివాదాలు ఉంటాయి. ప్రయాణం సూచనలు అనుకూల ఫలితాలు కలుగుతాయి. నవగ్రహ ఆరాధన అనుకూల ఫలితాలను కలిగిస్తుంది.
సింహం :
విద్యార్థులు విదేశీ ప్రయాణాలలో ఆటంకాలు తొలగుతాయి. నూతన కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. గృహనిర్మాణానికి ఏర్పడిన ఆటంకాలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరించడానికి చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వారాంతంలో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. స్వల్ప అనారోగ్య సూచన ఉన్నవి. ఖర్చులు అదుపు చేయడం మంచిది. సుబ్రమణ్య స్వామిక అభిషేకం చేయించడం వలన మంచి ఫలితాలు పొందుతారు.
కన్య :
ఆదాయం అంతగా కనిపించకపోయినా సౌకర్యాలకు ఇబ్బంది ఉండదు. దీర్ఘకాలికంగా ఉన్న వివాదాలను సర్దుబాటు చేసుకుంటారు. మిత్రులతో మనస్పర్ధలు తొలగుతాయి. ఒక ముఖ్య విషయమై మీరు తీసుకున్న నిర్ణయం అనుకూల ఫలితాలను ఇస్తాయి. మంచి ఆలోచనలతో ఆత్మవిశ్వాసంతో వ్యవహారాలు పూర్తిచేస్తారు. గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. జీవితభాగస్వామితో కలసి పుణ్య క్షేత్రం దర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులకు తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉంటాయి. అధికారుల నుండి ఊహించని అనుకూలత కలుగుతుంది. వారాంతమున స్వల్ప అనారోగ్యం ఉన్న ఇబ్బంది కలిగించవు. ఆకస్మిక నిర్ణయాలు కొంత ఆర్థిక ఒడిదుడుకులు కలగజేస్తాయి. ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేయించడం వలన శుభఫలితాలుంటాయి.
తుల :
సమయానికి ధనసహాయం లభించదు. కొని పనులలో ప్రయత్నాలు కూడా కలిసిరావు. చేపట్టిన వ్యవహారాలలో చేసే ఆలోచనలు మందకొడిగా సాగుతాయి. అనుకోకుండా ఇతరులతో కొన్ని వివాదాలు కలిగినప్పటికీ ఆత్మ విశ్వాసంతో మెలగడం మంచిది. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. విద్యా రంగం వారికి విదేశీ ప్రయాణాలు కొంత అనుకూలంగా ఉంటాయి. వారాంతమున శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధన పరంగా ఇతరుల నుండి సహాయం లభిస్తుంది. వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
వృశ్చికం :
చాలా కాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సోదరులతో ఉన్న మనస్పర్థలు తొలగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. అవసరానికి తగినట్టు నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహన యోగం ఉన్నది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యత నుండి కొంత ఊరట లభిస్తుంది. వారాంతమున ధన వ్యయ సూచనలు ఉన్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన ఫలితాలు కలిగిస్తుంది.
ధనస్సు :
వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది ధనాదాయం బాగుంటుంది. వ్యాపారాలు విస్తరణకు నూతన కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగాలలో ఉన్నత హోదా పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ పూర్తి చేయగలుగుతారు. విద్యా విషయాలలో శ్రద్ధ చూపించడం మంచిది. కుటుంబ సంబంధిత వివాదాల నుండి పరిష్కారం లభిస్తుంది. కొన్ని ఆలోచనలు ఆచరణలో పెడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో నూతన నిర్ణయాలు కలసి వస్తాయి. వారం మధ్యన స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు ఉంటాయి. ధన వ్యయ సూచనలు ఉన్నవి. కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
మకరం :
భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలను అధిగమిస్తూ ఆర్థికపరంగా ఉత్సాహంగా ఉంటుంది. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలను కుటుంబ సభ్యుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొని ప్రశంసలు పొందుతారు. బంధుమిత్రులు నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ పరంగా ఉన్న ఒడిదుడుకులు తొలగి ప్రశాంత వాతావరణం ఉంటుంది. వారం మధ్యన ఇతరులతో వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. హయగ్రీవస్తోత్రం పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
కుంభం :
సమాజంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కుటుంబ విషయంలో తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్య పరుస్తాయి. విద్యారంగం వారికి ఫలితాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. శత్రు సంబంధిత సమస్యల పై పైచేయి సాధిస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగ విషయమై అధికారుల అండదండలు పొందుతారు. వారం ప్రారంభంమున ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంద్ర కృత లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
మీనం :
కుటుంబ విషయమై ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో ప్రముఖుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. ఆర్థిక ఒడిదుడుకుల నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. మీరు చేసే ఆలోచనలు కుటుంబ సభ్యులు ఆదరిస్తారు. వ్యాపారాలలో నూతన ప్రయత్నాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగములో ఉన్నత కలుగుతుంది. వారం మధ్యన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. నృసింహ ఆరాధనా శుభ ఫలితాలు కలిగిస్తుంది.