గోదా గోవింద గీతం : కుండలలో చిక్కగా నిండిన మజ్జిగల చర్రు చర్రున
Thick buttermilk curds in pots.కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
By M Sridhar Published on 22 Dec 2022 2:03 AM GMTకీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్
భావార్థ గీతిక
అదిగోవినలేదా కీచుకీచు పిట్టల కిలకిలారావములు
భారద్వాజ పక్షుల మధుర సంభాషణలా నిక్వణాలు
కుండలలో చిక్కగా నిండిన మజ్జిగల చర్రు చర్రున
నిలువెత్తు కవ్వాల యవ్వనులు చిలుకు సవ్వడులు
ఊగెడు గోపికల కేశాల రాలిన పూలవాసనాలు తాకలేద
వగలు నగలు నగవులు కలిసి దీపించు వెల్గులు చేరలేద
పీతాంబరుని వేడక ఈ పిచ్చినిదురేలనే పిచ్చిపిల్ల
మనము తెరచి మాధవుడినె తలచెదము తనివిదీర
శెన్ తమిళ్ అంటే అందమైన తమిళ భాషలో భక్తి, భగవత్కీర్తన, ఆచార్య వైశిష్ఠ్యం, భాగవత కథలు, రామాయణ ప్రస్తావన కలగలిపి ఓ ఎనిమిది పంక్తులలో కుదించి, గేయం తో అలరించడం ఎవరికి సాధ్యం.
అర్థం : కీశు కీశెన్ఱు= కీచుకీచుమని, ఎంగుం = అంతటనూ, ఆనైచ్చాత్తన్ = భారద్వాజ పక్షులు, కలందు = ఒకొరకరు కలిసి, పేశిన =మాట్లాడిన, పేచ్చు అరవం = మాటల ధ్వని, కేట్టిలైయో = వినలేదూ, పేయ్ ప్పెణ్ణే = ఓసి పిచ్చిదానా, కాశుం=బొట్టు, పిఱప్పుం=మంగళ సూత్రం, కలకలప్ప=గలగలమని చప్పుడు చేస్తూ, క్కై పేర్ త్తు= చేతులు కదిలిస్తూ, వాశం= వీచుచున్న, నఱుం = మంచి పరిమళం, కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్ = కవ్వముతో, ఓ శై పడుత్త = ధ్వనివచ్చేట్టుగా చిలుకుతుంటే, తయిర్ అరవం = పెరుగు ధ్వనిని, కేట్టిలైయో= వినడం లేదూ, నాయగ ప్పెణ్ పిళ్ళాయ్!= ఓ నాయకురాలా, నారాయణన్ =ఆశ్రయించిన వారిని కాపాడాలనే ప్రేమతో అంతగా వ్యాపించిన వాడు, మూర్ త్తి = కృష్ణరూపంలో మనముందున్నవాడు, కేశవనై= కేశవుడనే రాక్షసుని చంపిన వాడు, ప్పాడవుం= కీర్తిస్తూ ఉంటే, నీ =నీవు, కేట్టే కిడత్తియో = వినికూడా పరున్నావా, తేశం ఉడైయాయ్!= ఓ తేజశ్శాలీ తిఱ= తలుపు తెఱువు తల్లీ, లోర్ ఎమ్బావాయ్.
- మాడభూషి శ్రీధర్