వార ఫలాలు : 17వ తేదీ ఆదివారం నుండి 23వ తేదీ శనివారం వరకు

Rasi Phalalu from 17th January to 23rd. ఈ వారం రాశి ఫలాలు తెలుగు లో.17వ తేదీ ఆదివారం నుండి 23వ తేదీ శనివారం వరకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jan 2021 10:29 AM IST
Raasi Palalu

* పర్వదినములు*

తేదీ 17-1-2021 ఆదివారం నుండి 15-2-2021 సోమవారం వరకు గురు మూఢమి. ఇంచుమించుగా నెలరోజులు శుభకార్యములకు పనికిరాదు. అనంతరం శుక్రమౌఢ్యం కూడా ప్రారంభం అవుతుంది.

తేదీ 21-1-2021 గురువారం శుద్ధ అష్టమి మహారుద్రాష్టమి అంటారు. నమక చమకాలు పారాయణ అభిషేకము అమ్మవారికి అర్చనలకు చాలా మంచిది.

తేదీ 24 1 2020 15 ఆదివారం మోక్ష ఏకాదశి ఉపవాసం ఉండటం చాలా మంచిది.

మేష రాశి :

ఈ రాశి వారికి ఈ వారం కూడా ఆర్థికంగా బాగుంటుంది. అయినప్పటికీ రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. కొత్త రుణ ప్రయత్నాలు చేయవలసి రావచ్చు. రవి వల్ల కలిగే కార్య జయాన్ని పొందడం కోసం మీరు విపరీతమైన శ్రమ పడవలసి ఉంటుంది. చేపట్టిన కార్యకలాపాలన్నీ మందకొడిగా సాగుతాయి. విద్యా విషయంలో కూడా శ్రమ ఎక్కువ పడవలసిన అవసరం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారంలో మిత్రమా ఫలితాలుంటాయి. ఈ వారం మీరు 45% శుభ ఫలితాలు పొందుతున్నారు. అశ్విని నక్షత్ర జాతకులకు నైధనతార అయింది ప్రతికూలతలు చాలా ఎక్కువ. భరణి నక్షత్ర జాతకులకు సాధన తార చాలా అనుకూలంగా ఉంటుంది. కృత్తిక 1వ పాదం వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఉంటాయి.

పరిహారం : రాహు కేతు జపము, శుక్రునకు జపం చేయించండి. శని ప్రభావం తగ్గడం కోసం శనివారం నియమాన్ని పాటించడం నల్ల వస్త్రము నువ్వులు దానం చేయడం నూనె దీపం వెలిగించడం మంచి ఫలితాన్ని ఇస్తాయి.

వృషభ రాశి :

ఈ రాశి వారికి ఈవారం కూడా పెద్దగా అనుకూలంగా ఉండదు. కానీ గత వారం మీద మెరుగైన ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించి ఆ పనులు పూర్తి చేస్తారు. ఆర్థికమైన విషయాలలో కాస్తంత అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇలాంటి విషయాల్లో స్వల్ప వివాదాలు కలిగినప్పటికీ రాజీ చేసుకుంటారు. రవి, కుజుల తో పాటు రాహుకేతువులు సైతం మీకు వ్యతిరేకంగా పని చేసే పనిలో ఉన్నారు కాబట్టి చేసే ప్రతి పనిలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అయితే వ్యాపార వ్యవహారాలు మాత్రం ఇంతకు ముందు కంటే మరింత ఉత్సాహంగా కొనసాగుతాయి. ఉద్యోగంలో ఒక నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఈ వారంలో మీకు అనారోగ్య సూచన ఉంది కాబట్టే ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మీకు ఈ వారంలో 36శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. కృత్తికా నక్షత్రం 2 3 4 పాదాలు వారికి ప్రత్యక్తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది అన్ని కోరికలు కూడా చాలా చక్కగా నెరవేరుతాయి. మృగశిర 1 2 పాదాలు వారికి మాత్రం విపత్తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి.

పరిహారం : సూర్యనమస్కారాలు చేయండి. గోధుమపిండి అప్పాలు గానీ అట్టు గాని సూర్యునికి నివేదన చేయండి. ఆదిత్య హృదయం పఠనం మేలు చేకూరుస్తుంది.

మిధున రాశి :

ఈ రాశి వారికి ఈవారం కాస్త అనుకూలంగానే ఉంది. ధనలాభం కుటుంబసౌఖ్యం సుఖసంతోషాలు ఉన్నాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయవంతంగా పూర్తి చేస్తారు. అన్ని వైపుల నుంచి ధనాదాయం లభిస్తుంది దీర్ఘకాలిక సమస్యల నుండి బయట పడే అవకాశం ఉంది. అయితే మీరు ఆరోగ్య విషయంలో గానీ మీ తండ్రిగారి ఆరోగ్య విషయంలో గానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుజ, బుధులు ఈ వారంలో అనుకూలం గా ఉన్నారు. అయితే గురు శుక్రులు ఇద్దరు మీకు అనుకూలంగా వ్యవహరించరు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీకు ఈ వారంలో 45 శాతం ఫలితాలు ఉన్నాయి. మృగశిర 3 4 పాదాలు వారికి విపత్తార కాబట్టి అనుకూలత కూడా తక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త పడ గలుగుతారు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు సంపత్ తార కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది పునర్వసు 1 2 3 పాదాలు వారికి మాత్రం జన్మతార అయింది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

పరిహారం : శుక్రునకు జపం చేయించండి. శుక్రవారం నియమాన్ని పాటించడం అమ్మవారి పూజ ధ్యానం మంచిది. శని ప్రభావం తగ్గడం కోసం శనివారం నియమాన్ని పాటించడం నల్ల వస్త్రము నువ్వులు దానం చేయడం నూనె దీపం వెలిగించడం మంచి ఫలితాన్ని ఇస్తాయి.

కర్కాటక రాశి :

ఈ రాశి వారికి శుభ పరిణామాలు కొనసాగుతాయి. స్థిరాస్తుల విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ధనం ఎంత వస్తుందో అలాగే అందుకు తగ్గ ఖర్చు కూడా ఉంటుంది. అయినా సరే ఎంతో కొంత దాచుకునే ప్రయత్నం చేయటం మరిచిపోవద్దు ఎందుకంటే ఆ అవకాశం మీకు ఏ వారం లో ఉంది. ఇతరుల కోసం మీరు చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఒకానొక సమయంలో అపకీర్తిని కూడా మూటగట్టుకుంటారు. ఎంత ఉత్సాహం ఉంటుందో అంతకి మించి నటువంటి నిరాశ నిస్పృహలకు లోనవ్వుతారు. శనిగ్రహ ప్రభావం వలన ఈ రకమైనటువంటి ఆలోచన కలుగుతుంది. అయితే ఇవన్నీ తాత్కాలికం అని గ్రహిస్తే ముందుకు వెళ్ళగలరు.మీకు ఈ వారంలో 45శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. పునర్వసు నాలుగో పాదం వారికి జన్మతార అయింది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. పుష్యమి నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది కాబట్టి అనుకూలంగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకుమిత్ర తార అయింది కృషి చేస్తే చాలా ఉన్నత స్థితికి వెళ్లే అవకాశం ఉంది.

పరిహారం :- శనికి జపము, నల్ల నువ్వుల దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.అలాగే శుక్రునికి రవికి జపాలు చేయించడం కూడా మంచిదే.

సింహరాశి :

ఈ రాశి వారికి ఈ వారం నుంచి నూతన కార్యక్రమాలన్నీ కలిసొస్తాయి. అంతేకాదు అనుకోని సంపదల వల్ల ప్రయోజనాలు పొందుతారు. కొద్దికొద్దిగా మీ శత్రువుల లో సైతం మీరు మంచి పేరు సంపాదించుకుంటారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. అగౌరవ పడే కొన్ని సన్నివేశాలు కూడా కనిపిస్తున్నాయి. సంఘములో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు విస్తరించడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎంత మీ ప్రయత్నం ముందుకు వెళుతూ ఉంటుందో అంత కూడా గౌరవానికి భంగం కలుగుతుంది. రవి,గురు శుక్ర శనులు మీకు చాలా అనుకూలంగా ఉన్నారు కాబట్టి కాస్త ఆచితూచి వ్యవహరించ గలిగితే పనులన్నీ సులువుగా చక్కగా నెరవేరుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. అయితే ఈ వారం ప్రారంభంలో వివాదాలకు అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. ఈవారం మీరు బంధువులతో ఆనందంగా గడుపుతారు. అనారోగ్య సూచన కనిపిస్తోంది కాస్త అప్రమత్తంగా ఉండండి. ఈ వారంలో 45 శాతం శుభఫలితాలు ఉన్నాయి.మఖా నక్షత్ర జాతకులకు నైధనతార అయింది ప్రతికూలతలు చాలా ఎక్కువ. పుబ్బ నక్షత్ర జాతకులకు సాధన తార చాలా అనుకూలంగా ఉంటుంది. ఉత్తర 1వ పాదం వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఉంటాయి.

పరిహారం : రాహు కేతువులకు పూజలు చేయించండి కాలసర్ప దోషం పూజ చేయిస్తే మంచిది. వివాహం కావలసిన వారు మాత్రమే కాదు ఎవరైనా సరే కుజ గ్రహ జపం చేయడం మంచిది.

కన్యారాశి :

ఈ రాశి వారికి ఈవారం ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. దీర్ఘకాలికంగా ఉన్న వివాదాలలో సర్దుబాట్లు ఉంటాయి. మిత్రులతో మనస్పర్థలు తొలగుతాయి. ఒక ముఖ్య విషయం లో మీరు తీసుకున్న నిర్ణయం అనుకూల ఫలితాలను కలిగిస్తుంది. అయినప్పటికీ కొంతమంది శత్రువులు సహజంగానే కొనసాగుతరు. సంపదలు పొందడానికి కూడా మీకు ఒక మంచి మార్గం దొరుకుతుంది. మంచి ఆలోచనలతో ఆత్మవిశ్వాసంతో చేసే ప్రయత్నంలో కొంత వరకు కృతకృత్యులు అవుతారు అది మీకు ధైర్యాన్ని ఇస్తుంది . వ్యాపారం లో నూతన పెట్టుబడులకు తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో మీ వల్ల కావు అనుకున్న పనులు సైతం ఈ వారంలో మీ చేత సునాయాసంగా జరిపించి పడతాయి. మీరు ఎంత లబ్ధి పొందిన కొంత నష్టం లేదా వ్యయం తప్పదు. మీ సొంత ఆలోచనలు అంతగా పని చేయవు. అందుకే ఇతరుల మీద అందులోనూ ముఖ్యంగా గురువు మీద ఆధారపడి నట్లయితే మీకు కొంత వరకు మంచి జరుగుతుంది. ఈ రాశివారికి ఈ వారంలో 45 శాతం ఫలితాలు ఉన్నాయి. ఉత్తర నక్షత్రం 2 3 4 పాదాలు వారికి ప్రత్యక్తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. హస్త నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది అన్ని కోరికలు కూడా చాలా చక్కగా నెరవేరుతాయి. చిత్త 1 2 పాదాలు వారికి మాత్రం విపత్తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి.

పరిహారం : రవి, కుజ, శని గ్రహాల జపం మంచి ఫలితాలు ఇస్తుంది. బుధవార నియమాలు పాటించండి. ఆంజనేయస్వామికి ఆకు పూజ చేయించినా మంచిదే.

తులా రాశి :

ఈ రాశి వారికి ధనలాభము, శత్రు జయం చాలా ఆనందాన్ని కలిగిస్తాయి కానీ అవేవి సమయానికి చేతికి రావు. ఒకవేళ అందినా వాటిని వినియోగించుకోలేక మాత్రం చాలా ఇబ్బంది పడతారు. చేపట్టిన వ్యవహారాలు చేసే ఆలోచనలు అన్నీ మందకొడిగా సాగుతాయి. అనుకోకుండా ఇతరులతో కొన్ని వివాదాలు కలిగినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం మంచిది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారాలు కాస్త నిరాశాజనకంగా ఉంటాయి. సహజంగా వీరు శారీరకంగా గానీ మానసికంగా గానీ సమతుల్య స్థితిని పొంది ఉంటారు. కానీ శని రాహు కేతువు ల యొక్క ప్రభావము వీరిని అనారోగ్యం పాలు చేస్తుంది. శుక్రగ్రహ అనుకూలత మీకు సగానికి సగం బలాన్ని చేకూరుస్తుంది. దాన్ని మీరు పూర్తిగా వినియోగించుకో గలిగితే మీరు ఏదైనా సాధించవచ్చు. మీకు ఈ వారం లో36శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. చిత్తా 3 4 పాదాలు వారికి విపత్తార కాబట్టి అనుకూలత కూడా తక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త పడ గలరు. స్వాతి నక్షత్ర జాతకులకు సంపత్ తార కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది. విశాఖ 1 2 3 పాదాలు వారికి మాత్రమే జన్మతార అయింది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

పరిహారం: శనికి జపము హోమము నల్ల నువ్వులు దానం చేయండి తైల అభిషేకం చేయించండి. శని స్తోత్రం పఠించండి. సర్ప సూక్త పారాయణ మంచి ఫలితాలను ఇస్తుంది

వృశ్చిక రాశి :

ఈ రాశి వారు ఈ వారంలో చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. కుటుంబంతో హాయిగా ఉండే అనుకూల పరిస్థితులు కనపడుతున్నాయి. ఆర్థికంగా బావుంటుంది అయితే శత్రువుల బారినుంచి మీరు తప్పించుకోలేరు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సోదరులతో మనస్పర్థలు తొలగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. అలాగే గురు గ్రహము కూడా మీకు అనుకూలంగా లేక పోవటం వల్ల కాస్త ఇబ్బందికరంగానే ఉండే అవకాశం ఉంది. అయితే మీరు వల్ల జరిగే చిన్నచిన్న శుభకార్యాలకు హాజరు కావడం ద్వారా బంధువులతో గడుపుతారు, ఆనందాన్ని అనుభవిస్తారు. వాహన యోగం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలనుండి కాస్త ఊరట లభిస్తుంది మీకు ఈ వారంలో 45శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. విశాఖ నాలుగో పాదం వారికి జన్మతార అయింది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అనురాధ నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది కాబట్టి అనుకూలంగా ఉంటుంది. జ్యేష్ట నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కృషి చేస్తే చాలా ఉన్నత స్థితికి వెళ్లే అవకాశం ఉంది.

పరిహారం :ముందు రోజు నాన వేసిన పెసలు బుధవారం నాడు ఉదయం బెల్లం వేసి ఆవుకు తినిపించండి. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ

ధను రాశి :

ఈ రాశి వారికి ఈ వారంలో వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థికంగా ఈ వారం చాలా బావుంది. వ్యాపార విస్తరణకు,నూతన కార్యక్రమాలకు అవకాశం ఉంది. ఉద్యోగాలలో ఉన్నత హోదా పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ పూర్తిచేయగలుగుతారు. అయితే విద్యా విషయాలలో శ్రద్ధ చూపించడం మంచిది. కుటుంబ సంబంధిత వ్యవహారాలను పరిష్కారం లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన ఆలోచనలు ఆచరణలో పెడతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ వారంలో కూడా మీరు కుటుంబ ఆనందం కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. దానికి తగిన ప్రతిఫలాన్ని మానసికంగా పొందగలుగుతారు. మకర సంక్రమణాలు తర్వాత రవి ప్రభావం వల్ల మీలో ధైర్యం కాస్త తగ్గింది. కాస్త ఆచితూచి వ్యవహరించండి. మీకు ఈ వారంలో 54 శాతం శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. మూలా నక్షత్రం జాతకులకు నైధనతార అయింది ప్రతికూలతలు చాలా ఎక్కువ. పూర్వాషాడ నక్షత్ర జాతకులకు సాధన తార చాలా అనుకూలంగా ఉంటుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఉంటాయి.

పరిహారం: శని, కుజ దోషాలు పోవడానికి జపం చేయించండి హోమాదులు జరిపించండి దానధర్మాలు చేయండి.

మకర రాశి :

ఈ రాశి వారికి ఈ వారం కూడా పెద్దగా అనుకూలంగా లేదు. అయితే భూ సంబంధిత క్రయవిక్రయాలు మాత్రం అనుకూలంగా సాగుతాయి.చేపట్టిన పనులలో అవరోధాలను అధిగమిస్తూ ఆర్థికంగా ఉత్సాహం పొందుతారు. సన్నిహితులతో వివాదాలు ఏర్పడతాయి. అయితే మీరే సమయానుకూలంగా వ్యవహరించి ఆ వివాదాలను సమర్ధవంతంగా పరిష్కరించుకుంటారు. మీరు ఈ వారంలో స్థానచలనం పొందే అవకాశం ఉంది. అయితే ఉద్యోగ పరంగా వుండకూడదు వేడుకలు తొలగి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో పరిస్థితులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ వారంలో మీకు 27శాతం మాత్రమే శుభపరిణామాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్రం 2 3 4 పాదాలు వారికి ప్రత్యక్తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. శ్రవణం నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది అన్ని కోరికలు కూడా చాలా చక్కగా నెరవేరుతాయి. ధనిష్ఠ 1 2 పాదాలు వారికి మాత్రం విపత్తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి.

పరిహారం: శని గురు జపం చేయించండి. గురు, మేధా దక్షిణామూర్తి స్తోత్రం పఠనం మరువకండి.

కుంభరాశి:

ఈ రాశి వారికి ఈ వారంలో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కుటుంబ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్య పరుస్తాయి. ఈ వారంలో మీకు ధనమైతే వస్తుంది కానీ అంతకంతా ఖర్చు అయి పోతున్నట్టుగా అనిపిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. శత్రు సంబంధిత సమస్యల పై పైచేయి సాధిస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంచడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇక ఉద్యోగం విషయంలో కూడా అదే పొందుతారని చెప్పలేము.మొత్తంమీద ఈ వారం మీకు కొంత మధ్యమంగా నడుస్తుంది. 36% మాత్రమే శుభఫలితాలు ఉన్నాయి.ధనిష్ఠ 3 4 పాదాలు వారికి విపత్తార కాబట్టి అనుకూలత కూడా తక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త పడ గలుగుతారు. శతభిషం నక్షత్ర జాతకులకు సంపత్ తార కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది. పూర్వాభాద్ర 1 2 3 పాదాలు వారికి మాత్రమే జన్మతార అయింది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

పరిహారం : శని జపం చేయించండి. నవగ్రహ దర్శనం. నిత్యము రుద్రాభిషేకము చాలా మంచి ఫలితాలను ఇస్తాయి.

మీన రాశి : ఈ రాశి వారికి గత వారంతో పోలిస్తే ఈ వారం శుభ ఫలితాలు కాస్త తగ్గుతాయి. అయినప్పటికీ 63% శుభ పరిణామాలు. ఈ వారంలో కూడా అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగిపోతుంది...గతవారం చెప్పినట్టుగానే కుజ, కేతులు తప్ప ఇతర గ్రహాలన్నీకూడా సహకరించడం వల్ల విశేష ఫలితాలు పొందగలుగుతున్నారు. సంతోషము ధనము ఒకటేమిటి ఇవన్నీ వీరు పొందడమే కాదు ఇతరులకు కూడా పొందేటట్లు చేస్తారు. సాధారణంగా మీన రాశి వారికి ఎదుటి వాళ్ళకి పెట్టే ఆలోచన ఉండదు అన్న విషయం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఇలాంటి అభిప్రాయాన్ని, దుర్గుణాన్ని తప్పించుకోవాలంటే మీరు ప్రయత్న పూర్వకంగా దానగుణాన్ని అలవర్చుకోవాలి. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. ఇంట్లో శుభకార్యాలు కలిసివస్తాయి. పదిమంది చేరి అభినందించే మంచి ఉద్యోగం గాని ఆర్థిక లావాదేవి లేదా చదువు పొందే అవకాశాలు ఈ వారంలో వీరికి ఉన్నాయి. ప్రతికూలతలు చాలా తక్కువ. పూర్వాభాద్ర 4వ పాదం వారికి జన్మతార ఆరోగ్యం జాగ్రత్త వహించండి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది కాబట్టి అనుకూలంగా ఉంటుంది. రేవతీ నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కాబట్టి చాలా బావుంటుంది అని చెప్పొచ్చు.

పరిహారం : ఈ వారం కూడా కుజునకు పూజలు చేయించండి.సుబ్రహ్మణ్యం పూజ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.







Next Story