రాశి ఫ‌లాలు : 20-12-2020 ఆదివారం నుండి 26-12-2020ది శనివారం వరకు

Rasi Phalalu. ఈ రాశి వారు ఈ వారం కూడా ఆనందకరంగా గడుపుతారు. బుధుడు, శుక్రుడు, వారం మధ్యలో మారనున్న కుజుడు

By Medi Samrat  Published on  21 Dec 2020 8:19 AM GMT
రాశి ఫ‌లాలు : 20-12-2020 ఆదివారం నుండి 26-12-2020ది శనివారం వరకు

మేష రాశి:

ఈ రాశి వారికి ఈ వారం శుభా శుభ మిశ్రమం గా ఉంటుంది. రవి మిమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తాడు. వారం మధ్య మారనున్న కుజుడు కూడా మీకు ఎటువంటి లాభం కలిగించడు. బుధ, గురులు సైతం శారీరకంగా శ్రమని, ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తారు. అయితే శుక్రుడు మాత్రం మీకు లాభం చేకూర్చనున్నాడు. శుభకార్యాలకు వెళ్లడం ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు అయితే మీ వస్తువులను జాగ్రత్త చేసుకోండి రాహుకేతువులు వస్తు పరంగా గానీ వ్యక్తుల రూపంలో గానీ మిమ్మలను ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అశ్వినీ నక్షత్రం వారికి సాధన తార అయింది కాబట్టి కార్యజయం. భరణి నక్షత్రం వారికి ప్రత్యక్ తార అయ్యింది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. కృత్తికా నక్షత్రం వారికి క్షేమ తార అయ్యింది కాబట్టి అనుకున్న పనులు నెరవేరుతాయి.

పరిహారం: ప్రతి బుధవారం నాడు విష్ణుసహస్రనామ పారాయణ చేసి నానబెట్టిన పెసలు బెల్లం భగవంతునికి నైవేద్యంగా పెట్టడంతోపాటు ఆవుకి తినిపించండి.

వృషభ రాశి:

ఈ రాశి వారికి ఈ వారం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే వారం మధ్యలో మారనున్న కుజుడు మీకు కనబడని కష్టాలను ఇవ్వబోతున్నాడు. అలాగే శుక్ర, శనులు సైతం కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి అనారోగ్యానికి కారణం కానున్నారు కాబట్టి జాగ్రత్త వహించండి అయితే ఆర్థికంగా ఈవారం మీకు బాగానే ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు అనుకున్న పనులు ఈ వారం నెరవేరుతాయి. కృత్తికా నక్షత్రం వారికి క్షేమతార తో వార ప్రారంభం కాబట్టి అంతా మంచే జరుగుతుంది. రోహిణి నక్షత్రం వారికి విపత్ తార అయ్యింది కాబట్టి అప్రమత్తంగా ఉండటం మంచిది.మృగశిర నక్షత్రం వారికి సంపత్ తార కావున ఆర్థికంగా బాగుంటుంది.

పరిహారం: శనికి జపం చేయించండి అలాగే నవగ్రహ హోమం చేయించండి.అన్ని విధాలా అనుకూలంగా మంచి జరుగుతుంది.

మిధున రాశి:

ఈ రాశి వారికి ఈ వారం లో చాలా కాలం తర్వాత మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబం లోని ఒక మహిళ కారణముగా మీరు అపకీర్తిని పొందుతారు. అయినప్పటికీ మీరు ఆచితూచి వ్యవహరించడం ద్వారా సమస్య నుంచి బయటకు వస్తారు. మంచి చెడు అన్న విచక్షణతో మీరు వ్యవహరించ గలిగితే అంతా మంచే జరుగుతుంది. బుధ, కేతులు మీకు చాలా అనుకూలంగా ఉన్నారు. వారం మధ్యలో మారనున్న కుజుడు మీకు ధన ప్రాప్తి కలుగ చేస్తాడు. మృగశిర నక్షత్రం వారికి సంపత్తార కాబట్టి ఆర్థికంగా బాగుంటుంది. ఆర్ద్ర నక్షత్రం వారికి జన్మ తార అయ్యింది కావున అనారోగ్య హేతువు. పునర్వసు మొదటి మూడు పాదాలవారికి పరమమిత్ర తార కాబట్టి బాగుంటుంది.

పరిహారం: సర్పసూక్త పారాయణ కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కర్కాటక రాశి:

ఈ రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అలా అని ఆర్థికంగా గాని కుటుంబ పరంగా గానీ ఇబ్బందులు ఉండవు అని కాదు. అన్నింటినీ మీరు భగవదనుగ్రహం వల్ల ఎదుర్కోగలుగుతారు. గురు రాహువులు మీకు ఈ వారం కూడా సౌఖ్యాన్ని ధన లాభాన్ని కలిగిస్తారు. శని కేతు లు మీకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేసినప్పటికి ఇతర గ్రహాల శుభ దృష్టి వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది. వారం మధ్యలో మారుతున్న కుజుడు మీకు ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెడతాడు. కాస్త జాగ్రత్త వహించండి. పునర్వసు నాలుగో పాదం వారికి పరమమిత్ర తార కాబట్టే అంతా అనుకూలంగానే ఉంటుంది. పుష్యమి నక్షత్ర జాతకులకు మిత్ర తార కాబట్టే సన్నిహితుల ద్వారా అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు నైధన తార కావున కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

పరిహారం :- కుజుడికి జపం చేయించండి. మంగళవారం నియమాలు పాటించడం మంచిది.

సింహరాశి:

ఈ రాశి వారు ఈ వారం మానసిక ప్రశాంతతను కోల్పోతారు. చంద్ర గ్రహ స్థితి ఇందుకు కారణం. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో, చిన్న చిన్న అనారోగ్యాల విషయంలో సైతం అప్రమత్తంగా ఉండండి. వారం మధ్యలో మారనున్న కుజుడు మీకు ఆరోగ్యం అనుకూలతను ఇస్తాడు. చేసిన పనులేవీ సక్రమంగా పూర్తి అవ్వకపోవటం మిమ్మల్ని మరింత ఇబ్బంది పెడుతుంది. మఖా నక్షత్ర జాతకులకు సాధన తార అయ్యింది కాబట్టి కార్యాలన్ని సానుకూలంగా జరిగిపోతాయి. పుబ్బ నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార తో ప్రారంభమైంది కాబట్టి ఇబ్బందులు తప్పవు. ఉత్తర ఒకటో పాదం వారికి క్షేమ తార కాబట్టి అంతా మంచే జరుగుతుంది.

పరిహారం:- సూర్య నమస్కారాలు చేయండి. యోగ సాధన ద్వారా మాససిక ప్రశాంతనను పొందగలరు.

కన్యారాశి:

ఈ రాశి వారు ఈ వారం చిన్న అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఆర్థికంగా మాత్రం ఈ వారం మీరు లాభం పొందుతారు. వారం మధ్యలో మారనున్న కుజుడు మీకు అనారోగ్యాన్ని కలిగిస్తాడు. ఈ వారం కూడా మీకు శుక్ర గురు కేతువులు సర్వసంపదలను ఇవ్వనున్నారు. డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండటం ఎప్పటికైనా అవసరం. ఇంట్లోని పెద్దల,చిన్న పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ఉత్తర నక్షత్రం 2 3 4 పాదాలు వారికి క్షేమ తార కాబట్టి బాగుంటుంది. హస్త నక్షత్రం వారికి విపత్ తార అయింది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.,.చిత్త 1 2 పాదాల వారికి సంపత్ తార కాబట్టి ఆదాయంలో అభివృద్ధి ఉంటుంది.

పరిహారం : రవికి సూర్య నమస్కారాలు. కుజ గ్రహ జపం మంచి ఫలితాలు ఇస్తాయి.

తులరాశి:

ఈ వారం మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు. రవి తోపాటు చంద్రుడు కూడా మీకు ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి సహాయపడతాడు అయితే శని గ్రహస్థితి మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. కానీ ఈ వారం మీకు బుధ గురులు అంతగా యోగించరు. శత్రు పీడ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. వారం మధ్యలో మారుతున్న కుజుడు మీకు పెద్దగా ప్రయోజనకారిగా ఉండడు. అయితే ఇతర గ్రహ స్థితి ఈవారం మీకు సాధారణంగా గడిచేలా చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ వారం కూడా మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం . చిత్త 3 4 పాదాలు వారికి సంపత్ తార కాబట్టి ఆదాయంలో అభివృద్ధి ఉంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకు జన్మతార అయింది కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. విశాఖ1 2 3 పాదాల వారికి పరమమిత్ర తార అయ్యింది అంతా మంచే జరుగుతుంది.

పరిహారం: బుధవారం నాడు విష్ణు సహస్ర పారాయణం చేసి, నానబెట్టిన పెసలు బెల్లం కలిపి ఆవుకి తినిపించండి. గురువార నియమాలు పాటించడం కూడా మంచిదే.

వృశ్చిక రాశి:

ఈ వారం మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే ఈ వారంలో మీకు శత్రువులు పెరిగే అవకాశం ఉంది. రాహుకేతువులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ మీరు శారీరకంగా సౌఖ్యాన్ని పొందుతారు. శని బుద్దులు మీరు ఆర్థికంగా బాగా ఉండేలా చూసుకుంటారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. విశాఖ 4వ పాదం వారికి పరమమిత్ర తార అయ్యింది అంతా మంచే జరుగుతుంది. అనురాధ నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కాబట్టి అంతా బాగానే ఉంటుంది. జ్యేష్టా నక్షత్ర జాతకులకు నైధన తార కాబట్టీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

పరిహారం :- కుజుడికి జపం చేయిస్తే మంచిది. వీలైతే సర్ప సూక్త పారాయణ చేయిస్తే మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.

ధను రాశి:

ఈ వారం వరకు ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ చేసిన అనుకున్న పనులు మాత్రం నెరవేరే అవకాశం లేదు. అంతే కాదు ఆరోగ్యం కూడా మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతుంది. మీరు కోరుకున్న స్థలం నుంచి చిన్న మార్పు జరుగుతుంది. అది మీకు అంతగా ఆనందాన్ని ఇవ్వదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు దానికి అంగీకరించవలసి వస్తుంది. మొదట్లో ఇబ్బంది పడిన మీరు కొద్ది రోజుల్లోనే ఆ ప్రాంతానికి అలవాటు పడిపోతారు అంతేకాదు లాభాన్ని కూడా పొందుతారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మూలా నక్షత్ర జాతకులకు సాధన తార అయింది పనులన్ని చాలా చక్కగా నెరవేరుతాయి. పూర్వాషాడ నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది కాబట్టి అప్రమత్తంగా ఉండడం మంచిది. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి క్షేమ తార అయింది కాబట్టి అనుకున్న పనులు పూర్తిగా నెరవేరుతాయి.

పరిహారం :- ఈ వారం కూడా శని, కుజుల జపం మీకు చాలా అనుకూలిస్తాయి.

మకర రాశి:

ఈవారం మీకు ఆర్థికంగా పెద్దగా కలిసి రాదు. ఆరోగ్యం కూడ కాస్త ఇబ్బంది పెడుతుంది. కానీ శుక్రుని కారణంగా స్త్రీ మూలంగా ధన లాభం కలుగుతుంది. అలాగే కేతువు కూడా మీకు ఆర్థికంగా అనుకూలించనున్నాడు. అంటే ఈవారం మీకు చేతిలో డబ్బులు ఉన్నట్టు కనిపిస్తాయి కానీ వచ్చినవి వచ్చినట్టుగా ఖర్చు అయిపోతాయి అయితే ఆరోగ్య విషయంలో ఖర్చవడం మిమ్మల్ని కాస్త బాధ పెడుతుంది. ఇప్పటివరకు మీకు సర్వ భోగాలను ఇచ్చిన కుజుడు ఈ వారం నుంచి మీకు కాస్త ఇబ్బందులకు గురి చేస్తాడు. ప్రశాంతంగా ఉండండి భగవంతుని ప్రార్థించడం ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని గుర్తుంచుకోండి. ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు వారికి క్షేమతార అయింది కాబట్టీ అనుకూలత ఉంది. శ్రవణ నక్షత్ర జాతకులకివారికి విపత్ తార కాబట్టి జాగ్రత్త వహించాలి. ధనిష్ట 1 2 పాదాలు సంపత్ తార అయింది కాబట్టి అంతా శుభాకరం గా ఉంటుంది.

పరిహారం :- రవికి సూర్యనమస్కారాలు, కుజుడికి జపం చేయించండి.

కుంభ రాశి:

ఈ రాశి వారు ఈ వారం కూడా ఆనందకరంగా గడుపుతారు. బుధుడు, శుక్రుడు, వారం మధ్యలో మారనున్న కుజుడు కూడా మీకు మానసికమైన ఆనందాన్ని ఇస్తారు. ఆర్థికంగా పెద్దగా బాగోదు. కొంతమంది మాటలు ఆ క్షణానికి బాధ పెడతాయి. అయినా సరే అలౌకికం అయిన ఆనందం మిమ్మల్ని ఏది పట్టించుకోనివ్వదు. కాబట్టీ మీకు ఈ వారంలో అననుకూలత కూడా బాధ పెట్టదు. ధనిష్ట 3 4 పాదాలు వారికి సంపత్ తార అయింది కాబట్టి అనుకున్న పనులు కొంతవరకు నెరవేరుతాయి. శతభిషం నక్షత్ర జాతకులకు జన్మ తార అయింది కాబట్టి అనారోగ్య హేతువు. పూర్వాభాద్ర 1 2 3 పాదాలు వారికి పరమ మిత్ర తార అయింది కాబట్టి బాగుంటుంది.

పరిహారం :- గురువార నియమాలు పాటించండి నానబెట్టిన శనగలు గురువారంనాడు ఆవుకి తినిపించండ. దక్షిణామూర్తి స్తోత్రం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది.

మీన రాశి :-

ఈవారం మీకు ఆర్థికంగా పెద్దగా బాగోదు కానీ మీరు చేపట్టిన ప్రతి కార్యము నెరవేరుతాయి. కుజుడు మీకు నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ బుధ గురు శుక్ర శనులు మీకు విశేషమైన ఫలితాలను ఇవ్వనున్నారు. ఆర్థికంగా ఎంత బాగోలేని స్థితిలో ఉన్నప్పటికీ సమస్య వచ్చిన నాటికి చేతికి డబ్బు అందుతుంది అందుకు రాహువే కారణం. కేతువు మీకు శత్రువుని పెంచే పనిలో ఉన్నాడు. అయినప్పటికి మీకు శత్రుజయం అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. పూర్వాభాద్ర 4వ పాదం వారికి పరమమిత్ర తార అయింది కాబట్టి బాగుంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు మిత్ర తార తో వారం ప్రారంభం కాబట్టి బాగుంటుంది. రేవతీ నక్షత్ర జాతకులకు నైధన తార అయింది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.

పరిహారం :- సర్ప సూక్త పారాయణ మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.


Next Story