వార ఫలాలు : ది. 03-01-2021 ఆదివారం నుంచి ది. 9-01-2021ది శనివారం వరకు

Raasi Palalu. ఈ వారం ది. 03-01-2021 ఆదివారం నుంచి ది. 9-01-2021ది శనివారం వరకు 12 రాశుల వార ఫలాలు .

By Medi Samrat  Published on  3 Jan 2021 1:03 PM IST
Raasi Palalu

*తే 06-01-2021 ది. భైరవాష్టమి. శివార్చనకు మంచిది.

*తే 09-01-2021ది. ఏకాదశి పర్వదినం

మేష రాశి :

ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంటుంది. ఒక ముఖ్యమైన వస్తువు పోగొట్టు కుంటారు కాస్త అప్రమత్తంగా ఉండండి. ఎంత కష్టపడి పని చేసినప్పటికీ శ్రమకు తగ్గ ఫలితం ఉండదు.మీకు మానసిక సంఘర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. మాట తడబాటు వల్ల ఇతరులతో గొడవలు ఎక్కువ జరిగే అవకాశం తద్వారా అపకీర్తి రాజకీయ చిక్కులు అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం గురించి విచారించడం వల్ల ఉపయోగం లేదు. చేసిన పనికి ఎప్పటికైనా ప్రతిఫలం వస్తుంది అన్న ఆశావాద దృక్పథంతో ముందుకు పోవడం ద్వారా మీరు మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు. ఈవారం మీకు 36% శుభ ఫలితాలు ఉన్నాయి.అశ్వినీ నక్షత్ర జాతకులకు జన్మ తారైంది కొంచెం ఆవేశం తగ్గించుకోవాలి. భరణీ నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తారైంది మధ్యే మార్గంగా నడుస్తుంది. కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వారికి మాత్రం మిత్ర తారైంది కాబట్టి మంచి ఫలితాలని పొందగలుగుతారు.

పరిహారం :- గురు, కుజ జప తర్పణలు చేయించండి,శనగలు దానం చేయండి. మంగళవారం నియమాలు పాటించండి.సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి పూజ హనుమాన్ చాలీసా పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

వృషభ రాశి :-

ఈవారం మీకు ఆర్థికంగా బాగా వుంటుంది. అలా అని ధనలాభం ఉంది కదా అని ముందుకు వెళితే అంతా వ్యయం అయిపోయి కూర్చుంటుంది. కాస్త ఆచి తూచి డబ్బులు ఖర్చు పెట్టండి. ఎంత మంచిగా మీరున్నా శత్రు బాధ అనేది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మీ అభివృద్ధి అవరోధాలు కల్పన చేసే వారు ఎక్కువగా ఉంటారు. గతంలో చేసిన ఒక చిన్న పొరపాటు పని మీకు ఇప్పుడు భయాన్ని చేకూర్చి పశ్చాత్తాపాన్ని కలిగింప చేస్తుంది. రాహు ప్రభావం చేత మీరు మరింత భయభ్రాంతులకు గురి అవుతారు కానీ దైవచింతన కలిగి ఉన్నవారు అయినట్లయితే అవి మిమ్మల్ని ఏమి చేయలేవు. ఈ వారంలో మీరు 36 శాతం శుభఫలితాలను పొందగలుగుతారు. కృతిక రెండు మూడు నాలుగు పాదాలు వారికి మిత్ర తార అయ్యింది చాలా మంచి ఫలితాలు పొందబోతున్నారు. రోహిణి వ నక్షత్ర జాతకులకు నైధన తారైంది ఫలితాలు చాలా వ్యతిరిక్తంగా ఉన్నాయి. మృగశిర ఒకటి రెండు పాదాల వారికి సాధన తార అయ్యింది కాబట్టి అనుకున్న పనులు నెరవేరుతాయి.

పరిహారం :- శని ప్రభావం వుంది కాబట్టి శనికి జపం చేయించండి. నల్లని నువ్వులు నల్లని వస్త్రము పుచ్చుకునే వ్యక్తి శరీరంపై వినియొగించుకునే విధంగా దానం చేయండి.

మిథున రాశి :-

ఈ రాశి వారికి ఈ వారం అంతంతమాత్రంగా ఉంటుంది. ఆర్థికంగా ఒకానొక సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి ఏర్పడి పోతుంది. అష్టమ శని ప్రభావం మీపై ఉండటం చేత జీవితం వ్యర్థం అనే భావాలు కలుగుతాయి. ఒంటరితనం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.అష్టమ గురు గ్రహ ప్రభావం చేత ధన నష్టాన్ని చవి చూస్తారు. స్వతంత్రంగా ఆలోచించ లేకపోవడం వల్ల కాలాన్ని ధనాన్ని దుర్వినియోగం చేస్తారు. మీకంటూ ఒక ఆలోచనా విధానం లేకపోయినట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులపై ఆధారపడినందువల్ల మీకు నష్టమే తప్ప లాభం ఉండదు. స్వతంత్రంగా ఆలోచిస్తే మీకు కొన్ని కార్యాలు నెరవేరే అవకాశం ఉంది. ఈ రాశి వారికి కూడా 36శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. మృగశిర మూడు నాలుగు పాదాలు వారికి పరమ మిత్ర తారైంది. చాలా చక్కనైనా ఫలితాలు పొందగలుగుతున్నారు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయ్యింది ఫలితాలు చాలా క్లిష్టంగా ఉంటాయి పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వారికి క్షేమ తారైంది మంచి కుటుంబ వ్యవస్థని పొందగలుగుతారు.

కర్కాటక రాశి :-

వీరికి ధన లాభాదులు సుఖ సౌఖ్యాలు మంచి పరిచయాలు ఉన్నత స్థితికి తీసుకుని వెళుతున్నాయి. ఈ వారంలో వీరు మంచి స్థితిని పొందగలుగుతారు. ఇతః పూర్వం వరకు ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయా అన్నంత ఆనందాన్ని పొందుతూ ముందుకు సాగిపోతారు. సప్తమంలో ఉన్న శని ప్రభావం వీరికి విచారాన్ని కలుగజేస్తుంది. గురుడు వీరికి కావల్సినటువంటి మార్గాన్ని సూచిస్తాడు కాబట్టి వీరికి మంచి ధన లాభాదులు, సౌఖ్యం ఈ వారంలో పొందుతారు. ఎంత ఉన్నా మీకు ఏదో ఒక సమయంలో విచారము ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి కూడా 54 శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు క్షేమ తారైంది చాలా ప్రయోజనకరంగా ఉంది. పుష్యమి నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టి ప్రయోజనాలు వ్యతిరిక్తంగా ఉన్నాయి. ఆశ్రేష నక్షత్ర జాతకులకు సంపత్ తారైంది విశేష లాభాన్ని పొందగలుగుతారు.

పరిహారం :- శనివారం నాడు నవగ్రహ దర్శనం చేయండి. ప్రతిరోజూ శివదర్శనం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అమ్మవారికి ఖడ్గమాల, లలితా సహస్ర పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు.

సింహరాశి :-

ఈ రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. పంచమం లో ఉన్న రవి మహా భయాన్ని కలిగిస్తాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చేసే ప్రతి పనిపై ప్రత్యేక దృష్టి పెట్టండి. అనవసరమైన పనులలో జోక్యం చేసుకోకండి.పరధ్యానంగా ఉండడం వల్ల చిన్న అగౌరవాన్ని పొందే అవకాశం ఉంది.అయితే మీరు ఈ వారంలో ఆర్థిక పురోగతిని కూడా పొందుతారు. కేతువులు మీ గౌరవాన్ని భంగం కలిగించే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి మీరు మానసికంగా మరింత సన్నద్ధులు కావాలి. ఒకవేళ పొరపాటు చేస్తే గౌరవ భంగం అనుకోకుండా మీ తప్పును మీరు ఒప్పుకోండి. మానసికంగా రకరకాల ఆలోచనలతో సతమతం అయిపోతారు. వాటినుంచి బయటకు రావాలి అంటే ఇందుకు మీరు భగవంతుని సహాయము తీసుకోవాల్సిందే. ఈ వారం లో మీరు 36 శాతం శుభఫలితాలు పొందుతారు. మఖ నక్షత్ర జాతకులకు జన్మతార అయింది ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. పుబ్బ నక్షత్ర జాతకులకు పరమమిత్రతార అయింది కాబట్టి పర్వాలేదు బాగుంది. ఉత్తర ఒకటో పాదం వారికి మిత్ర తారైంది చాలా అనుకూలమైన వారంగా చెప్పొచ్చు.

పరిహారం :- మంగళవారం నాడు సుబ్రహ్మణ్యుని పూజ చేయండి లేదా ఆంజనేయ స్వామిని దర్శించండి మంచి ఫలితాలు పొందగలుగుతారు. సూర్య నమస్కారం చేయడం ద్వారా శారీరిక, మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు.

కన్యా రాశి :-

ఈ రాశివారికి ఈ వారం ప్రారంభం కొంచెం సాదా సీదాగా వున్నప్పటికీ మధ్యలో చక్కని ధనలాభాదుల్ని పొందగలుగుతారు. చతుర్దంలో ఉన్న రవి అగౌరవాన్ని కలిగిస్తాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చేసే ప్రతి పనిపై ప్రత్యేక దృష్టి పెట్టండి. కుజుడు మీ శరీరానికి కాస్త అనారోగ్యాన్ని కలిగించే సూచనలు ఉన్నాయి కాబట్టీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సంతాన విషయంలో కూడా ప్రతీక్షణము జాగ్రత్త వహించడం చాలా అవసరము. ఈ వారం లో మీరు మీరు సంతోషాన్ని అనుభూతిని పొందగలుగుతారు.మీరు ఎంత తెలివైన వారైతే మీకు అంత శత్రువర్గం పెరుగుతూనే ఉన్నది. కాస్త అప్రమత్తంగా ఉండండి. ఈ వారంలో మీకు 45 శాతం శుభఫలితాలు ఉన్నాయి. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి మిత్రతార అయ్యింది చాలా బాగుంది. హస్త వారికి నైధన తారైంది కాబట్టి అన్ని విషయాల్లోనూ జాగ్రత్త వహించండి. చిత్త ఒకటి రెండు పాదాల వారికి సాధన తారైంది పనులన్నీ చక్కబడతాయి.

పరిహారం :- రవి స్థితి బాగాలేదు కాబట్టి సూర్య నమస్కారాలు చేయండి. ఏకాగ్రత కోసం యోగా సాధన చేయండి. బుధవారం నియమాలు పాటిస్తూ నానబెట్టిన పెసలు బెల్లం వేసి బుధవారంనాడు ఉదయమే ఆవుకు తినిపించండి.

తులా రాశి :-

ఈ రాశివారికి ఈవారం కాస్త ఇబ్బందులు కలుగజేసేది గా కనిపిస్తోంది. వారంలో సంపదలు చేకూరినా అనారోగ్యము కార్య ఆటంకములు చాలా ఎక్కువగా ఉన్నాయి.శని అనారోగ్యాన్ని సూచిస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా మీరు వ్యవహరించడం చాలా అవసరం.చేసే పనులలో విఘ్నాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. పనులలో మీ ప్రమేయం లేకుండా జరిగే చిన్న చిన్న అవకతవకలు మిమ్మల్ని ఎదుటివారు ఎత్తిచూపేలా చేస్తాయి. కాబట్టి మీరు ప్రతి పనిలో చాలా అప్రమత్తంగా ఉండటం మంచిది. అన్నిటినీ అధిగమించే శక్తి మీలో ఉంది అని నమ్మండి. ఈ వారం లో మీకు 36%శుభ ఫలితాలు ఉన్నాయి. చిత్త మూడు నాలుగు పాదాల వారికి సాధన తారైంది పనులన్నీ సమకూరుతాయి. స్వాతి నక్షత్ర జాతకులకు ప్రత్యేక్ తారైంది కాబట్టి పనులు నెరవేరడం కష్టం. విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వారికి క్షేమ తారైంది కాబట్టి ఫలితాలు బాగున్నాయి.

పరిహారం :- శనికి నల్లని నువ్వులు, నువ్వుల నూనె దానం చేయండి. శనీశ్వరుడి దర్శనం చేసుకోండి. సర్ప సూక్త పారాయణ శుభ ఫలితాలు ఇస్తుంది.

వృశ్చిక రాశి :-

ఈ రాశివారికి ఈ వారం ధన లాభం ఉంది. శత్రుపీడ ఉంటుంది కాబట్టి మీరు చాల జాగ్రత్తగా వ్యవహరిస్తే గాని గ్రహస్థితి అనుకూలించదు. ఈసారి గురుడు కూడా మీకు కొంచె కష్టాన్ని కలిగించ బోతున్నాడు. విచారం పడినందువల్ల ప్రయోజనం ఉండదు గానీ ముందు జాగ్రత్త చర్యగా ఉన్నట్లయితే శుభ ఫలితాలను పొందగలుగుతారు. అయితే మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ఆర్థికంగా మీకు మంచి స్థితి ఉండటం మిమ్మల్ని కాస్త తృప్తి పరుస్తుంది.ఎందుకంటే కుజుడు కూడా మీకు ధనప్రాప్తి కలిగించునున్నాడు. ఈవారం మీకు 45శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. విశాఖ నాలుగో పాదం వారికి క్షెమ తారైంది పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. అనూరాధ నక్షత్ర జాతకులకు విపత్తార కాబట్టి ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. జ్యేష్ఠా నక్షత్ర జాతకులకు సంపత్తు తార అయింది కాబట్టి వీరికి ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది.

పరిహారం :- సూర్య నమస్కారాలు చేయండి. బుధవారం నియమాలు పాటిస్తూ నానబెట్టిన పెసలు బెల్లం వేసి బుధవారంనాడు ఉదయమే ఆవుకు తినిపించండి.

ధనూరాశి :-

ఈ రాశివారికి ఈ వారం ధన లాభం ఆనందము, సుఖజీవితం ఇచ్చి మంచి మార్గంలో వీరిని నడిపిస్తుంది.అయితే శత్రువుల బాధ మాత్రం వీరికి తప్పదు. చక్కని భోజన సౌకర్యం ధనలాభం సకల భోగాలు అందబోతున్నాయి.కానీ అపకీర్తి శత్రు వృద్ధి ఇవి మిమ్మల్ని కాస్త వెనక్కి లాగేస్తాయి. ఎవరికీ లేని అనుకూలత రాహు మీకు సుఖ జీవితాన్ని పంచు తున్నాడు. అటువంటి అవకాశం మీకు వస్తుంది కనుక అది వినియోగించుకున్నట్లు అయితే మీరు చాలా విషయాల్లో ఆనందాన్ని పరిపూర్ణంగా పొందడమే కాక ఇతరులను కూడా మాటల ద్వారా చేతల ద్వారా మెప్పించగలరు. శని ప్రభావం చేత మీరు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ మీకు శుక్రుడు ప్రభావము అది ఒక మంచికే మార్చేస్తుంది. ఈవారం మీకు 54 శాతం శుభ ఫలితాలున్నాయి.మూలా నక్షత్ర జాతకులకు జన్మతార అయింది కాబట్టి అనారోగ్య సూచనలున్నాయి. పూర్వాషాఢ వారికి పరమమిత్రతార అయ్యింది అనుకూల పరిస్థితులున్నాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి మిత్ర తారైంది పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి.

పరిహారం: శనికి జపం చేయించడం నల్లనువ్వులు నువ్వుల నూనె దానం చేయడం శనివారం నియమాన్ని పాటించడం శనివారంనాడు తల రుద్దుకొని శని సందర్శనతోపాటు శివ సందర్శన చేసుకోవడం చాలా మంచిది .

మకర రాశి :-

ఈ రాశి వారికి ఈ వారం గురు శుక్రులు అనుకూలంగా ఉన్నారు కనుక మంచి మార్గం లో నడిపిస్తారు. ఈ సమయాన్ని సద్వినియోగ పరుచుకుంటే ఇంకా బాగుంటుంది. కేతువు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు గనుక దైవ పరంగా ఉండే లాభాలు చేకూరుతాయి. అంటే ఏ పని చేసిన దైవాన్ని సంకల్పించి చేస్తే మంచి జరుగుతుంది. . జన్మశని ప్రభావం కూడా మీ పైన ఎక్కువగానే ఉంది. యోగ సాధన మెడిటేషన్ ఏకాగ్రత మీకు చాలా అవసరము. సాధ్యమైనంత వరకు ఏకాంతంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. శత్రువుల వల్ల మీరు ఇబ్బందిని ఎదుర్కొంటారు. గురుడు స్థానచలనాన్నిస్తున్నాడు అది దైవ సంబంధమైనస్థలం ఐతేనే మీరు అంగీకరించండి. లేకపోతే అక్కడికి వెళ్లకండి. ఈ వారం మీకు 36% మాత్రమే శుభఫలితాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి మిత్రతార అయింది కాబట్టి చాలా మంచి ఫలితాలు పొందగలుగుతున్నారు. శ్రవణానక్షత్ర జాతకులు నైధన తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారికి సాధన తారైంది పరిస్థితులనుబట్టి పనులన్నీ నెరవేరతాయి.

పరిహారం :- విష్ణు సహస్రనామ పారాయణ మీకు మనశ్శాంతిని కలుగ జేస్తే గురుచరిత్ర గురు దర్శనం దక్షిణామూర్తి స్తోత్రం ఇవి మీకు కార్య సాధనాన్ని కలిగిస్తాయి.


కుంభ రాశి :-

ఈ రాశి వారు ఈ వారం ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగు వేయాలి. చేసే ఏ పనిలోనూ సంపూర్ణమైన ఫలితాన్ని పొందలేరు సరికదా అది వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. తద్వారా రాజదండన, స్థాన చలనానికి కూడా అవకాశం ఉంది. మీరు ఎప్పుడు దొరుకుతారా మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బందులు కలుగ చేద్దామా అనే స్థితిలో శత్రువులు మీ చుట్టూ పొంచి ఉన్నారు. అంతేకాదు మీరు ఎవరికన్నా మంచి చేద్దామని ప్రయత్నించినప్పటికీ అది మీకు ఏ రకమైన లాభాన్ని ఇవ్వదు. అనవసరంగా మాట పడ్డాము అన్న భావాన్ని వదిలించుకోవాలి అంటే కాస్త అప్రమత్తతో వ్యవహరించటం మంచిది. ధనమైతే వస్తుంది కానీ అంతకంతా ప్రక్కనే ఇబ్బంది కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. కొంత మధ్యమంగా ఈ వారం నడుస్తుంది. ఈ వారం మీకు 36% మాత్రమే శుభఫలితాలు ఉన్నాయి. ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు వారికి సాధన తారైంది పనులన్నీ నెరవేరతాయి. శతభిషం వారికి ప్రత్యక్ తారైంది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు వారికి క్షేమ తార అయింది కాబట్టి కుటుంబపరంగా హాయిగా ఆనందంగా ఉండగలుగుతారు.

పరిహారం :- శనికి నువ్వులు దానం చేయండి శనివారం నాడు ఉపవాసం ఉంటే మీకు ఎక్కువ ఫలితం కలుగుతుంది. ఆ రోజు ఒక పేద బ్రాహ్మణులకు ఏదైనా దానం చేయండి శనిని స్మరించండి శని శ్లోకం చదవండి.

మీన రాశి :-

సంపదలు సౌఖ్యాలు లాభాలు అన్నీ ఇబ్బడి ముబ్బడిగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. గొప్ప ఆనందాన్ని సౌఖ్యాన్ని ధనాన్ని పొందుతారు. కుజ కేతువులు తప్ప ప్రతి ఒక్క గ్రహము మీకు ఈ వారంలో చాలా అనుకూలంగా పనిచేస్తూనే ఉన్నాయి కాబట్టి మీరు పరంపరగా ఒకదాని వెంట ఒకటి అనంతమైన శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారంలో బుధ ప్రభావం చేత ఆనందం అనుభవిస్తారు . ఖర్చులు ఎప్పుడూ ఉన్నవే వాటిని గూర్చి మీరు పెద్దగా పట్టించుకోరు. దానికి తగిన ఆదాయం ఉంది కాబట్టి.మీరు ఎంత తెలివైన వారైతే మీకు అంత శత్రువర్గం పెరుగుతూనే ఉన్నది. కాస్త అప్రమత్తంగా ఉండండి. ఈ వారం మీకు 63% శుభఫలితాలు ఉన్నాయి. పూర్వాభాద్ర నాల్గో పాదం వారికి క్షేమ తారైంది పరిస్థితులు చాలా బాగున్నాయి. ఉత్తరాభాద్ర వారికి మాత్రమే విపత్తు తార అయ్యింది కాబట్టి ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు సంపత్తు తార అయింది కాబట్టి మంచి ఫలితాలు మంచి ఆర్థిక వనరులు సమకూరుతాయి.

పరిహారం :- కుజుడికి మంగళవారం నియమం పాటించండి కాలసర్ప యోగ దోషానికి రాహు కేతువులకు పూజ చేయించండి.




Next Story