వార ఫలాలు 9-05-2021 నుంచి 15-05-2021 వరకు
MAY second week astrology.వార ఫలాలు 9-05-2021 నుంచి 15-05-2021 వరకు
By తోట వంశీ కుమార్ Published on 9 May 2021 7:58 AM ISTమేషం రాశి:
ప్రణాళికతో పనులు రూపొందించుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు చేపట్టిన వ్యవహారాలలో ఆలోచన కార్యరూపం దాలుస్తాయి దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆలయ దర్శనాలు చేస్తారు స్ధిరాస్తి వ్యవహారాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేస్తారు గృహనిర్మాణ ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగ విషయమై అధికారులతో ధైర్యంగా మాట్లాడగలుగుతారు. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూలత పెరుగుతుంది. వారం మధ్యలో స్వల్ప ధనవ్యయ సూచనలు ఉన్నవి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.
పరిహారం : లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
వృషభ రాశి:
ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో సంప్రదింపులు చేస్తారు. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం కొంత ఉపశమనం కలిగిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఉద్యోగ విషయమై మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు ప్రయత్నాలు మందగిస్తాయి కొన్ని రంగాల వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వారం ప్రారంభంలో ఇతరులతో మాట పట్టింపులు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.
పరిహారం : నవగ్రహారాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మిథున రాశి:
చేపట్టినపనులలో ఆటంకాలు కలిగినప్పటికీ దైర్యంగా ముందుకు సాగుతారు. కుటుంబ విషయమై కీలక సమాచారం అందుతుంది.వృత్తి వ్యాపారాలలో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. మాట తీరుతో చుట్టుపక్కలవారిని ఆకట్టుకుంటారు ఆస్తులవ్యవహారాలలో మనస్పర్ధలుతొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పాతవిషయాలు గుర్తుకుతెచ్చుకొని బాధపడతారు అవసరానికి నూతన ఋణాలు చేస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో అనుకోని కలహాలు కలుగుతాయి.
పరిహారం : శివ సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కర్కాటక రాశి:
నూతన కార్యక్రమాలు చేపట్టిన సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తులతో సఖ్యతగా కలుగుతుంది చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు అప్రయత్నంగా పూర్తిఅవుతాయి ఆర్థికంగా వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉన్నది. సోదరులతో కీలక విషయాలను గూర్చి చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు విరాళం అందిస్తారు. సంతాన విద్యా విషయాలలో నూతన కార్యాచరణ రూపొందిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు చిన్న తరహా పరిశ్రమలకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది.వారం చివరన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. అవసరానికి డబ్బు అందక ఇబ్బంది పడతారు
పరిహారం : దుర్గా ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.
సింహ రాశి:
సమస్యలను ధైర్యంగా అధిగమిస్తారు. పాత మిత్రులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ఉన్నత స్థితి కలుగుతుంది భూ సంబంధిత క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలమౌతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాల అందుతాయి. వారాంతమున ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
పరిహారం : సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన శుభఫలితాలను పొందుతారు.
కన్య రాశి:
మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. చాలాకాలంగా వ్యాపారాలలో పడిన కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహనిర్మాణం పనులు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ప్రముఖులతో పరిచయం వలన కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తిఉద్యోగాలలోఊహించని మార్పులు ఉంటాయి కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో ఇంటా బయటా వివాదాలు కలుగుతాయి. ఆర్థిక ఒడిదుడుకులుఉంటాయి.
పరిహారం : మేధోదక్షిణామూర్తిస్తోత్రం పారాయణం చేయటం వలన ఫలితాలు పొందుతారు.
తుల రాశి:
నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు.కుటుంబ వ్యవహారాలలో స్వంత ఆలోచనలను అమలు పరచడం మంచిది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. జీవిత భాగస్వామి నుండి స్ధిరాస్తిలాభం కలుగుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ పడతారు. దీర్ఘ కాలిక ఋణాలు సైతం తీర్చగలుగుతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వాహనం కొనుగోలుచేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగ విషయంలో సమస్యలు తీరి ఊరట చెందుతారు నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు దక్కుతాయి వారం మధ్యలో ధన వ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి.
పరిహారం : అమ్మవారి ప్రార్ధన శుభ ఫలితాలు ఇస్తుంది.
వృశ్చికం రాశి:
వ్యాపార వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచన ఉన్నది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలపై అప్రమత్తంగా వ్యవహరించాలి సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి బంధువుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి విద్యార్థులకు అందిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి. వాహన కొనుగోలు యత్నాలు మందగిస్తాయి దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కొన్ని రంగాలలో వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరన దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ధనలాభ సూచనలు ఉన్నవి.
పరిహారం : విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.
ధను రాశి:
అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి దీర్ఘ కాలిక వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు. కొన్ని విషయాలలో సోదరులతో ఉన్న సమస్యలు సర్దుమణుగుతాయి పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుని ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఆర్థికంగా వాతావరణం సంతృప్తిగా ఉంటుంది.గృహ నిర్మాణ ప్రయత్నాలుసాకారమౌతాయి. వ్యాపారాలుమరింత ఉత్సాహంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వారం చివరన తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. స్వల్ప వివాదాలు ఉంటాయి.
పరిహారం : లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
మకర రాశి:
నూతనోత్సాహంతో అనుకున్న వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి స్ధిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగి ఉపశమనం కలుగుతుంది గృహనిర్మాణ ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి విద్యా రంగం వారికి నూతన అవకాశాలు అందుతాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి శుభకార్యాలకు నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. వృత్తి వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల స్థానచలనంసూచనలు ఉంటాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి వారం ప్రారంభంలో కుటుంబ సంబంధిత ఒడిదుడుకులు ఉంటాయి. ఆరోగ్యవిషయంలో వైద్య సంప్రదింపులకు చేస్తారు.
పరిహారం : సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కుంభ రాశి:
ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు మొండి బకాయిలు వసూలుచేసి దీర్ఘకాలిక రుణాలు చేయగలుగుతారు కుటుంబ విషయంలో ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు. గృహ నిర్మాణ పనులు సజావుగా సాగుతాయి వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని లాభపడతారు అన్ని రంగాలవారికి సమస్యలు తొలగుతాయి. వారాంతమున ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి.
పరిహారం : వెంకటేశ్వర స్వామి ఆరాధన శుభ ఫలితాలను పొందుతారు.
మీన రాశి:
ఆత్మీయులతో వివాదాలు పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలలో భాగస్తులతో సమస్యలు సర్దుమణిగి లాభాలు అందుకుంటారు స్ధిరాస్తి కొనుగోలు విషయంలో పునరాలోచన చేయడం మంచిది విద్యార్థుల పరీక్ష ఫలితాలు సంతోషం కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ఆలోచనలను అమలు చేసి లాభాలు అందుకుంటారు సమాజంలో మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి చిన్న తరహా పరిశ్రమలకు అనుకూలత పెరుగుతుంది. వారం చివరలో ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
పరిహారం : లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.