వార ఫలాలు 02-05-2021 నుండి 08-05-2021 వరకు

May first week astrology.వార ఫలాలు 02-05-2021 నుండి 08-05-2021 వరకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 May 2021 7:29 AM IST
Raasi Palalu

మేష రాశి :

ఆలోచనతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుండి శుభవార్తలు ఆనందం కలిగిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు విస్తరణకు మార్గం సుగమమవుతుంది. ఉద్యోగాలలో సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. అన్ని రంగాల వారికీ నూతన అవకాశములు అందుతాయి. రుణాలు కొంతవరకు తీరుస్తారు వారాంతమున స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూరప్రయాణాలలో జాగ్రత్త అవసరం.

పరిహారం: పంచముఖ హనుమత్ కవచం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి :

వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు అధికమౌతాయి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది క్రమంగా ఊహించని రీతిలో వ్యవహారాలు పూర్తి అవుతాయి. ఇంటాబయటా సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తి కరంగా సాగుతాయి. మిత్రుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి.వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు కలసి వస్తాయి నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు.

పరిహారం:లక్ష్మి నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మిథున రాశి:

ఆప్తుల నుండి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రుల సహాయంతో ధనలాభం కలుగుతుంది. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. ఋణాలు తీరి ఊరట చెందుతారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. చిన్నతరహా పరిశ్రమల వారు సమస్యల నుంచి గట్టెక్కుతారు. వారం మధ్యలో స్ధిరాస్తి వివాదాలుంటాయి. దూర ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేసుకుంటారు.

పరిహారం: నవగ్రహ కవచం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి:

దూరప్రాంతాల వారి నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. గృహములో వివాహ శుభకార్యాల విషయమై నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తులనుంచి విలువైన వస్తువులు బహుమతులుగా అందుకుంటారు. అవసరానికి డబ్బుఅందుతుంది. సంఘంలో సేవకార్యక్రమాలలో పాల్గొంటారు వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల తో ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ప్రోత్సాహకర వాతావరణంఉంటుంది. వ్యాపారాలలోఆటంకాలు తొలగుతాయి ఉద్యోగాలలో తగినగుర్తింపు లభిస్తుంది. వారం చివరన సోదరులతో ఆర్ధికవివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు.

పరిహారం:విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

సింహ రాశి:

చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాలలో సందిగ్దంలో పడవేస్తాయి. ధన పరంగా కటకట ఏర్పడి నూతన రుణాలు చేయవలసి వస్తుంది. బంధువుల మాటలు మానసికంగా భాదిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసిరాక నిరాశ కలుగుతుంది. ముఖ్యమైన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. మిత్రులు కూడా శత్రులవలె ప్రవర్తిస్తారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి మరింత మెరుగుపడుతుంది. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుంది.

పరిహారం: ఆదిత్య హృదయం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కన్య రాశి:

గృహమున బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది సేవ కార్యక్రమాలలో ఉత్సాహంతో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి. సంఘంలో పెద్దలనుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. మీ నిర్ణయాలు అందరు గౌరవిస్తారు. ఉద్యోగమున మీ ప్రతిభ చూపించి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు కొత్త పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

పరిహారం: దుర్గా దేవి దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

తుల రాశి:

కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులు క్రమక్రమంగా తొలగుతాయి. ఆలోచనలు ఆచరణలో పెట్టి మంచి ఫలితాలు రాబడతారు. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం అందుతుంది. భూ సంభందిత క్రయ విక్రయాలులో అవరోధాలు తొలగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలలో ఊహించని విధంగా లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. అన్ని రంగాల వారి శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వారంప్రారంభంలోధనపరంగా ఇబ్బందులుంటాయి కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

పరిహారం: నవగ్రహ అష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి:

ప్రయాణాలలోపరిచయాలు మరింత విస్తృతమౌతాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించి దీర్ఘ కాలిక ఋణాలు తీర్చగలుగుతారు. సన్నిహితుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు శుభ వార్తలు అందుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, మీ కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. ఉద్యోగమున ఆశించిన మార్పులు కలుగుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు అనుకూలత పెరుగుతుంది. వారంచివరిలో పనులు మందకొడిగా సాగుతాయి ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం.

పరిహారం: మేధో దక్షిణా మూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి:

స్ధిరాస్తి వివాదాలకు సంభందించి దూరప్రాంతాల వారి నుండి కీలక సమాచారం సేకరిస్తారు. మిత్రులతో ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు మరింత వేగంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణదాతల ఒత్తిడి నుండి బయట పడతారు. వృత్తి వ్యాపారాలలో సన్నిహితుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉతీర్ణత సాధిస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. వారం మధ్యలోకుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. ధన వ్యవహారాలునిరాశ కలిగిస్తాయి.

పరిహారం: హయగ్రీవ స్వామి ఆరాధనా చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి:

సంఘంలో పరిచయాలు విస్తృతమవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దీర్ఘకాలిక ఋణ సమస్యలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు స్వీకరించి కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భూ క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. జీవిత భాగస్వామి నుండి స్ధిరాస్తి లాభం కలుగుతుంది. గృహ నిర్మాణయత్నాలు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగ అవకాశములు అందుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. పరిహారం:

పరిహారం: రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కుంభ రాశి:

చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. శత్రువులు కూడామిత్రులుగా మారి సహాయ పడతారు. స్థిరాస్తి వివాదాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వాహన యోగంఉన్నది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి ఆలయాలు సందర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యుల సహాయంతో గృహ నిర్మాణాలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాల నూతన ప్రోత్సాహకరంగా సాగి నూతన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కోరుకున్న రీతిలో మార్పులు చోటుచేసుకుంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు అనుకూలత పెరుగుతుంది. వారం ప్రారంభంలో ఆర్థికంగా గందరగోళ పరిస్థితులుంటాయి. ఊహించని సమస్యలు కలుగుతాయి.

పరిహారం: శివాలయం దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మీన రాశి:

నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యక్తుల పరిచయం వలన కొన్ని పనులు పూర్తి చేస్తారు. గృహమున శుభకార్య ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు స్థిరాస్తి అభివృద్ధి చెందుతుంది. కుటుంబ విషయమై తీసుకున్న నిర్ణయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇంటాబయటా ఉత్సహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. వారం మధ్యలో అనారోగ్య సమస్యలుబాధిస్తాయి. మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి.

పరిహారం: గణపతిని ఆరాదించండం వలన శుభ ఫలితాలు పొందుతారు.







Next Story