వార ఫలాలు 14-03-2021 నుండి 20-03-2021 వరకు

March 3rd week astrology.వార ఫలాలు 14-03-2021 నుండి 20-03-2021 వరకు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 March 2021 3:59 AM GMT
March 3rd week astrology

* వారంలో ముఖ్యమైన రోజులు*

14-03-2021, మీన సంక్రమణం.

17-03-2021, చవితి, పుత్ర గణపతి వ్రతం.

మేషం రాశి :

వారం ప్రారంభంలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. క్రమక్రమంగా చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగి ఊరట కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతంచేస్తారు. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి. స్ధిరాస్తి విషయంలో ఏర్పడిన వివాదాలు నుండి బయట పడతారు. కుటుంబ విషయాల గూర్చి పెద్దలతో సంప్రదింపులు చేస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉతీర్ణతసాధిస్తారు. ఉద్యోగాలలోఅదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.

పరిహారం : సుబ్రమణ్య స్వామి ఆరాధన చెయ్యడం వలన అనుకూల ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి:

ఆర్థికంగా అనుకూలత కలిగి రుణాలు తీరుస్తారు. కుటుంబ పెద్దల సహాయంతో కీలకు నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు ఉన్నప్పటికీ అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది నూతన పదవులను పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు శ్రమాధిక్యతతో కొంత లాభం కలుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి.

పరిహారం : శివారాధన చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి :

చేపట్టిన పనులలో జాప్యం కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలికంగా బంధుమిత్రులతో ఉన్న విభేదాలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు సోదరుల సహాయంతో రాజీ చేసుకుంటారు.కుటుంబంలో ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది నిరుద్యోగుల కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానం విద్యా విషయాలలో పై దృష్టి సారిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారపరంగా స్వల్ప లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది కొన్ని రంగాల వారికి కష్టానికి తగిన ఫలితం పొందలేరు వారాంతమున శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

పరిహారం : నవగ్రహారాధన చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటకం రాశి:

నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో శుభకార్య విషయాలను గూర్చి చర్చిస్తారు. సేవా కార్యక్రమాలకు విరాళాలు అందజేస్తారు ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు ఉంటాయి. చాలా కాలంగా పరిష్కారం కాని వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. నూతన పరిచయాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో లాభాలను పొందుతారు. వ్యాపారాల్లో సమస్యలు తొలగుతాయి. ఉద్యోగ విషయాలలో అధికారులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం కలుగుతుంది. వారంతమున ఆరోగ్య విషయాలలో స్వల్ప ఇబ్బందులుఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

పరిహారం : గణపతి ఆరాధన శుభ ఫలితాలను కలుగజేస్తుంది.

సింహం రాశి:

చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. సంతాన విషయాలలో శుభవార్తలు అందుతాయి దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఇతరులకు సహాయంచేస్తారు. శత్రువులతో సఖ్యతగా వ్యవహరించి మిత్రులుగా మారుస్తారు. కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు. సోదరులతో ఆస్థి వివాదాలు తొలగుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులను అధిగమిస్తారు. వృత్తిఉద్యోగాలలో పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. కొన్నిరంగాల వారికి అదనపు బాధ్యతలు ఉంటాయి వారం మధ్యలో కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి.

పరిహారం : ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి :

వారం ప్రారంభంలో ఇంట బయట చికాకులు కలుగుతాయి. అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి రావచ్చు. ఆత్మవిశ్వాసంతో కొన్ని వ్యవహారాలు పూర్తిచేస్తారు ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం అవుతాయి. విద్యార్థులు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. భూ సంభందిత వివాదాలు తెలివి తేటలతో పరిష్కరించుకుంటారు. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబం వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. పరిహారం :

పరిహారం : విష్ణుఆరాధన చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

తుల రాశి :

చాలాకాలంగా పూర్తి కానీ పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య శుభకార్యాలు ప్రస్తావన వస్తుంది. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సేవా కార్యక్రమాలు నిర్వహించి సంఘంలో విశేషమైన ఆదరణ పొందుతారు. వృత్తి వ్యాపారాలలో గతం కంటే మంచి ఫలితాలను పొందుతారు. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఋణ సమస్య నుండి బయట పడతారు. వారం మధ్య నుండి స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

పరిహారం : దుర్గా ఆరాధన ఫలితాలు కలగజేస్తుంది.

వృశ్చికం రాశి:

ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.ఋణ ఒత్తిడి అధికమై నూతన రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టే పనులు సకాలంలో పూర్తి కాక చికాకు పెరుగుతుంది. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఆటంకాలు ఉంటాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి కుటుంబ సంబంధిత వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు శ్రమాధిక్యత కలుగుతుంది. వారం మధ్యలో నుండి శుభవార్తలు అందుతాయి.

పరిహారం : రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి:

సమాజంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి చిన్ననాటి మిత్రులతో చర్చలు అనుకూల ఫలితాలను ఇస్తాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. గృహం కొనుగోలు ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఆధ్యాత్మికసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట మీ మాటకువిలువపెరుగుతుంది. సేవాకార్యక్రమాలను ప్రారంభిస్తారు వ్యాపారపరంగా చిన్నపాటి సమస్యలు విద్యావిషయాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వారాంతమున ఉద్యోగములలో అదనపు బాధ్యతల వలన విసుగు కలుగుతుంది.

పరిహారం : రాజరాజేశ్వరీ దేవి ఆరాధన శుభ ఫలితాలను కలుగజేస్తుంది.

మకర రాశి:

చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఎదురవుతాయి స్థిరాస్తి విషయాలు సోదరులతో వివాదాలు తప్పవు. స్థిరమైన నిర్ణయాలు చేయకపోవడం వలన ఆర్థికంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ఎంత శ్రమపడినా ఫలితం కనిపించదు ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో దైవదర్శనం చేసుకుంటారు. ఇతరుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఇంటాబయటా ప్రతికూలత పెరుగుతుంది వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. వారం ప్రారంభం ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

పరిహారం : గణపతి ఆరాధన శుభ ఫలితాలను కలిగిస్తుంది.

కుంభ రాశి:

విద్యార్థులకు శ్రమాధిక్యం పెరుగుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురై నిరాశ కలిగిస్తాయి. ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్పులు చేసుకుంటారు. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నూతన ఋణయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయాలలో మరింత శ్రద్ధ వహించాలి. నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి చేసే ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో అనిశ్చిత కలుగుతుంది. కొన్ని రంగాలవారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యన స్వల్ప ధనలాభం కలుగుతుంది సంతానం నుండి శుభవార్తలు అందుతాయి.

పరిహారం : మేధా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు

మీన రాశి :

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు. శత్రు పరమైన సమస్యలను ధైర్యంగాఎదుర్కొని ముందుకు సాగుతారు.కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శనం చేసుకుంటారు.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.స్ధిరాస్తి క్రయవిక్రయాలు లాభిస్తాయి.వ్యాపారాలలో అనుకూలత పెరుగుతుంది.ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.శ్రమకు తగిన ఫలితం పొందుతారు వారం ప్రారంభమున స్వల్ప ధనవ్యయ సూచనలు ఉన్నవి సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి.

పరిహారం : లక్ష్మీ నరసింహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు


Next Story