దిన ఫలితాలు : ఆ రాశి వారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోక‌పోవ‌డ‌మే మంచిది

ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోక‌పోవ‌డ‌మే

By జ్యోత్స్న  Published on  30 Nov 2024 12:45 AM GMT
దిన ఫలితాలు : ఆ రాశి వారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోక‌పోవ‌డ‌మే మంచిది

మేషం:

చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తిచేస్తారు. సంతానం కొన్ని విషయాలలో మీతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలొ వాహన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు తప్పవు. పాత ఋణముల ఒత్తిడి పెరుగుతుంది.

వృషభం:

ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు పనిచేయవు. కుటుంబ సభ్యులతి అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానిస్తాయి. వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తాయి.

మిధునం:

ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంత వరకు బయటపడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు పొందుతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల వాతావరణం ఉంటుంది.

కర్కాటకం:

కొన్ని విషయాలలో అందరితో సమస్యలు కలుగుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన వార్త కొంత ఊరట కలిగిస్తుంది. ఆదాయం ఆశించిన విధంగా ఉండదు. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులుంటాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.

సింహం:

బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. వ్యాపారమున స్నేహితుల నుంచి పెట్టుబడులు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశములు అందుతాయి.

కన్య:

చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. ధన వ్యవహారాలలో లోటుపాట్లు తప్పవు. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిద

తుల:

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధన సహాయం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో మిత్రుల సలహాలు తీసుకోవడం మంచిది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉన్నతఅవకాశములు లభిస్తాయి.

వృశ్చికం:

దూర ప్రాంతాల ఆప్తుల నుంచి కీలక నమాచారం అందుతుంది. చేపట్టిన కార్యక్రమాలులో విజయవంతంగా పూర్తిచేస్తారు. స్ధిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గృహమున సంతోషంగా గడుపుతారు. ఉద్యోగమున ఉన్నతాధికారుల అనుగ్రహం కలుగుతుంది.

ధనస్సు:

దైవ అనుగ్రహంతో ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలొ నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలలో నిర్వహిస్తారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

మకరం:

కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. కుటుంబ వాతావరణం మరింత చికాకు పరుస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు.

కుంభం:

ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘ కాలిక రుణాల తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు వేగవంతం చేస్తారు. వ్యాపారము సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు.

మీనం:

ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారములు అందుతాయి. ఇంట, బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో మరింత జాగ్రత్త వహించాలి.

Next Story