శుక్రవారం నాడు ఈ పనులు చేస్తున్నారా?
లక్ష్మీదేవీకి ప్రీతికరమైన శుక్రవారం రోజున చేసే కొన్ని పనులు దారిద్య్రానికి దారి తీస్తాయని పండితులు చెబుతున్నారు.
By - అంజి |
శుక్రవారం నాడు ఈ పనులు చేస్తున్నారా?
లక్ష్మీదేవీకి ప్రీతికరమైన శుక్రవారం రోజున చేసే కొన్ని పనులు దారిద్య్రానికి దారి తీస్తాయని పండితులు చెబుతున్నారు. 'దేవుడి పటాలు శుభ్రం చేయకూడదు. పాత్ర విగ్రహాలు బయట పడేయకూడదు. అప్పు ఇవ్వడం, తీసుకోవడం చేయవద్దు. జుట్టు, గోళ్లు కత్తిరించుకోకూడదు. ఇంటిని శుభ్రంగా ఉంచితే లక్ష్మీ కటాక్షంతో సిరి సంపదలు కలుగుతాయి' అని సూచిస్తున్నారు.
శుక్రవారం నాడు ఎవరి నుంచి అప్పు తీసుకోవద్దు, అలాగే ఇవ్వకూడదు కూడా. ఒకవేళ అప్పు తీసుకున్నా, ఇచ్చినా అది మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శుక్రవారం నాడు ఎవరైనా మిమ్మల్ని సహాయం కోరితే కచ్చితంగా అతనికి సహాయం చేయాలి. అయితే అది ఆర్థి సహాయం రూపంలో ఉండాలి కాని అప్పు రూపంలో ఉండకూడదు. ఈ రోజు అప్పు ఇవ్వడం వల్ల మీ ఆర్థిక పరిస్థితిని బలహీన పరుస్తుంది. శుక్రవారం నాడు మర్చిపోయి కూడా అమ్మాయిలను అవమానించకూడదు. అమ్మాయిలను మందలించడం లేదా తిట్టడం వంటి పనులు అస్సలు చేయకూడదు.
ఇంటి లక్ష్మీ దేవితో సరిసమానమైన మహిళలను కించపరచడం.. ఆ ఇంటికి ఎంత మాత్రం మంచిది కాదు. అలాగే ఈ రోజు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవ్వరికీ ఇవ్వకూడదు. అయితే మీరు మీ ఇంటికి లక్ష్మీ దేవి విగ్రహాన్ని తీసుకురావచ్చు. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో సంపదతో పాటు శ్రేయస్సు కూడా పెరుగుతుంది. శాస్త్రాల ప్రకారం సాయంత్రం కొంత సమయం ఇంటి ప్రధాన తలుపులు తెరిచి ఉండాలి. ఎందుకంటే లక్ష్మీదేవి సాయంత్రం సమయంలో సందర్శిస్తుందని నమ్ముతారు. ఫలితంగా ఇంట్లో లక్ష్మీదేవి రావడమే కాకుండా సంతోషాన్ని, సంపదను ప్రసాదిస్తుంది.