దిన ఫలాలు.. నేడు ఆ రాశి వారికి అన్నీ మంచి శకునాలే.!
Daily horoscope for 31-10-2022. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి.
By జ్యోత్స్న Published on 31 Oct 2022 6:30 AM ISTమేషం: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమునశుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభం: జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.
మిధునం: నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
కర్కాటకం: సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
సింహం: చిన్న నాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.
కన్య: కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.
తుల: వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. బంధుమిత్రుల మాటలు మానసిక చికాకు కలిగిస్తాయి. ఉద్యోగస్తులు కష్టానికి తగిన ఫలితం లభించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. సోదరులతో స్థిరాస్థి వివాదాలు కలుగుతాయి.
వృశ్చికం: సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సహాయం అందుతుంది. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
ధనస్సు: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు ఊహించని స్థాన చలనాల కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు.
మకరం: ఉద్యోగస్తులకు అదనపు పనిభారం నుండి ఉపశమనం పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుంభం: వృత్తి వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొన్ని పనులలో తొందరపాటు నిర్ణయాలు చేసిన నష్టపడతారు ఉద్యోగ విషయమై అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది అవసరానికి చేతిలో తగినంత డబ్బు నిల్వ ఉండదు.
మీనం: వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రశంసలు అందుకుంటారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుతాయి.