ఉద్యోగ, వ్యాపారాల్లో అప్రమత్తత అవసరం
Daily horoscope for 31-01-2023. వ్యాపారాలలో ఒడిదుడుకులు.వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.
By జ్యోత్స్న Published on 31 Jan 2023 1:51 AM GMTమేషం : వ్యాపారాలలో ఒడిదుడుకులు.వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. ఉద్యోగులకు మార్పులు.శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు.
వృషభం: ఆకస్మిక ధనలాభం. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సేవలకు గుర్తింపు.ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. కొత్త పనులకు శ్రీకారం.
మిధునం: కొత్త రుణాలు చేస్తారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమ తప్పదు. ఉద్యోగులకు చికాకులు.బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్యభంగం.
కర్కాటకం: ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విందువినోదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు సకాలంలో పూర్తి.
సింహం : వ్యాపారాలు విస్తరిస్తారు.పనులు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థిక ప్రగతి. రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి.వస్తు, వస్త్రలాభాలు. దైవదర్శనాలు. నిరుద్యోగులకు శుభవార్తలు.
కన్య : ఆస్తి తగాదాలు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు బదిలీలు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. అనారోగ్యం.
తుల : పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణయత్నాలు. ఇంటాబయట చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు. అనారోగ్యం.
వృశ్చికం : వ్యాపార విస్తరణయత్నాలు .శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం.
ధనస్సు: ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. ఇంటాబయట ప్రోత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. విందువినోదాలు. శుభకార్యాలలో పాల్గొంటారు.
మకరం : వ్యాపారాలు మందగిస్తాయి. బంధువర్గంతో తగాదాలు. ఆలయ దర్శనాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.వృథా ఖర్చులు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.
కుంభం: వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.వ్యయప్రయాసలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఉద్యోగులకు చిక్కులు.శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు. అనారోగ్యం. దైవదర్శనాలు.
మీనం: వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి.వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు.ఇంటర్వ్యూలు అందుతాయి. ఆస్తిలాభం.