బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Daily Horoscope for 28-12-2022.వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది
By జ్యోత్స్న Published on 28 Dec 2022 1:49 AM GMTమేషం: వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.
వృషభం: విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. వివాదాలకు సంభందించి విలువైన సమాచారం అందుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. విందువినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.
మిధునం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో అకారణ మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు తప్పవు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబసభ్యుల నుంచి ధనపరమైన ఒత్తిడి తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
కర్కాటకం: వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేదాటుతాయి. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఇంటాబయట బాధ్యతలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.
సింహం : పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో కీలక వ్యవహారాలలో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
కన్య: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగ యత్నాలు సానుకూలమౌతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది.
తుల: వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు.
వృశ్చికం: చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. బంధువుల మాటలు మానసికంగా బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు అధికమౌతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి.
ధనస్సు: కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహనయోగం ఉన్నది. పాతబాకీలు వసూలవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
మకరం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. సంతాన విద్యా, ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుంభం: ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో సమస్యలు అదిగమిస్తారు ఆర్థిక అనుకూలత కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్ట సుఖాలు పంచుకుంటారు. బంధు వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
మీనం: దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారమున భాగస్థులతో వివాదాలు కలుగుతాయి, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. కొన్ని పనులలో శ్రమ పడినా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.