ఈ రాశికి చెందిన‌ నిరుద్యోగులు శుభ‌వార్త‌ వింటారు

ఉద్యోగమున అధికారులతో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి.

By జ్యోత్స్న  Published on  28 Feb 2023 1:49 AM GMT
ఈ రాశికి చెందిన‌ నిరుద్యోగులు శుభ‌వార్త‌ వింటారు

ఈ రాశికి చెందిన‌ నిరుద్యోగులు శుభ‌వార్త‌ వింటారు

మేషం : ఉద్యోగమున అధికారులతో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభం : సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నవి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిధునం : బంధువుల నుంచి ఒక వ్యవహారంలో ఒత్తిడి తప్పదు. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కర్కాటకం : గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఆనందాన్నిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

సింహం : గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పైచేయి సాధిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగమున మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

కన్య : వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూలం వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి.

తుల : సోదరులతో మాటపట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు భాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో కాస్త నిరుత్సాహం తప్పదు. కుటుంబ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి.

వృశ్చికం : కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. పాతబాకీలు వసూలవుతాయి. పనులు వేగవంతం చేస్తారు.

ధనస్సు : నూతన వాహన యోగమున్నది. సన్నిహితులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.

మకరం : వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి. మీ ఆలోచనలు ఇతరులకు నచ్చవు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో సమస్యలు తప్పవు. నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధువర్గంతో మాటపట్టింపులుంటాయి.

కుంభం : వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో రావలిసిన పదవులు చేజారుతాయి. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి.

మీనం : స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

Next Story