వీరికి నేడు ఆర్థికంగా లాభదాయకం
Daily horoscope for 27-12-2022.విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.
By జ్యోత్స్న Published on 27 Dec 2022 1:51 AM GMTమేషం: విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధనసాయం అందుతుంది. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారములో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.
వృషభం: ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు.
మిధునం: ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి.
కర్కాటకం: చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. వ్యాపారమునకు సకాలంలో పెట్టుబడులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి.
సింహం: సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహన లాభాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపార వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది.
కన్య: వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
తుల: ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబసభ్యులతో వివాదాలు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. ఇంటాబయట చికాకులు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.
వృశ్చికం: ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఇంటాబయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు.
ధనస్సు: భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు.
మకరం: ఆరోగ్యం మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి.
కుంభం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరణకు తీసుకున్న నిర్ణయాలు కలసి వస్తాయి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి.
మీనం: చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. దాయదులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.