ఈ రాశి వారు ప్ర‌యాణాలు వాయిదా వేసుకోవ‌డం మంచిది

Daily Horoscope for 27-01-2023.దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jan 2023 1:47 AM GMT
ఈ రాశి వారు ప్ర‌యాణాలు వాయిదా వేసుకోవ‌డం మంచిది

మేషం : దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి విందు, వినోదాలలో పాల్గొంటారు. పొటీపరీక్షలో విజయం సాధిస్తారు.

వృషభం : వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ముఖ్య నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు రావడం మంచిది. ధన పరంగా ఒడిదుడుకులు తప్పవు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. గృహ నిర్మాణ ఆలోచనలు మందకొడిగా సాగుతాయి.

మిధునం :వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సన్నిహితుల నుండి కొత్త విషయాలను తెలుసుకొంటారు. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కర్కాటకం : ఉద్యోగులకు నూతన హోదాలు దక్కుతాయి. సంతానం వివాహ యత్నాలు సాగిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.

సింహం : వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి.

కన్య : ఉద్యోగులకు అదననపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తిచేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

తుల : సంతాన ఉద్యోగ వివాహయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. జీవిత బాగస్వామి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలల్లో విజయం సాధిస్తారు. దిర్ఘకాలిక బుణాలు తీరి ఊరట చెందుతారు.

వృశ్చికం : దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలంగా సాగుతుంది. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలలో తొందరపాటు మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.

ధనస్సు : నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. నూతన మిత్రులు పరిచయాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాలలో అరుదైన లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

మకరం : మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగిపోతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో తొందరపాటు పనిచేయదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు.

కుంభం : స్థిరాస్థి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రముఖుల సహాయంతో నూతన కార్యమాలకు శ్రీకారం చుడతారు.

మీనం : చేపట్టిన పనులలో శ్రమఅధికంగా ఉంటుంది. భూవివాదాలు తీరి లబ్ది పొందుతారు. క్రయవిక్రయాలలో స్వల్పలాభాలు అందుకుంటారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కారించుకొంటారు.

Next Story