నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు
తమ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం
By జ్యోత్స్న Published on 24 Feb 2023 7:28 AM ISTనిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు
మేషం : కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ అధికం అవుతుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి బంధుమిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి.
వృషభం : నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్నేహితుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిధునం : సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
కర్కాటకం : దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు అధికమవుతాయి. దీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.
సింహం : పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగయత్నాలు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప చికాకులు తప్పవు. కుటుంబ సభ్యుల నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. నూతన రుణాలు చేస్తారు.
కన్య : ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
తుల : విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు.
వృశ్చికం : వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ధన పరంగా కొంత ఇబ్బందులు తప్పవు నూతన ఋణప్రయత్నాలు కలిసిరావు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనస్సు : రాజకీయ ప్రముఖుల తో చర్చలు సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది.
మకరం : సంతాన వివాహ విషయమై గృహమున చర్చలు జరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. రాజకీయ సంబంధిత సభ సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
కుంభం : దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో గాని పూర్తికావు. ఉద్యోగయత్నాలు వాయిదా వేస్తారు. సోదరుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.
మీనం: సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో పాల్గొని విజయం సాధిస్తారు.