నేడు ఈ రాశివారికి సోదరుల నుంచి ధన సహాయం

Daily Horoscope for 23-01-2023. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వ్యక్తులు పరిచయాలు

By జ్యోత్స్న  Published on  23 Jan 2023 1:33 AM GMT
నేడు ఈ రాశివారికి సోదరుల నుంచి ధన సహాయం

మేషం: చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. దీర్ఘ కాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు వేగవంతం చేస్తారు. ఇంటా బయట బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

వృషభం: చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. సోదరుల నుంచి ధన సహాయం పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిధునం: దూర ప్రాంతాల నుంచి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. బందు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. గృహనిర్మాణ ఆలోచనలు మందకోడిగా సాగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి.

కర్కాటకం: ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరస్తి వివాదాలు తొలగి లబ్ది పొందుతారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమౌతాయి. చేపట్టిన పనులలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహం: సోదరులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

కన్య: ఉద్యోగాలలో స్వల్ప లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఊహించని విధంగా ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

తుల: విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

వృశ్చికం: ఉద్యోగాలలో స్థానచలనాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

ధనస్సు: భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాట పడుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ఉద్యోగమున అధికారులతో సమస్యలు రాజి చేసుకుంటారు. సోదరులతో భూవివాదలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులతో పాత విషయాలు చర్చిస్తారు.

మకరం: నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్థులకు జీతభత్యాల విషయంలో శుభ వార్తలు అందుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

కుంభం: అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. బందు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఋణ దాతల ఒత్తిడి తొలగుతుంది.

మీనం: సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వ్యక్తులు పరిచయాలు సంతోషనిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.

Next Story