వీరికి ఆదాయం బాగుంటుంది

Daily horoscope for 21-12-2022.కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలు అంతగా కలిసి రావు.

By జ్యోత్స్న  Published on  21 Dec 2022 1:48 AM GMT
వీరికి ఆదాయం బాగుంటుంది

మేషం : కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలు అంతగా కలిసి రావు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

వృషభం: వ్యాపారాలలో ఆశించిన పురోభివృద్ధి కలుగుతుంది. చేపట్టిన పనులలోశ్రమ ఫలిస్తుంది. వస్త్ర ఆభరణాలుకొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయట పడగలుగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

మిధునం: స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.విందువినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

కర్కాటకం: వ్యాపారపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు నష్టాలను మిగులుస్తాయి.దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు పెరుగుతాయి.వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి.

సింహం: చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు అధికమౌతాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కన్య:కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వివాదాలకు సంబంధించి కీలక సమాచారం సేకరిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.ప్రముఖులతో పరిచయాలు అవుతాయి. సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది.

తుల:వృత్తి వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి.

వృశ్చికం: స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

ధనస్సు: చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయప్రయాసలతో కాని పూర్తి కావు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి. ఆధ్యాత్మిక చింతన అవుతుంది.

మకరం: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమవుతాయి.సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

కుంభం: ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందగలుగుతారు.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు ఉంటాయి. నూతన వాహనయోగం ఉన్నది.

మీనం: వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు ఎదురవుతాయి నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

Next Story