నేటి దినఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే?
Daily Horoscope for 21-11-2022. స్థిరస్తి వ్యవహారంలో వివాదాలు సర్దుమణుగుతాయి. వ్యాపారాలు మరింత నిదానంగా సాగుతాయి.
By జ్యోత్స్న Published on 21 Nov 2022 1:06 AM GMTమేషం: స్థిరస్తి వ్యవహారంలో వివాదాలు సర్దుమణుగుతాయి. వ్యాపారాలు మరింత నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృషభం: దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారమున కొన్ని నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు. అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. సోదరులతో భూవివాదాలు కలుగుతాయి.
మిధునం: సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి.
కర్కాటకం : దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. సన్నిహితుల నుండి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.
సింహం: కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున అధికారులతో వివాదాలు రాజీ అవుతాయి. వ్యాపారాలు లాభల బాటలో పయనిస్తాయి.
కన్య: ఆత్మీయులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగస్తుల పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు.
తుల: వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. నిరుద్యోగ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం అందదు. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు.
వృశ్చికం : కొన్ని విషయాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు శ్రమాదిక్యతతో కానీ పూర్తి కావు. నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. భూ సంబంధిత వివాదాలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.
ధనస్సు: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
మకరం: భూ సంభందిత క్రయ విక్రయాల లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు, ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. రాజకీయ వర్గాల ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
కుంభం: ప్రయాణాలలో మార్గవరోదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగ వాతావరణం చికాకు కలిగిస్తుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.
మీనం: చేపట్టిన పనులులో వ్యయప్రయాసలు అధికమౌతాయి. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగములు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.