వీరికి ఇంటా బ‌య‌టా ఒత్తిడే

Daily horoscope for 21-01-2023.భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jan 2023 7:21 AM IST
వీరికి ఇంటా బ‌య‌టా ఒత్తిడే

మేషం: భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాట పడతాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. దూరప్రాంతాల బంధువులు నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

వృషభం:బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా రాణించి విశేషమైన లాభాలు పొందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

మిధునం: ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఏర్పడిన అరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు మాత్రం పెట్టుబడులు అందుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకొంటారు.

సింహం:నిరుద్యోగుల ప్రయత్నాలు చాలా కష్టం మీద ఫలిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు.

కన్య: ఉద్యోగాలలో తనకు బాధ్యతల నుండి ఉపశమనం కలుగుతుంది. సంతానం విద్య ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగిపోతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దూరపు బంధువుల మిత్రుల నుండి అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది.

తుల: ఉద్యోగాలలో ఏర్పడిన చికాకులు అధికారుల సహాయంతో రాజి చేసుకుంటారు. గృహ నిర్మాణ విషయమై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొంటారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

వృశ్చికం: భూ క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగుతాయి. బంధువర్గం నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు ఫలిస్తాయి.

ధనస్సు:వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాల విషయమై శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.

మకరం: ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు.

కుంభం: నూతన వ్యాపారాలు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. రుణదాతల నుండి ఒత్తిడి తొలగుతుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకొంటారు.

మీనం: ఉద్యోగాలలో ఎదురైన సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ధనాదాయం మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్థి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకొంటారు. జీవిత భాగస్వామితో విహార యాత్రలో పాల్గొంటారు.

Next Story