నిరుద్యోగులు శుభ‌వార్త వింటారు

Daily horoscope for 20-12-2022. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

By జ్యోత్స్న  Published on  20 Dec 2022 1:56 AM GMT
నిరుద్యోగులు శుభ‌వార్త వింటారు

మేషం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి. నిరుద్యోగులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు ఉద్యోగులకు జీతాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

వృషభం: వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు , ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహంతో సమస్యల నుండి బయటపడతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు.రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

మిధునం: బంధుమిత్రులతో మాటపట్టింపులు తప్పవు.చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.

కర్కాటకం: ప్రయాణాల్లో మార్గ అవరోధాలు ఉంటాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కొందరు ప్రవర్తన వలన మానసిక చికాకులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమతో కానీ పనులు పూర్తి కావు.

సింహం: ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అవుతుంది.సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. మిత్రులతో విందువినోద ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది.

కన్య: ముఖ్యమైన నిర్ణయాలలో మార్పులు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది వ్యాపార , ఉద్యోగాలలో ఒత్తిడి తప్పదు. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఇంటాబయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు.

తుల: సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు అనుకున్న వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విలువైన వస్తు వాహన లాభాలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అవుతాయి.కీలక సమయంలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.

వృశ్చికం: చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. సోదరులతో స్థిరాస్థి వివాదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగాలలో రావలసిన అటువంటి అవకాశములు చివరి నిమిషంలో చేరుతాయి బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

ధనస్సు: ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారునూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

మకరం: ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది.చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

కుంభం: ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార,ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

మీనం: ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. బంధుమిత్రులు కొన్ని విషయాలను మీతో విభేదిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు.

Next Story