దిన ఫలాలు.. నేడు ఈ రాశి వారికి ఉన్నత అవకాశాలు

Daily Horoscope for 19-12-2022 . ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి.

By జ్యోత్స్న  Published on  19 Dec 2022 1:23 AM GMT
దిన ఫలాలు.. నేడు ఈ రాశి వారికి ఉన్నత అవకాశాలు

మేషం: మేషం: వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో పరిచయాలుపెరుగుతాయి. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో దైవదర్శనం చేసుకుంటారు ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు.చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభం: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవమర్యాదలకు లోటుండదు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు దైవదర్శనాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.

మిధునం: ఉద్యోగ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు మందకొడిగాసాగుతాయి, అన్ని రంగాల వారికి ఒడిదుడుకులు తప్పవు. రుణ ఒత్తిడి అధికమవుతుంది ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.

కర్కాటకం: నూతన రుణయత్నాలు అనుకూలించవు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులుచికాకు పరుస్తాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. కొన్ని వ్యవహారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమవుతారు వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

సింహం: ఉద్యోగాలు మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.నూతన వ్యక్తుల పరిచయం ఆనందం కలిగిస్తుంది.కీలక సమయంలో సోదరుల నుండి సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి , నిరుద్యోగులకుచాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు లభిస్తాయి అన్ని దేశాల నుండి శుభవార్తలు అందుతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

కన్య: వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి.ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థికంగా కొంత చికాకులు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

తుల: ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రులకలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి , అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి.

వృశ్చికం: వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి. బంధు వర్గం వారితో విభేదాలు తప్పవు. వృధా ఖర్చులు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆలోచనలు కలసిరావు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

ధనస్సు: గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, వృత్తి ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహం కలుగుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది.

మకరం: ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలను దాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు.

కుంభం: నిరుద్యోగుల యత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యటం మంచిది.

మీనం: వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక ఈ విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. ఉద్యోగస్తులు ఒక వ్యవహారంలో అధికారుల నుండి సమస్యలు ఎదుర్కొంటారు చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి.

Next Story