ఈ రాశుల వారు ఈ రోజు జాగ్ర‌త్త‌గా ఉండాలి

Daily Horoscope for 17-12-2022.వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు.

By జ్యోత్స్న  Published on  17 Dec 2022 1:48 AM GMT
ఈ రాశుల వారు ఈ రోజు జాగ్ర‌త్త‌గా ఉండాలి

మేషం : వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. కీలక సమయంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. చాలకాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.

వృషభం : ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఇంటా బయట బాధ్యతలు ఒత్తిడికి గురిచేస్తాయి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు.

మిధునం : వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు తప్పవు. ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. దైవదర్శనం చేసుకుంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారమున సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.

కర్కాటకం : వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో జీతభత్యాలు విషయంలో అనుకూలత కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది.

సింహం : భూ సంబంధిత వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. మానసిక చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ నిర్వహణలో లోపం వలన అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.

కన్య : చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక వృద్ధి,పాత ఋణాలు తీర్చగలుగుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు తగిన అవకాశాలు లభిస్తాయి.

తుల : ఉద్యోగమున అధికారులతో వాదాలకు వెళ్లకపోవడం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు.

వృశ్చికం : చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

ధనస్సు : సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

మకరం : వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికామౌతుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన ఋణ యత్నాలు కలసిరావు ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు.

కుంభం : ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలుతో కాని పూర్తికావు. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

మీనం : వ్యాపారపరంగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశములు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు తరువాత కాలానికి ఉపయోగపడతాయి.

Next Story