శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Daily horoscope for 17-02-2023.విద్యార్థుల కృషి ఫలించదు. గృహమున చికాకు తప్పవు.
By జ్యోత్స్న Published on 17 Feb 2023 7:17 AM ISTమేషం : విద్యార్థుల కృషి ఫలించదు. గృహమున చికాకు తప్పవు. ఆదాయం తగ్గి నూతన ఋణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం తప్పదు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. బంధువులతో వివాదములకు దూరంగా ఉండటం మంచిది.
వృషభం : చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు.
మిధునం : ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో మీ ప్రతిభ చాటుకుంటారు. మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు.
కర్కాటకం : బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.
సింహం :ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా పడుతాయి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. బంధు, మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
కన్య : ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు తప్పవు.
తుల : వ్యాపార నిర్వహణలో లోపాలు అదిగమిస్తారు. సోదరుల నుండి శుభ వర్తమానాలు అందుతాయి. నిరుద్యోగుల అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగమున ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. ఇంటా బయట చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.
వృశ్చికం : వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. నిరుద్యోగుల శ్రమ ఫలించదు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దూరప్రయాణాలు వలన శ్రమధిక్యత పెరుగుతుంది.
ధనస్సు : ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన విషయాలు పై దృష్టి సారిస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
మకరం : సోదరులతో స్థిరస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులలో కష్టపడ్డా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
కుంభం : గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన పనులకు శ్రీకారం చూడతారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. దీర్ఘ కాలిక సమస్యలు కొన్ని పరిష్కారమౌతాయి.
మీనం : స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. నిరుద్యోగులకు చాలకాలంగా వేచిచూస్తున్న అవకాశములు అందుతాయి.