ఉన్న‌తాధికారుల‌తో ఈ రాశివారు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి

Daily horoscope for 17-01-2023.వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యాలి.

By జ్యోత్స్న  Published on  17 Jan 2023 1:39 AM GMT
ఉన్న‌తాధికారుల‌తో ఈ రాశివారు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి

మేషం : వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చిన్నపాటి వివాదాలుంటాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృషభం: వ్యాపారాలు విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విశేషాలు తెలుస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

మిధునం: గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. బందుమిత్రులతో సక్యతగా వ్యవహారిస్తారు.

కర్కాటకం: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి దైవచింతన కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహ పరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

సింహం: వ్యాపారాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య : వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. సన్నిహితులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

తుల: ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. పాత మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులుంటాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. రుణయత్నాలు వేగవంతం చేస్తారు.

వృశ్చికం: చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు నుండి బయటపడతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.

ధనస్సు: వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. పాత ఋణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.

మకరం: నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఋణగ్రస్తుల నుండి రావలసిన సొమ్ము వసూలవుతుంది.

కుంభం: చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.

మీనం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి.

Next Story