దిన ఫలాలు: నేడు ఈ రాశి వారింట శుభకార్యాలు
Daily Horoscope for 16-01-2023. సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
By జ్యోత్స్న Published on 16 Jan 2023 1:30 AM GMTమేషం: సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అధికారులతో చర్చలకు అనుకూల సమయం. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.
వృషభం: సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.
మిధునం: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
కర్కాటకం: కొన్ని వ్యవహారాలలో శిరో బాధలు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి.
సింహం: గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉన్నది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.
కన్య: నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కావు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోక నష్టాలు ఎదుర్కొంటారు.
తుల: వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కీలక సమయంలో సన్నిహితులు సాయం అందిస్తారు.
వృశ్చికం: కుటుంబ సభ్యులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయట చికాకులు అధికమవుతాయి. స్వంత ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వ్యాపారాలలో భాగస్వాములతో బేధాభిప్రాయాలు కలుగుతాయి.
ధనస్సు: ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంఘంలో మరింత గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభాలను అందుకుంటారు. నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.
మకరం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగమున మీప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధు మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు.
కుంభం: దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు.
మీనం: ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలు తప్పవు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఎంతగా కష్టపడ్డా ఫలితం ఉండదు.