నేడు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో స్వల్పలాభాలు
Daily horoscope for 14-11-2022. మేషం: కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా సమస్యలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప
By జ్యోత్స్న Published on 14 Nov 2022 1:03 AM GMTమేషం: కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా సమస్యలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా స్థిరత్వం ఉండదు.
వృషభం: సోదరులతో స్థిరస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో భాగస్థులతో సమస్యలను సర్దుబాటు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.
మిధునం: అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో తొందరపాటు మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో స్వల్పలాభాలు అందుకుంటారు.
కర్కాటకం: దూర ప్రయాణాలు కలసివస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.
సింహం: వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. ఆర్థిక పరంగా ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబసభ్యుల తో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్య: చేపట్టిన పనులలో జాప్యం జరిగిన సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.
తుల: ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.
వృశ్చికం: వృత్తి, ఉద్యోగములు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. మంచిది ధనపరంగా ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం. పనులు సకాలంలో పూర్తి కావు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ధనస్సు: వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అకారణంగా ఇతరులతో వివాదాలు కలుగుతాయి. ఋణ సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. సంతాన విద్యా విషయంలో దృష్టి సారించడం మంచిది. చేపట్టిన పనులలో ఆటంకాలుంటాయి.
మకరం: దీర్ఘ కాలిక ఋణాల వ్యవహారాలలో సన్నిహితుల సహాయం అందుతుంది. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సామజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తివ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగమున అదనపు పనిభారం నుండి ఉపశమనం పొందుతారు.
కుంభం: ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. విద్యార్థులు పరీక్షలలో ఉతీర్ణత సాధిస్తారు. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు సద్దుమణుగుతాయి.
మీనం: ఉద్యోగాలలో అధికారులతో స్వల్ప ఇబ్బందులుంటాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపార పరంగా ఒత్తిడి తప్పదు. నూతన ఋణ యత్నాలు చేస్తారు. కుటుంబ పెద్దల సలహాతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు కొంత అనుకూలంగా సాగుతాయి.