వీరికి ఆకస్మిక ధ‌న‌లాభ సూచ‌న‌లు

Daily horoscope for 13-02-2023. కొన్ని పనులు వాయిదా పడతాయి.

By జ్యోత్స్న  Published on  13 Feb 2023 1:36 AM GMT
వీరికి ఆకస్మిక ధ‌న‌లాభ సూచ‌న‌లు

మేషం : కొన్ని పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నూతన రుణాలు చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. జీవిత భాగస్వామితో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

వృషభం : కొన్ని వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విలువైన వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మిధునం : దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. రాజకీయ సంభంధిత సభ, సమావేశాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.

కర్కాటకం : గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో అందుతాయి.

సింహం : కుటుంబ సభ్యులతో చర్చలు సఫలమౌతాయి. వ్యాపారమున స్వంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకులిస్తాయి. బంధువులతో మాటపట్టింపులు తొలగుతాయి.

కన్య: ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు జ్ఞాప్తికి వస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో సఖ్యత కలుగుతుంది.

తుల : ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఇంటాబయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

వృశ్చికం : దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వాహనయోగం ఉన్నది. భూవివాదాల పరిష్కారమౌతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.

ధనస్సు : కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో సఖ్యత లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో కొద్దిపాటి సమస్యలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. దైవచింతన పెరుగుతుంది. బంధు మిత్రులతో అకారణ వివాదాలుంటాయి.

మకరం : చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధన, వస్తువులు బహుమతులుగా పొందుతారు.

కుంభం : వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విందువినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.

మీనం : వృత్తి వ్యాపారలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. బంధువులతో తగాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నూతన రుణాలు చేస్తారు.

Next Story