దినఫలాలు.. నేడు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో లాభాలు

Daily horoscope for 12-12-2022. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రాంతాల సన్నిహితుల నుంచి విలువైన

By జ్యోత్స్న  Published on  12 Dec 2022 1:18 AM GMT
దినఫలాలు.. నేడు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో లాభాలు

మేషం: పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రాంతాల సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

వృషభం: నిరుద్యోగులకు అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేయనుకోవాలి. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మానసికం గా ప్రశాంతత కలుగుతుంది. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. రుణ ఒత్తిడి నుండి బయటపడతారు.

మిధునం: అన్నిరంగాల వారికి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో విబేధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులను కొంత మందకోడీగా సాగుతాయి.

కర్కాటకం: అధికారులు అనుగ్రహంతో ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. భూ క్రయవిక్రయాలలో లాభాలు అందుతాయి.

సింహం: ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఇంటా బయట సమస్యల నుంచి బయటపడతారు. సన్నిహితులు నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

కన్య: విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది.

తుల: పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు.

వృశ్చికం: దైవ అనుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంఘం లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతానానికి విద్య ఈ విషయాలపై దృష్టి సారించడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

ధనస్సు: వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ఆందోళనలు తప్పవు.

మకరం: బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయమై అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

కుంభం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగుల సహోద్యోగులతో వివాదాలు తొలగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రధ్ధ వహించాలి. అన్ని రంగాల వారికి అనువైన కాలం.

మీనం: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలంగా ఉంటాయి. గృహంలో శుభకార్యాల గూర్చి చర్చ జరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషం గా గడుపుతారు. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది.

Next Story