నేటి దిన ఫలాలు.. వారు అప్రమత్తంగా ఉండాల్సిందే.!

Daily horoscope for 12-09-2022. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. నేత్ర ఉదర ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

By అంజి  Published on  12 Sep 2022 4:06 AM GMT
నేటి దిన ఫలాలు.. వారు అప్రమత్తంగా ఉండాల్సిందే.!

మేషం: ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. నేత్ర ఉదర ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి, వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి.

వృషభం: చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

మిధునం: ఉద్యోగాలలో ఆశించిన స్థాన చలనాలు ఉంటాయి. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగులకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. నూతన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు.

కర్కాటకం: గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. దైవ సేవా కార్యాలలో పాల్గొంటారు.దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.

సింహం: దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కన్య: వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.ఆప్తుల నుండి శుభవార్తలు ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది.

తుల: దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

వృశ్చికం: వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. బంధు వర్గం వారితో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి చిక్కులు తప్పవు ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ధనవ్యయ సూచనలు ఉన్నవి.

ధనస్సు: స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేయటం మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం: గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.

కుంభం: చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ప్రయాణాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

మీనం: ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సకాలంలో అందుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసి వస్తాయి ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి

Next Story