దినఫలాలు.. ఈ రాశి వారు నేడు శుభవార్తలు వినే ఛాన్స్.!
Daily horoscope for 10-11-2022. నూతన కార్యక్రమాలను ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ధన సంబంధ విషయాలలో జాగ్రత్తగా
By జ్యోత్స్న Published on 10 Nov 2022 3:33 AM GMTమేషం: నూతన కార్యక్రమాలను ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ధన సంబంధ విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఇంటాబయటా సమస్యలు అధికమవుతాయి. వ్యాపారంలో జీవితభాగస్వామి సలహా తీసుకోవడం మంచిది.
వృషభం: ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వాహనం నడిపే విషయాలలో శ్రద్ధ వహించడం మంచిది. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు. అన్ని రంగాల వారికీ అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
మిధునం: క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. బంధు మిత్రులతో చర్చలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కర్కాటకం: వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉన్నప్పటికీ సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారపరంగా నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సంతానానికి నూతన విద్యా విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.
సింహం:కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో శుభవార్తలు అందుతాయి. స్నేహితుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు అనుకూలత వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి.
కన్య: సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
తుల:నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. సన్నిహితులతో చాలా కాలంగా ఉన్న వివాదాలను పరిష్కారమౌతాయి. ఆరోగ్య విషయాలలో చిన్నపాటి ఇబ్బందులు కలుగుతాయి.
వృశ్చికం: ప్రయాణాలలో వాహనాలు నడిపి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహం వలన ఉన్నత పదవులు లభిస్తాయి. ధన సంబంధ వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. సమాజంలో ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.
ధనస్సు: గృహమున విందు వినోదాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తివ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. దూరప్రాంత బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో జీత భత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.
మకరం: వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ధన పరంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణాలను కొంతవరకు తీర్చి ఊరట చెందుతారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
కుంభం: ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహారించాలి. గృహమున వివాహాది శుభకార్య ప్రస్తావన వస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు జాప్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో కొన్ని విషయాలలో విభేదాలుంటాయి.
మీనం: ఆర్థిక పరిస్థితి లాభసాటిగా ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశములు లభిస్తాయి. ఇంట బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.