శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Daily horoscope for 10-02-2023.ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.
By తోట వంశీ కుమార్ Published on 10 Feb 2023 1:47 AM GMTమేషం : ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కుటుంబ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.
వృషభం : చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగతాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది.
మిధునం : ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. మాతృ వర్గ బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండటం మంచిది.
కర్కాటకం : కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో గృహమున సంతోషంగా గడుపుతారు.
సింహం : నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. దైవ చింతన పెరుగుతుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.
కన్య : నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. పాత ఋణాలు తీర్చగలుగుతారు. మానసికంగా ప్రశాంతం ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి.
తుల : సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కుటుంబ వాతవరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.
వృశ్చికం : ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకులిస్తాయి. అవసరానికి చేతికి ధనం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. ఇతరులతో కలహాలకు దూరంగా ఉండటం మంచిది.
ధనస్సు : బంధు, మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగతుంది. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. ధనవ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి.
మకరం : ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు.
కుంభం : సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనం : నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లోటు ఉండదు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో దైవ క్షేత్రాలు సందర్శించుకుంటారు.