నిరుద్యోగప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి

Daily Horoscope for 08-02-2023.ఋణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

By జ్యోత్స్న  Published on  8 Feb 2023 1:55 AM GMT
నిరుద్యోగప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి

మేషం : ఋణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగమున అధికారులతో నూతన సమస్యలు తప్పవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు.

వృషభం : నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

మిధునం : దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ధన వ్యవహారాలు అంతగా కలసిరావు. నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి.

కర్కాటకం : వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులు సహాయంతో పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటాబయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.

సింహం : ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి.

కన్య : నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చూడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత ఋణాలు తీరుస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది.

తుల : ఉద్యోగమున అందరితో సఖ్యతగా వ్యవహరించిన ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

వృశ్చికం: వృత్తి వ్యాపారాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. ఇంటాబయట ఒత్తిడులు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పితృవర్గం వారితో మాట పట్టింపులుంటాయి. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది.

ధనస్సు : వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. నిరుద్యోగప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం :వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. గృహనిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున మీ మాటకు విలువ మరింత పెరుగుతుంది. ఇతరుల అవసరానికి సైతం ధన సహాయం చేస్తారు. వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది.

కుంభం: ఆర్థిక వ్యవహారాలు ఆశజనకంగా ఉంటాయి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు.

మీనం: ఉద్యోగమున చిన్న పాటి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. నూతన పెట్టుబదుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడుతాయి.

Next Story